మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కన్నా.. పవర్ స్టార్ పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ నుంచే తీవ్ర సెగ తగులుతోందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గుడివాడ నియోజ కవర్గంలో ఐదు సార్లుగా కొడాలి విజయం సాధిస్తున్నారు. దీంతో తనకు తిరుగేలేదని ఆయన అంటున్నారు . ఒకవేళ టీడీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే.. దానిని తప్పుబడుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు. బండ బూతులు తిడుతున్నారు.
దీంతో టీడీపీ నేతలు ఎందుకులే.. ఈయన నోట్లో నోరు పెట్టడం.. అని మౌనంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఈ రోల్‌ను జనసేన తీసుకున్నట్టు తెలుస్తోంది. గుడివాడలో పవన్‌కు సినీమా పరంగా అభిమానులు ఉండడం.. ఆయన హవా ఎక్కువగా ఉండడం.. యువతలో క్రేజ్ ఉండడం తో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ల మధ్య పొత్తు పొడిస్తే.. ఖచ్చితంగా.. ఈ సీటును టీడీపీ ఆ పార్టీకే వదిలేస్తుందనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది.
దీంతో ఇక్కడ కొన్నాళ్లుగా జనసేన హవా పెరుగుతోంది. తాజాగా గుడివాడ ప్రధానరహదారులు బాగోలేదం టూ.. జనసేన నాయకులు కొడాలి నాని ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అదేసమయంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కొడాలికి తీవ్ర సెగే తగులుతోంది. టీడీపీ మాదిరిగా.. జనసేనపై ఆయన విమర్శలు చేయలేరు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన నమ్ముకున్న యువత.. పవన్ అభిమానులే.
అదే సమయంలో పవన్‌ను కూడా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని జనసేన నాయకులు బాగానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జనసేన నాయకులు తన ఇంటిని చుట్టుముట్టినా.. కొడాలి నాని కిక్కురుమనకపోవడం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. మున్ముందు.. కొడాలికి.. జనసేన మొగుడు అవడం ఖాయమనిఅంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates