ఏపీ సీఎం జగన్ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అంబేడ్కర్ పేరును తొలగించిన మీరు.. ఆయనకు ఆరాధ్యులా..? ఆయనకు నివాళులర్పించే అర్హత మీకుందా? అని వ్యాఖ్యానించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే “ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ” పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు… ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం… ఇప్పుడు “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించింది. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates