Political News

పవన్ ఇలా చేస్తాడా… చెంపలేసుకున్న నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెంపలేసుకున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నందుకట. నిజానికి రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఏదో ఓ స్దాయిలో రెండుపార్టీలు లాభపడతాయి. కానీ విచిత్రమేమిటో రెండుపార్టీలు ఘోరంగా నష్టపోయాయి. అప్పటికే సిపిఐకి ఉన్నదేమీ లేదులేండి కొత్తగా నష్టపోవటానికి. కానీ ఎన్నికలైపోయిన ఏడాదిన్నర తర్వాత పొత్తు పెట్టుకుని తప్పు చేశామని ఇపుడు నారాయణ చెంపలేసుకోవటం ఏమిటో అర్ధం …

Read More »

బాబు ఎత్తు.. జ‌గ‌న్ పై ఎత్తు..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎవ‌రి సొంత‌మూ కాదు. తాడి త‌న్నేవాడికి త‌ల‌త‌న్నేవాడు ఉంటాడ‌న్న‌ట్టుగా రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేసేందుకు నాయ‌కులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రాష్ట్రంలోని పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గాల‌ను కేంద్రంగా చేసుకుని ఇంచార్జులను నియ‌మించింది. త‌ద్వారా.. పార్టీపై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయేందుకు చంద్ర‌బాబు భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. ఈ వ్యూహం ఫ‌లిస్తే.. టీడీపీకి 2014 నాటి క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌నేది ఆ …

Read More »

కరోనా మరణాలను భారత్ దాచిపెడుతోంది: ట్రంప్

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం వహించారని, అందుకే లక్షలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరోనా వైరస్‌ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని…కరోనాతో జీవితాలు ముగిసిపోలేదని, ఆర్థికాభివృద్ధి ఆగిపోలేదని….కరోనా ఓ ఫ్లూ వంటిదని ట్రంప్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శించాయి. కరోనాకు భయపడి దేశం మొత్తం లాక్ డౌన్ …

Read More »

ఏడు దశాబ్దాల ప్రభుత్వాసుపత్రుల చరిత్ర తిరగరాయాలి:జగన్

తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ పథకాల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చాలా సార్లు స్పష్టం చేశారు. మాట తిప్పను… మడమ తిప్పను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగానే ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు జగన్. ముఖ్యంగా వైద్య, విద్యారంగాలకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చిన జగన్ …

Read More »

బాబు నమ్మిన కొద్ది మందే హ్యాండిస్తున్నారే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ విష‌యంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. అంత తేలిక‌గా ఎవ‌రినీ న‌మ్మే నాయ‌కుడు కూడా కార‌ని పేరుంది. అయితే, ఆయ‌న సాహ‌సం చేసిన న‌మ్మిన వారిలో చాలా మంది నాయ‌కులు ఆయ‌న‌కు హ్యాండివ్వ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును పొందిన కుటుంబం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఈలి ఫ్యామిలీ. ఈలి ఆంజ‌నేయులు, …

Read More »

`బాబ్రీ` తీర్పుతో న్యాయాన్ని సమాధి చేశారు:ప్రకాష్ రాజ్

ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. 1992 డిసెంబరు 6వ తేదీన జరిగిన బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు బీజేపీ మహిళా నేత ఉమాభారతి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై ఎంఐఎం …

Read More »

స్నేహం మిస్ ఫైర్… ఏపీపై కేసీఆర్ ఫైర్

పార్టీ ప‌రంగా రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పాల‌న ప‌రంగా మాత్రం.. ఏపీతో క‌లిసి ముందుకు సాగుతాం.. రాష్ట్ర ప‌రంగా భౌతికంగా విడిపోయినా.. అన్న‌ద‌మ్ముల మాదిరిగా క‌లిసి ఉందాం. మ‌న స‌మ‌స్య‌లల్ల‌.. వేరొక‌రు వేలు పెట్ట‌కుండా చూసుకుందాం – ఇదీ.. తెలంగాణ నాయ‌కుడిగా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పేమాట‌. మ‌రీ ముఖ్యంగా ఏపీలో ఏ నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌డితే.. ఇరు రాష్ట్రాలూ కీచులాట‌లు లేకుండా ముందుకు సాగుతాయ‌ని …

Read More »

జై శ్రీరామ్…నా నిబద్ధతకు ప్రతిబింబం ఈ తీర్పు:అద్వానీ

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో ప్రత్యేక సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతీ, …

Read More »

జ‌న‌సేన‌కు స‌క్సెస్ ఇవ్వ‌ని వైట్ కాల‌ర్ పాలిటిక్స్‌

పాలిటిక్స్ అంటేనే.. ఏ రోజుకు ఆరోజు ఉన్న ప‌రిస్థితులకు అనుగుణంగా మార్పులు తెచ్చుకుని ముందుకు సాగే ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. అలాంటి రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఉండాల్సింది.. దూకుడు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే చొర‌వ! పైగా మారుతున్న నేటి రోజుల్లో మారుతున్న వ్యూహాల‌కు అనుగుణంగా.. రాజ‌కీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య వంటి వారు చేసిన రాజ‌కీయాలు చేస్తామంటే.. వినేవారు.. క‌నేవారు కూడా నేడు క‌రువ‌య్యారు. అంతా సంచ‌ల‌న‌మే.. …

Read More »

ఇన్ని వ్య‌తిరేక‌త‌ల్లోనూ.. మోడీ గ్రాఫ్ దూకుడు.. రీజ‌నేంటి?

దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్త్యంగా కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇటీవ‌ల టైమ్ మేగ‌జీన్ నిర్వ‌హించిన అత్యంత ప్ర‌తిభావంతులైన నాయ‌కుల్లో మోడీ చోటు సంపాయించుకున్నారు. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ఆయ‌న నాయ‌క‌త్వానికి జోహార్లు.. అంటూ.. కొనియాడింది. ఇక‌, దేశంలో చూసుకుంటే.. ఆయ‌న‌ను నేరుగా ఎదిరించే.. ఎద‌ర్కొనే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? నిజంగానే ఆయ‌న నాయ‌క‌త్వ ప‌టిమ అలాంటిదా? లేక ఎలాంటి …

Read More »

ఏపీ మంత్రుల‌కు వ‌న్ ఇయ‌ర్ టార్గెట్‌.. విష‌యం ఏంటంటే!

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి.. దాదాపు ఏడాదిన్న‌ర పూర్త‌వుతోంది. ఈ కాలంలో అనేక కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌జ‌ల‌కు.. ప్రభుత్వ సేవ‌ల‌ను చేరువ చేశారు. ఈ క్ర‌తువులో ముఖ్యంగా కీల‌క భూమిక పోషించాల్సిన పాత్ర‌ను మంత్రుల‌పైనే పెట్టారు సీఎం జ‌గ‌న్‌. ప్ర‌జ‌ల‌కు చేరువ అవండి.. ప్ర‌జ‌ల‌లో ఉండండి.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వారికి చేరువ చేయండి.. ఇలా అనేక రూపాల్లో దిశానిర్దేశం చేశారు. మ‌రి ఈ ప్ర‌ణాళిక‌ను పాటించింది ఎంత‌మంది? …

Read More »

ఈ తిరుగుబాటు మోడీ ఊహించలేదా?

వ్యవసాయ సంస్కరణలపై కేంద్రప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా మెల్లిగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలోని పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు ఆందోళలన పేరుతో రెడ్డెక్కిన విషయం అందరికీ తెలిసిందే. గడచిన పదిరోజులుగా పంజాబ్ లో రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాని ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం ఎన్డీఏ లో నుండి అకాలీదళ్ బయటకు వచ్చేసింది. ముందుగా అకాలీదళ్ తరపున మంత్రి …

Read More »