Political News

త‌మిళ ఎంపీల‌తో మ‌నోళ్ల‌కు క్లాసిప్పించాల్సిందే!!

మ‌న‌లో మ‌నం ఎన్ని అనుకున్నా.. పొరుగువారి ముందు మాత్రం మ‌న ఐక్య‌త చాటాల‌నే సూత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగ‌వుతోంది. ఎక్క‌డ వేదిక దొరికినా.. అది ఏపీనా.. ఢిల్లీనా.. అనే తేడా లేకుండా వైసీపీ-టీడీపీ నేత‌లు జుట్టూ జుట్టూ ప‌ట్టుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా .. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. అధికార ప‌క్షం …

Read More »

నాన్చుడు ధోర‌ణి.. టీడీపీని ముంచేస్తోందా?

ఆలోచ‌న మంచిదే. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే ఏదైనా నిర్ణ‌యం తీసుకోవాల‌నే ధోర‌ణి కూడా మంచిదే. అయితే, ఈ ఆలోచ‌న‌ల‌కు ఎంత స‌మ‌యం కావాలి? ఎన్నాళ్లు ప‌ట్టాలి? అనేదే కీల‌కం. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను.. అనే ధోర‌ణిని నేటి రాజ‌కీయ నేత‌లు జీర్ణించుకోలేరు. ఫ‌టా ఫ‌ట్‌-ధ‌నా ధ‌న్ అనుకున్న‌ది అయిపోవాలి. మంచో చెడో నిర్ణ‌యం తీసేసుకోవాలి. ఇదే ప్ర‌స్తుత నేత‌లు ఆశిస్తోంది. అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ …

Read More »

హైదరాబాద్ డొల్లతనాన్ని చెప్పిన ఆ విషాదం

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా పాలకులు తెగ పొగిడేస్తుంటారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఎంత అభివృద్ధి సాధిస్తే ఏముంది.. ఒక భారీ వర్షం వస్తే నగరం సగం మునిగిపోతుంది. రోడ్ల మీద నీటి కుంటలు కనిపిస్తాయి. తాజా వర్షాలకు టోలిచౌకి ప్రాంతం చెరువులా మారిన దృశ్యాలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఐతే ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులే అని కొట్టి పడేయడానికి కూడా …

Read More »

ఈ దూకుడుతో సాధించేందేంటి? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

రాజ‌కీయాల్లో దూకుడు మంచిదే. అయితే, ఈ దూకుడు పార్టీకి ప్ర‌మాద‌క‌రం కాకుండా చూసుకోవాలి. అదే స‌మ‌యంలో నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్ట‌కుండా కూడా చూసుకోవాలి. ఈ విష‌యంలో పార్టీలు అనుస‌రించే వ్యూహం అత్యంత కీల‌కం. గ‌తంలో చంద్ర‌బాబు ఇలా దూకుడుగా ముందుకు వెళ్లి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను అవ‌స‌రం లేకున్నా చేర్చుకున్నారు. దీంతో ఏం జ‌రిగింది. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపు రాజ‌కీయాలు వ‌ర్గ పోరు పెరిగిపోయి.. పార్టీ పైకి …

Read More »

వ‌ర్ల వ‌ర్సెస్ ప‌న‌బాక‌: ఎంపీ టికెట్ రేసులో పోటా పోటీ

టీడీపీలో మ‌ళ్లీ టికెట్ల పోర ప్రారంభ‌మైందా? నాయ‌కులు పోటీ ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వ‌స్తోంది.. టీడీపీ నేత‌ల నుంచి. తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుడు, వైసీపీ నాయ‌కుడు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు.. రెండు రోజుల కింద‌ట అనారోగ్యం కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే, దీనికి సంబంధించి ఆరు మాసాల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో టీడీపీ కీల‌క‌మైన ఇద్ద‌రు నేత‌లు …

Read More »

చైనాకి ఆ నలుగురి షాక్… భారత్ బలం పెరుగుతోంది

India China

డ్రాగన్ దేశం దురాగతాలను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాలు ఏకం అవుతున్నాయి. కొద్ది నెలలుగా భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యాలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అందరు చూస్తున్నదే. మొదట లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ తర్వాత ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోను దుస్సాహసానికి పాల్పడుతోంది. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేసినపుడల్లా మన సైన్యాలు ధీటుగా సమాధానం చెబుతున్న కారణంగా డ్రాగన్ పన్నాగాలు ముందుకు సాగటం లేదు. లేకపోతే మన …

Read More »

శ్రీవారికి ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని లేదు: ఐవైఆర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం …

Read More »

టిడిపి లాయర్లే జడ్జీలయ్యారా ? వైసిపి ఎంపి సంచలనం

తెలుగుదేశంపార్టీకి లాయర్లుగా పనిచేసిన వాళ్ళే తర్వాత జడ్జీలయ్యారంటూ వైసిపి ఎంపి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మిథున్ పై ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపికి సన్నిహితంగా ఉన్న లాయర్లే తర్వాత జడ్జీలైనపుడు న్యాయవ్యవస్ధ నుండి నిష్పాక్షిక తీర్పులను ఎలా ఆశించగలమంటూ మిథున్ వేసిన ప్రశ్న సంచలనంగా మారింది. చట్టసభల అధికారాలను ఏపిలో హై కోర్టులు తీసేసుకుంటున్నాయంటూ ఎంపి మండిపోయారు. ప్రస్తుతం …

Read More »

వ్యాక్సిన్ డెలివరీ అంత కష్టమా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటి లేదు. ఓవైపు జోరుగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటం ఎలా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వందల కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేయాల్సి ఉంటుంది. దాన్ని భరించే శక్తి చాలా దేశాలకు లేదు. దీంతో.. …

Read More »

కండువా కప్పుకోరు.. కానీ పార్టీ మారనున్న తెలుగు తమ్ముడు

అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల మాదిరి వాలే నేతల్ని చేరదీసి..పదువులు ఇచ్చే చంద్రబాబుకు.. తర్వాతి కాలంలో అలాంటి వారిస్తున్న షాకులు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ హయాంలో పదవులు పొందక తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు.. ఒక్కొక్కరిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చూస్తున్నదే. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బ తీయటానికి అధికార పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని పఠిస్తుంటుంది. అందుకు …

Read More »

మన ప్రముఖుల డేటా ఆలీబాబా ద్వారానే డ్రాగన్ కు చేరిందా ?

అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. దేశంలోని సుమారు 10 వేలమంది ప్రముఖుల వ్యక్తిగత, అధికారిక డేటా మొత్తాన్ని చైనా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. భారత్ తో ప్రత్యకంగా పోరాటం చేయలేని డ్రాగన్ దేశం దొంగదెబ్బ తీయటానికి రెడీ అయిపోయిందట. చైనా దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ గ్రూపు, వాణిజ్యసంస్ధ ఆలీబాబా ద్వారా మనదేశంలోని అత్యంత ప్రముఖుల డేటాను తీసేసుకుందని ప్రభుత్వానికి నివేదిక అందింది. మనదేశంలో …

Read More »

వీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయా ?

అధ్యక్షుడిగా నియమితుడైన దగ్గర నుండి రెండు నెలలు హ్యాపీగానే గడిపేసిన సోమువీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యయా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటమే తలనొప్పులకు ప్రధాన కారణమని అంటున్నారు. వీర్రాజు ఏర్పాటు చేసిన 40 మందితో కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, పదిమంది కార్యదర్శులు, 5 మంది ప్రధాన కార్యదర్శులు కీలకంగా ఉన్నారు. అయితే ఆ పోస్టుల్లోకి అధ్యక్షుడు ఎంపిక చేసిన …

Read More »