Political News

రేపు వ‌చ్చేది నేనే.. క‌ట్టిస్తా చూడు-నారా లోకేష్‌

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మీద జ‌నాల్లో ఏమంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. తండ్రి పేరు చెప్పుకుని పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు సంపాదించాడ‌ని, సొంత స‌త్తా లేద‌ని అత‌డి మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండేవి. ప‌ప్పు ప‌ప్పు అంటూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు లోకేష్‌ను బాగా ట్రోల్ చేసేవాళ్లు. కానీ గ‌త రెండు మూడేళ్ల‌లో లోకేష్ చాలా క‌ష్ట‌ప‌డి నాయ‌కుడిగా …

Read More »

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏదైనా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ప్పుడు మాత్ర‌మే మీడియాతో మాట్లాడేవారు. కానీ, తాజాగా రాజ్‌భ‌వ‌న్‌లో ఆమె ప్రెస్‌మీట్ పెట్టారు. అంతేకాదు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు సైతం చేశారు. త‌న ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నార‌నే సందేహం ఉంద‌న్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల‌కు కోట్లు ఇచ్చి.. కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్న‌.. ఫామ్‌హౌజ్ ఇష్యూలోనూ త‌న‌ను ఇరికించాల‌ని చూశార‌ని.. సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. రాజ్‌భవన్‌.. ప్రగతి భవన్‌ …

Read More »

మోడీ విజిట్‌.. వైసీపీ ప్లాన్ ఏంటి..!

Modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈనెల 11న విశాఖ‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతాకాదు. విశాఖ‌లో ఏర్పాట్ల‌ను సైతం ద‌గ్గ‌రుండిమ‌రీ చూసుకుంటున్నారు. అదే స‌మయంలో మోడీ విశాఖ‌లోని ఏయూలో పాల్గొనే బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నాల‌ను త‌ర‌లించాల‌ని కూడా వైసీపీ నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన బాధ్య‌ల‌ను విశాఖ ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నాయ‌కులు అంద‌రూ కూడా …

Read More »

మీవల్లే మాపై వ్యతిరేకత.. అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వ విధానాలు ఏ మాత్రం సరిగా లేవని.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న మాట వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు మింగుడుపడనివిగా మారాయి. అధికారుల తీరుపై ఆగ్రహం …

Read More »

రాహుల్ నామాలు కలిసొచ్చేనా?

సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ మనుగడ కోసం తాపాత్రయపడుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రను గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఫామ్ లోకి తీసుకు రావడానికి రాహుల్ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక జనాల్లో వీలైనంత వరకు తన స్థాయిని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతొంది. ఇటీవల మహారాష్ట్ర మీటింగ్ లో రాహుల్ అడ్డ బొట్టు పెట్టుకొని శివ భక్తులను …

Read More »

భార‌త్ జోడో యాత్ర‌కు భారీ దెబ్బ‌

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన‌ భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ యాత్ర‌కు ఇప్పుడు భారీ దెబ్బ‌త‌గిలింది. ట్విటర్‌ ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బెంగళూరులోని కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన పాటలకు కేజీఎఫ్‌-2 చాప్టర్‌లోని పాటల మ్యూజిక్‌ను కాపీ కొట్టారంటూ ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం …

Read More »

ఔను.. మా జగన్ ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త ఉంది..

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఇటీవ‌ల రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు ముందుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో మీడియ‌లో సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇప్పుడు త‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌లు మ‌రింత ఏవ‌గించుకుంటున్నార‌ని ఒక‌వైపు టీడీపీ …

Read More »

మరో వివాదంలో గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇటీవల నగ్న వీడియో కాల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై బురద జల్లేందుకే ఆ వీడియోను మార్ఫ్ చేశారని మాధవ్ ఆరోపించారు. కానీ, ఆ వీడియోలో ఉన్నది మాధవేనని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయం చెప్పారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. …

Read More »

Viral Video: ఏపీ మంత్రి ఇంగ్లీష్ ఛానెల్లో ఇంగ్లీష్ మాట్లాడితే..

పొలిటికల్ లీడర్లు టీవీ ఛానెళ్లలో, అందులోనూ ఇంగ్లిష్ ఛానెళ్లలో డిబేట్లకు వెళ్లాలన్నా.. మధ్యలో అభిప్రాయం చెప్పాలన్నా కొంచెం డొక్క శుద్ధి, భాషా నైపుణ్యం చూసుకుని రంగంలోకి దిగితే బెటర్. అదేమీ చూసుకోకుండా పిలిచారు కదా అని మనకు నచ్చినట్లు వాదించేద్దాం, ఒపీనియన్ చెప్పేద్దాం అనుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయం. ఇంగ్లిష్ రానపుడు నాకు వచ్చింది ఇదే అంటూ తెలుగులో మాట్లాడేస్తే దాన్ని అనువాదం చేసుకోవడానికి వాళ్ల పాట్లేవో వాళ్లు …

Read More »

మళ్లీ మానవత్వం చాటుకున్న పవన్

రాజకీయ పార్టీలంటే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం.. వాటిని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించడమే చూస్తుంటాం. కానీ పార్టీ పెట్టిన వ్యక్తి కోట్ల కొద్దీ తన ఆదాయాన్ని పార్టీ ఫండ్ కింద ఇవ్వడం.. ఆ డబ్బుల్లోంచి అభాగ్యులకు సాయం చేయడానికి పెద్ద మొత్తంలో కేటాయించడం ఒక్క పవన్ కళ్యాణ్‌ విషయంలోనే జరుగుతోంది. ఇటీవలే ఒక సమావేశంలో భాగంగా ఆరేళ్లుగా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తూ పార్టీ కోసం అందులోంచి ఎంత కేటాయించింది.. …

Read More »

ప‌వ‌న్ ఇచ్చిన హామీకి మైలేజీ వ‌స్తోందా… !

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని ఏపీలో అధికారం చేప‌డ‌తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల ఒక సంచ‌ల‌న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎన్నోఏళ్లు గా ఎదురు చూస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూట‌రి పింఛ‌న్ ప‌థ‌కం)ను ర‌ద్దు చేస్తామ‌ని, తాము అధికారంలోకి రాగానే రెండో సంత‌కం ఈ ఫైలుపైనే పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు. వాస్తవానికి ఇది పెద్ద హామీ అనే చెప్పుకోవాలి. పైగా.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు …

Read More »

అక్కడ బలం పెంచుకుంటున్న వైసీపీ

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్‌గా ఉంది. టీడీపీకి కంచుకోట అనే ఈ జిల్లాపై వైసీపీ అధినేత జ‌గ‌న్ క‌న్నేశారు. ఇక్క‌డ ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌ట్టు పెంచుకునేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని టెక్క‌లిలో ఓడించి తీరాల‌నేది ఆయ‌న సంక‌ల్పంగా ఉంది. అందుకే ఇక్క‌డ టికెట్‌ను కూడా దువ్వాడ శ్రీనివాస్‌కు ముందుగానే క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కుల‌ను అలెర్ట్ చేశారు. …

Read More »