తెలంగాణాలో రాజకీయపార్టీల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. సర్వే ఫలితాలంటు ఏ పార్టీకి ఆ పార్టీ జనాల మైండ్ సెట్ మార్చుందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాయి. మొదటేమో ఆరా సంస్ధ సర్వే అంటు ఒకటి వెలుగుచూసింది. ఇందులో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పింది. ఓట్ల శాతం తగ్గిపోతుందటకానీ అధికారం మాత్రం టీఆర్ఎస్ దే అని చెప్పింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మండిపడ్డారు. తర్వాత మరో సంస్ధ …
Read More »తొందరలోనే జగన్ ‘ప్రజాదర్బార్’
ప్రతిరోజు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మమేకం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నారు. తన క్యాంపు కార్యాలయంలోనే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు చేస్తున్నారు. పరిస్ధితులన్నీ కుదిరితే ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదట్లోనే ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. జనాలతో పాటు ప్రజా ప్రతినిధులు, నేతల నుండి వివిధ సమస్యలపై వచ్చే వినతులను పరిశీలించి …
Read More »మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకుంటోందా ?
తొందరలోనే మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకోబోతోందనే ప్రచారం మొదలైంది. గతంలో ఉన్నట్లే షాపులన్నింటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేయాలని జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో డిసైడ్ అయ్యిందట. ఇంతటి కీలక నిర్ణయానికి కారణం ఏమిటంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవటమేనట. ప్రస్తుతం మద్యం ద్వారా ఆదాయం బాగానే వస్తున్నా అనుకున్నంత స్ధాయిలో రావటం లేదని ఉన్నతాధికారులు బాధపడిపోతున్నారట. ప్రస్తుతం మద్యం ద్వారా ఏడాదికి సుమారు రు. 25 …
Read More »రోజాకు షాక్.. మన పార్టీని నమ్ముకుని అప్పులపాలయ్యామని ఫ్లెక్సీ
వైసీపీ కీలక నాయకురాలు.. ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే భారీ సెగ తగిలింది. అది కూడా ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆమెను కొందరు నిలదీశారు. తాము వైసీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నామని.. అయితే.. తమకు పార్టీని నమ్ముకున్నందుకు అప్పులు మిగిలాయని.. బాధితులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు ప్రదర్శించి.. నిరసన తెలిపారు. దీంతో మంత్రి రోజాకు ఏం …
Read More »ఏపీ బీజేపీ నోటికి తాళం
రాష్ట్ర బీజేపీ నాయకులకు పెద్ద సమస్య వచ్చింది. ఏ గట్టునుండాలో తెలియక నాయకులు సతమతం అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలను, మంత్రులను.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టానుసారం గా విమర్శించిన.. బీజేపీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు ఒక్కసారిగా పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. టీడీపీ విషయంలోనూ నాయకులు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. వైసీపీని విమర్శిస్తున్న క్రమంలోనే తరచుగా.. టీడీపీపైనా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము …
Read More »టీడీపీ వర్సెస్ వైసీపీ.. సర్వే ఫైట్..!
ఏపీలో మరో వివాదం.. రెండు ప్రధాన పార్టీలనూ కుదిపేస్తోంది. అదే.. సర్వే రిపోర్టు. తాజాగా సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ.. ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల ప్రోగ్రస్‌పై.. ఈ సంస్థ రెండు రోజుల కిందటే సర్వే రిపోర్టు ఇచ్చింది. దీనిలో దేశంలోని 25 మంది ముఖ్యమంత్రుల పనితీరుకు మార్కులు వేసింది. తొలిస్థానంలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం …
Read More »ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద దాడి.. వాహనం ధ్వంసం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతకంతకూ బలపడుతోందని.. అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు మొదలైనట్లేనన్న వాదన అంతకంతకకూ పెరుగుతున్న వేళ.. దానికి సాక్ష్యంగా ఇటీవల విడుదలైన సర్వేలు చెబుతున్న వేళ.. అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నేత ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనం మీద దాడి జరిగిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? దాడి చేసే వరకు విషయం ఎందుకు …
Read More »పార్టీల మధ్య ‘ఆరా’ కొత్త చిచ్చు
అసలే మూడు ప్రధాన పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీజేపీ సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తంది. వీళ్ళద్దరు కాదు అధికారం మాదే అని కాంగ్రెస్ నేతలు తొడలు చరుస్తున్నారు. దీంతో తెలంగాణాలో రాజకీయ వేడితో వాతావరణమంతా బాగా కాలుష్యమైపోయింది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే ఆరా …
Read More »వాలంటీర్లకు ఎన్నికల విధులకు దూరం పెట్టాలి: ఈసీ
దేశంలో మరెక్కడా లేని రీతిలో గ్రామ.. వార్డు సచివాలయాల కాన్సెప్టును తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. దాన్ని పూర్తిగా పాలనా రథాన్ని పరుగులు తీయించేందుకు వినియోగిస్తే.. ఇదో చక్కటి కార్యక్రమంగా మారటమే కాదు.. పౌరసేవల లభ్యత అంశం మెరుగుపడటమే కాదు.. దేశానికో చక్కటి మోడల్ లభించేది. కానీ.. వాలంటీర్లతో పాలనా పనులతో పాటు రాజకీయ అంశాల్ని కూడా చేయించాలన్న అప్రకటిత ఎజెండా పుణ్యమా అని.. ఈ వ్యవస్థపై వచ్చిన ఆరోపణలు అన్ని …
Read More »కాగల కార్యం రేవంత్ తీర్చినట్లు.. కేసీఆర్ బిందాస్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడకు తెరదీశారా..? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు తను కోరుకుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అమలు చేస్తున్నారా..? తన చేతికి మట్టి అంటకుండానే రేవంత్ కానిచ్చేస్తున్నారా..? కేసీఆర్ వ్యూహంలో రేవంత్ చిక్కుకుపోయారా..? తనకి తెలియకుండానే పరోక్షంగా కేసీఆర్ కు సహకరిస్తున్నారా..? అంటే అవుననే చర్చ జరుగుతోంది. అది పార్టీలో చేరికల విషయంలో కేసీఆర్ భారాన్ని రేవంత్ తగ్గిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో కారు …
Read More »పార్లమెంటులో తిట్ల దండకం నిషేధం..!
పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యుల మధ్య తిట్ల దండకం ఇక కుదరదు. ఒకరిపై ఒకరు దారుణాతి దారుణంగా దూషణలు కొనసాగిస్తామంటే.. వీలు కాదు. ఈ మేరకు పార్లమెంటు కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఇందుకు …
Read More »రేవంత్ టార్గెట్ ఆ 20 మంది..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో కనపడుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారా..? అధిష్ఠానం అండతో దూసుకుపోతున్నారా..? టీఆర్ఎస్, బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందు వరుసలో నిలిచిందా..? అందుకే ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయా..? రేవంతును వ్యతిరేకించే సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారా..? ఇక ఆయన టార్గెట్ ఆ ఇరవై మంది నేతలేనా..? అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates