తెలంగాణ బీజేపీ మరో 15 మంది కీలక నేతలపై కన్నేసిందా? వారిని కూడా త్వరలోనే పార్టీలోకి ఆహ్వానిం చనుందా? వారుకూడా సిట్టింగు ఎమ్మెల్యేలేనా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్. దీనికి సంబంధించి తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. తమతో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. చెప్పారు.
అధికార టీఆర్ ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. భువనగిరి పట్టణంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఎమ్మెల్యేల జంపింగులపై మాట్లాడారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు.
త్వరలోనే అది కూడా ఏడాదిలోనే రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోడీ పథకాలను ప్రశంసించారని ఆయన తెలిపారు. పార్టీలో చేరే వారికి సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు. టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదన్నారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో బీజేపీ పథకాలను ప్రశంసించారని చెప్పారు.
ఎన్నికల వరకు తన ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి స్పష్టం చేశారు. మధ్యలో ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని.. వాటినే తమ మేనిఫెస్టోలో పెడతామని పేర్కొన్నారు. పార్టీలో అందరికీ సముచిత గౌరవం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పాత్రికేయులను ఆదుకునే బాధ్యత తమదే అని.. ఆయు ష్మాన్ భారత్లో జర్నలిస్టులను చేర్చే విషయం చర్చిస్తానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates