Political News

ఆ మూడు విష‌యాల్లో క్లారిటీ కావాలి.. ‘త‌మ్ముళ్ల’ మాట ఇదే!!

ఏపీ రాజ‌కీయాల్లో టీడీపీ శైలి విభిన్నం. ఏం చేసినా.. ఒక ప్ర‌ణాళిక‌ప్ర‌కారం.. ఒక నిర్దిష్ట విధానం ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. ఎక్క‌డా అజాగ్ర‌త్త‌ల‌కు తావుండ‌దు. అందుకే.. క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న పార్టీగా.. ఎప్ప‌టి నుంచో టీడీపీకి పేరుంది. అయితే..రాను రాను ఈ విష‌యంలో నాయ‌కుల శైలి మారుతోంది. గ‌తంలో సంస్థాగ‌తంగా పార్టీని అభివృద్ధి చేసిన నాయ‌కులు.. ఇప్పుడు.. త‌మ మేలుకోసం ప‌రిత‌పిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. “మాకేంటి?” అనే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో …

Read More »

‘జోడో’తో జ‌య‌మెంత‌? కాంగ్రెస్‌లో అంత‌ర్మ‌థ‌నం

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభమైంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పాద‌యాత్ర‌ను కాంగ్రెస్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. …

Read More »

అపుడు మమత, కేసీఆర్ … ఇపుడు నితీష్

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేయడానికి మూడో కృష్ణుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ మూడో కృష్ణుడంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనే అర్ధం. మూడో కృష్ణుడని ఎందుకంటున్నామంటే మొదటి ప్రయత్నం బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేశారు కాబట్టి. రెండో ప్రయత్నం తెలంగాణా సీఎం కేసీయార్ చేశారు. మమత ఇప్పటికే ఫెయిలయ్యారు. కేసీఆర్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకనే ఇపుడు ముచ్చటగా మూడో ప్రయత్నం నితీష్ మొదలుపెట్టారు. ఢిల్లీలో …

Read More »

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎంతో తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం ఢిల్లీలో ముఖ్యనేతలతో మేథోమథనం జరిగింది. జేపీ నడ్డాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 144 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. …

Read More »

టీఆర్ఎస్ సన్నిహితులే టార్గెట్టా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం టీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. లిక్కర్ స్కాం తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఉన్నతాధికారులు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ లోనే ఆరు చోట్ల దాడులు చేయడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ దాడులు కూడా టీఆర్ఎస్ కు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళ …

Read More »

పవన్ ను ఏకాకిని చేసిన బీజేపీ?

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. సర్వేలు, రిపోర్టులు, ప్రోగ్రెస్ కార్డులతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీచేసేందుకు సిద్ధమవుతుండగా… పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేనలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుండగా… సమయం, …

Read More »

రాహుల్ హామీలు వర్కవుటవుతాయా?

అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు.  పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ …

Read More »

ఆ పొరపాటే కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా?

రాజకీయంగా తమకు ఎదురుండకూడదనే ఎవరైనా అనుకుంటారు. ఇందుకు ఒక్కొక్కరు ఒక్క పంథాను అనుసరిస్తారు. తెలంగాణాలో కేసీయార్ గతంలో అనుసరించిన, ఇపుడు అనుసరిస్తున్న విధానమే ఇపుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. 2014లో అధికారంలోకి వచ్చింది బొటాబొటి మెజారిటితో మాత్రమే. 119 అసెంబ్లీ సీట్లలో అప్పట్లో టీఆర్ఎస్ కు వచ్చింది 64 సీట్లు మాత్రమే. అధికారం అందుకోవాలంటే ఏ పార్టీ అయినా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాల్సిందే. అలాంటిది టీఆర్ఎస్ …

Read More »

గుజ‌రాత్‌లో రాహుల్ హామీలే హామీలు..

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. దీనిని గ‌ట్టెక్కించే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మ‌రిన్ని ఆయుధాలు అందించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జాతీయ స్థాయి పార్టీని ఆయ‌న ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌ను ఆయ‌న టార్గెట్ చేసుకున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లం గ‌త పాతికేళ్లుగా …

Read More »

కేసీఆర్ నమ్మకం ఏంటో ?

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీయార్ ప్రకటించారు. 24 గంటల కరెంటు ఇపుడు తెలంగాణాలో మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని జనాలకు పిలుపిచ్చారు. జనాలు ఆశీర్వదిస్తే కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వెళతానని కూడా చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరు పోరాడాలన్నారు. కొంతకాలంగా నరేంద్రమోడీని కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను జాగ్రత్తగా …

Read More »

నిజామాబాద్ నుంచే జాతీయ రాజ‌కీయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో మోడీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోడీ చేస్తున్న ఏకైక పని అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో …

Read More »

వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది: చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని..  అందుకే టీడీపీ నేత‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన చెన్నుపాటి గాంధీపై దాడిని చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కింధ‌గా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గాంధీపై దాడి …

Read More »