దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్త్యంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇటీవల టైమ్ మేగజీన్ నిర్వహించిన అత్యంత ప్రతిభావంతులైన నాయకుల్లో మోడీ చోటు సంపాయించుకున్నారు. అదేసమయంలో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా ఆయన నాయకత్వానికి జోహార్లు.. అంటూ.. కొనియాడింది. ఇక, దేశంలో చూసుకుంటే.. ఆయనను నేరుగా ఎదిరించే.. ఎదర్కొనే నాయకులు కూడా కనిపించడం లేదు. మరి దీనికి కారణమేంటి? నిజంగానే ఆయన నాయకత్వ పటిమ అలాంటిదా? లేక ఎలాంటి …
Read More »ఏపీ మంత్రులకు వన్ ఇయర్ టార్గెట్.. విషయం ఏంటంటే!
ఏపీలో జగన్ సర్కారు ఏర్పడి.. దాదాపు ఏడాదిన్నర పూర్తవుతోంది. ఈ కాలంలో అనేక కార్యక్రమాలు, పథకాలను తెరమీదికి తెచ్చారు. ప్రజలకు.. ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. ఈ క్రతువులో ముఖ్యంగా కీలక భూమిక పోషించాల్సిన పాత్రను మంత్రులపైనే పెట్టారు సీఎం జగన్. ప్రజలకు చేరువ అవండి.. ప్రజలలో ఉండండి.. ప్రభుత్వ కార్యక్రమాలను వారికి చేరువ చేయండి.. ఇలా అనేక రూపాల్లో దిశానిర్దేశం చేశారు. మరి ఈ ప్రణాళికను పాటించింది ఎంతమంది? …
Read More »ఈ తిరుగుబాటు మోడీ ఊహించలేదా?
వ్యవసాయ సంస్కరణలపై కేంద్రప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా మెల్లిగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలోని పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు ఆందోళలన పేరుతో రెడ్డెక్కిన విషయం అందరికీ తెలిసిందే. గడచిన పదిరోజులుగా పంజాబ్ లో రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాని ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం ఎన్డీఏ లో నుండి అకాలీదళ్ బయటకు వచ్చేసింది. ముందుగా అకాలీదళ్ తరపున మంత్రి …
Read More »‘బాబ్రీ’ కేసులో నిందితులంతా నిర్దోషులే
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా 49 మంది నిందితులు నిర్దోషులేనని లక్నో సీబీఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కాబట్టి నిందితులంతా నిర్దోషులేనని …
Read More »ఏ అవకాశాన్నీ వదలని జగన్ !
ముఖ్యమంత్రి జగన్ పథకాలు గాని, నిర్ణయాలు గాని, ఆలోచనలు గాని భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసుకునే విధంగానే ఉంటున్నాయి. ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బలమైన ఓటు బ్యాంకును తయారుచేసుకునే వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం నియమించనున్న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల్లో అత్యధికారం మహిళలనే నియమించాలని డిసైడ్ అయ్యారు. 56 బీసీ కార్పొరేషన్ల పోస్టులను నియమించాలని …
Read More »ఈరోజు బీజేపీకి అత్యంత కీలకం
దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం …
Read More »జవహర్, ఏలూరి, గన్ని.. విషయంలో బాబు రాంగ్ స్టెప్?
ఒక తప్పు నుంచి పాఠం నేర్చుకుని.. సరిదిద్దుకునే ప్రయత్నం ఎవరైనా ఏ పార్టీలో అయినా..చేస్తారు. కానీ, టీడీపీలో మాత్రం ఆ దిశగా పాఠాలు నేర్చుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వ్యవస్థీకృతంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకు పార్టీ అధినేతగా చంద్రబాబు తాజాగా చేసిన ప్రయోగం.. పార్లమెంటరీ జిల్లా కమిటీలనుఏర్పాటు చేయడం, వాటికి ఇంచార్జ్లను నియమించడం. మంచిదే. ఇప్పటికైనా ఓ కీలక ఘట్టానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. …
Read More »భారత్కు పొంచి ఉన్న మరో వైరస్ గండం
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే …
Read More »టిడిపి, వైసిపిపై బిజెపి కేసులు పెడుతుందా ?
తమపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్న తెలుగుదేశంపార్టీ, వైసిపిలపై సైబర్ చట్టాల క్రింద కేసులు పెట్టాలని బిజెపి డిసైడ్ చేసింది. తమ పార్టీతో పాటు నేతలపై పై పార్టీలు కావాలనే వాట్సప్, వెబ్ సైట్ల ఆధారంగా బురద చల్లుతున్నట్లు బిజెపి నేతలు మండిపడుతున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో మిషన్ ఏపి పేరుతో వాట్సప్ లో ఏర్పడిన ఓ గ్రూపు ద్వారా …
Read More »జగన్ దెబ్బకు కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణమేనా ?
ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతంపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన దృష్టి కారణంగా కార్పొరేట్ స్కూళ్ళకు గ్రహణం మొదలైనట్లే ఉంది. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళ నుండి సుమారు 2.5 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. అలాగే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 70 వేల మంది విద్యార్ధులు ప్రైవేటు బాటను వీడి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారు. ఈ సంఖ్య ముందుముందు మరింతగా పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. …
Read More »బోర్లు వేస్తున్నారు సరే…మరి వీటిని మరచిపోతే ఎలాగ ?
రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ‘వైఎస్సార్ జలకళ’ అనే పథకాన్ని ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చుచేసినా తక్కువనే చెప్పాలి. తాజాగా మొదలైన పథకంలో భాగంగానే నాలుగు సంవత్సరాల్లో 2 లక్షల బోర్లు వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బోరు వేసిన చోట నీళ్ళు పడకపోతే ప్రభుత్వమే మరో చోట బోరు వేయిస్తుందని హామీ ఇచ్చింది. ఈ …
Read More »కీలక పథకాలకు బ్రేకులు.. జగన్ ముందున్న వ్యూహం ఏంటి?
రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అంతర్మథనం జరుగుతోంది. కీలక పథకాలు నిలిచిపోయాయి. ఏం చేయాలన్నా.. ఎక్కడ ఎలాంటి బ్రేకు పడుతుందో.. ఎటు వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు చుట్టుముడతాయోనని పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నాయి. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చి.. ఏడాదిన్నర పూర్తయినా.. ఆయన సంకల్పించిన పథకాలన్నీ పరిపూర్ణంగా అమలులోకి వచ్చి ఉంటే.. ఇది పదేళ్ల పాలనతో సమానమని మేధావులు అంటున్నారు. కానీ, అలా సాగడం లేదు.. కొన్ని …
Read More »