ఔను! ఇప్పుడు హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియో కాల్ విషయం.. దేశవ్యాప్తంగా చర్చ కు వస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి చర్యలకు దిగుతారనేది ప్రధాన టాపిక్. పార్టీలోను, పార్టీ నేతల విషయంలోనూ.. జగన్.. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారనేది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నిజం. అందుకే.. నాయకులు జగన్ తో మాట్లాడాలంటే.. కొన్ని కొన్ని విషయాల్లోచాలా జాగ్రత్తగా ఉంటారు.
ఇక, నాయకుల క్రమశిక్షణ ఎలా ఉన్నా.. మహిళల విషయంలో మాత్రం చిన్న ఆరోపణవచ్చినా.. జగన్ ఒప్పుకొనే ప్రసక్తి లేదనే టాక్ ఉంది. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. పార్టీ నాయకుడు.. సినీ నటుడు.. పృథ్వీకి.. జగన్.. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇది ప్రతిష్టాత్మక పోస్టు. గతంలో అగ్రదర్శకుడు.. కే.రాఘవేంద్రరావు వంటివారు నిర్వహించిన పోస్టు కావడంతో పార్టీలో .. ఈ పోస్టుకు బాగానే పోటీ ఏర్పడింది. పోసాని కృష్ణమురళి కూడా.. ఈ పోస్టును ఆశించారని టాక్.
అయితే.. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. జగన్ మాత్రం.. పృథ్వీకి పిలిచి ఈ పీఠం అప్పగించారు. అయితే.. ఈ పదవి చేపట్టిన నాలుగు మాసాల్లోనే పృథ్వీపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే ఓమహిళపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు అందిన వెంటనే జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని పదవి నుంచి తప్పించారు. అయితే.. తాను ఏ పాపం ఎరుగనని.. అంతా కుట్ర అని.. అప్పట్లోను.. ఇప్పుడు కూడా పృథ్వీ చెపుతున్నారు.
అయినా.. జగన్ మాత్రం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమని.. పేర్కొంటూ.. ఆయనను పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. పార్లమెంటు సభ్యుడే న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడం.. జుగుప్సాకరంగా వ్యవహరించడం.. వంటివి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిని ఎంపీ మాధవ్ ఖండిస్తున్నా.. వీడియోలో ఆయన స్పష్టంగా కనిపిస్తున్న వైనాన్ని మాత్రం నెటిజన్లు నిజమనే అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. ఎంపీగా ఆయనను సస్పెండ్ చేయిస్తారా? లేక.. పార్టీ నుంచి తీసేస్తారా? లేక.. పార్లమెంటుకు ఫిర్యాదు చేసి.. ఆయనపై అనర్హత వేటు వేయిస్తారా? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates