ఏపీలో ఏడాదిన్నరగా సాగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ… ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉందని చెప్పాలి. నిత్యం ఏదో ఒక అంశంపై ఇరు పార్టీలు పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఆయా అంశాలపై తమదైన భాష్యాలు చెబుతున్న రెండు పార్టీలు.. ఆయా అంశాలకు సంబంధించిన నిజాలను మాత్రం చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఇలాంటి ఇంకో గొడవ ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మొదలైపోయింది. అసలే ఆరోగ్యానికి హానికరమైన మద్యపానం …
Read More »అచ్చెన్నకు డబ్బులు చేరలేదట.. మరి ఎందుకిదంతా?
అవినీతికి పాల్పడటం.. భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకోవటం.. నిధులు పోగేయటం లాంటివి ఆధారాలతో సహా దొరికితే చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవటం మామూలే. అందుకు భిన్నంగా ఆరోపణలతోనే తెగ ఇబ్బందులు పడటం ఉంటుందా? అంటే.. లేదనే చెబుతారు. అందునా.. మాజీ మంత్రి హోదాలో ఉన్న వారికి అలాంటివి ఉండవనుకుంటారు. అందుకు భిన్నంగా ఇబ్బందులు ఎదుర్కోవటం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో కనిపిస్తుంది. ఈఎస్ఐలో వైద్య పరికరాలు.. మందుల కొనుగోలు కుంభకోణంలో ఆరోపణలు …
Read More »డ్వాక్రా మహిళలకు జగన్ బంపర్ ఆఫర్
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్…మరో పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ….గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గం పలు కీలకమైన …
Read More »రిపోర్ట్ – జులైలో పోయిన ఉద్యోగాలు 50 లక్షలు !
అగ్రరాజ్యం అమెరికా మొదలు అభివృద్ధి చెందుతోన్న భారత్ వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అధ:పాతాళానికి పోయాయి. 2008 ఆర్థిక మాంద్యం కన్నా కరోనాతో రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే జీడీపీ …
Read More »జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్…కండిషన్స్ అప్లై
కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానం వచ్చి కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయనను జైలు సిబ్బంది ప్రత్యేకమైన సెల్ కు తరలించి ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో జైలు సిబ్బంది …
Read More »తెలంగాణలో ‘కరోనా’ లెక్క తేలిపోతుందిక..
తెలంగాణలో కరోనా లెక్కల్లో ఎంతటి అయోమయం కొనసాగుతోందో తెలిసిందే. ప్రభుత్వం రోజూ విడుదల చేసే కరోనా కేసులు, మరణాల లెక్కలపై విశ్వసనీయత అంతంతమాత్రమే అని జనం భావిస్తున్నారు. మీడియాకు వెల్లడిస్తున్న దానితో పోలిస్తే కేసులు, మరణాలు చాలా ఎక్కువ అనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కనీసం ఈ మధ్య కరోనా పరీక్షలైనా పెంచారు అని సంతోషిస్తున్నారు జనం. అంతకుముందు పరీక్షలు కూడా చాలా తక్కువ సంఖ్యలో …
Read More »అమరావతి రైతులకు అండగా దిగ్గజ న్యాయవాది
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు చేస్తోన్న ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రానికి నూతన రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశామని రైతులు వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం మారిన వెంటనే మూడు రాజధానులంటూ విశాఖకు రాజధాని తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6నెలలుగా వివిధ రూపాల్లో అమరావతి రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుతోపాటు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఓ రేంజి ట్రోలింగ్
అసలే వర్షాలు.. ఆపై వరద.. జనమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమను ఆదుకునే నాథుడే లేడా? అంటూ ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ప్రభుత్వం భరోసా దక్కింది. సరే… ఈలోగా వాన తగ్గింది. రోజుల తరబడి కనిపించని సూర్యుడూ దర్శనమిచ్చాడు. సర్కారు అండతో వర్ష బీభత్సాన్ని ఎలాగైనా పూరించేసుకోవచ్చని జనం భావిస్తున్న వేళ… అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు… నెటిజన్లకు మండేలా చేసింది. ఇంకేముంది… ఆ …
Read More »ట్రంప్ గెలుపులో రష్యా హస్తం ఉందని తేల్చారు
కలిసి వచ్చే కాలాన్ని ఎవరూ ఆపలేరంటారు. అదే సమయంలో గాలి తేడా కొట్టేదాన్ని ఆపటం సాధ్యం కాదన్న మాటకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు అమెరికాలో చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలకు గడువు దగ్గరకు వచ్చేస్తోంది. అసలే కరోనా కాలం.. దానికి తోడు.. ఒక్కొక్కటిగా తోడవుతున్న అంశాలు అధ్యక్షుల వారికి ఇబ్బందికరంగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న …
Read More »ఆ దేశంలో దేశాధ్యక్షుడ్ని.. ప్రధానిని నిర్బంధించిన సైన్యం
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. దేశాధ్యక్షుడ్ని.. ప్రధానమంత్రిని సైన్యం నిర్బంధంలోకి తీసుకోవటమే కాదు.. పలువురు ప్రభుత్వ నేతల్ని ఏకాఏకిన లోపలేసేసిన సంచలనం తాజాగా మాలిలో చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో సైనికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. కొద్ది రోజులుగా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో సైన్యం వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా.. ప్రధాని బూబౌ సిస్సేలనను అదుపులోకి తీసుకున్నారు. …
Read More »కరోనా వ్యాక్సిన్పై కేంద్రం ఎట్టకేలకు..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తోందో తెలిసిందే. వైరస్ దానంతట అది తగ్గుముఖం పట్టే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆశలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు చేపట్టే చర్యలు కానీ, జనాల స్వీయ క్రమశిక్షణ కానీ.. సరిపడా స్థాయిలో లేకపోవడంతో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నేపథ్యంలో కరోనా తాలూకు సంక్షోభానికి తెరపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే …
Read More »ఆ స్థలాలను పంపిణీ చేయొద్దు…జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి చేపట్టిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలోని మైనింగ్ భూము మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, వాటిని ఇతర అవసరాలకు వాడకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల పంపిణీ కోసం …
Read More »