పై ఫొటోలో ఉన్నది.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు. ఇటు వైపు.. ఏపీ సీఎం జగన్ దంపతులు. ఇద్దరూ చూడముచ్చటగా.. ఇక ఇకలు.. పకపకలు.. కనిపిస్తున్నాయి. పువ్వాడ కుమారుడి వివాహం ఈ నెల 20న ఉన్న నేపథ్యంలో పువ్వాడ దంపతులు.. జగన్ దంపతులను ఆహ్వానించారు. అయితే.. ఇక్కడ విషయం ఏంటంటే.. నిన్న గాక మొన్న.. జగన్‌పైనా.. ఆయన పాలనపైనా.. పువ్వాడ విరుచుకుపడ్డారు.
పోలవరం ఎత్తును పెంచుతున్నారని.. దీనివల్లే.. భద్రాచలంలోని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని.. కాబట్టి తలాతోక లేని నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తును తగ్గించాలని..పువ్వాడ వ్యాఖ్యానించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వాగ్యుద్దానికి దారి తీసింది. ఇటు వైపు ఏపీ మంత్రులు కూడా రియాక్టయ్యారు. అయితే.. పువ్వాడ వ్యాఖ్యలు.. అంత తేలికగా ఏమీ అనలేదని.. వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే వాదన వినిపించింది.
అదేసమయంలో ఏపీలోనూ.. మంత్రులు.. బాగానే రియాక్ట్ అయ్యారు. కట్ చేస్తే.. అదే పువ్వాడ.. తాజాగా జగన్ దంపతులను తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు ఆహ్వానించడం.. సంచలనంగా మారింది. అయితే.. ఇది కూడా.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అంటున్నారు పరిశీలకులు. మరికొద్ది మాసాల్లోనే జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో టికెట్ కోసం.. పువ్వాడ తపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్‌మాట ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని.. చెబుతున్నారు.
కేసీఆర్ చెప్పినందుకే.. వచ్చి ఏపీ సీఎం జగన్ దంపతులను ఆయన ఆహ్వానించారని అంటున్నారు. శివుడి ఆజ్ఞలేకుండా.. చీమ అయినా.. కుట్టదు! అన్నట్టుగానే.. కేసీఆర్ ఆదేశం లేకుండా… పువ్వాడ ఒక్క పనికూడా చేయరని.. సో.. దీనిని బట్టి.. ఏపీ-తెలంగాణ సీఎం ల మధ్య గొడవలు ఉన్నాయని ఎవరు అన్నారని.. అవన్నీ కేవలం.. మీడియా ముందు రాజకీయాలేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates