వైసీపీ ఎంపీలపై ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అవన్నీ.. ఇప్పుడు కాకపోతే.. మరో రోజైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉన్నవే. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం సరిదిద్దుకు నే అవకాశం లేనిది. అదే.. హిందూపురం వైసీపీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఒక సంచలన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరు దీనిని చూసినా.. ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏం జరిగిందంటే.. ఎంపీ గోరంట్ల మాధవ్.. ఓ మహిళకు వీడియో కాల్ చేశారు. అయితే.. ఈ క్రమంలో ఆయన చెప్పలేని రీతిలో వ్యవహరించారు. పూర్తి నగ్నంగా ఉన్న మాధవ్.. అటు వైపు ఉన్న మహిళతో ఎలాంటి సంభాషణలు చేశారో తెలియదు కానీ.. సడెన్‌గా..`చేయరాని` పనిచేసేశారు. దీనిని మీడియాలో ప్రచురించేందుకు కానీ, ప్రసారం చేసేందుకు కానీ, అవకాశమే లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం.
కట్టు తప్పేస్తున్నారా?
వైసీపీ ఎంపీలు చాలా మందిపై.. అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. జగన్ ఎప్పటికప్పుడు.. వాటిని చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. ఇదే అలుసుగా తీసుకుని.. ఇప్పుడు గోరంట్ల రెచ్చిపోయి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇక, ప్రస్తుతం గోరంట్ల వ్యవహారం.. పార్లమెంటులో దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక నిజమైతే.. ఆయనపై ఎవరూ కోరకుండానే.. అనర్హత వేటు వేసే.. విచక్షణాధికారం.. స్పీకర్‌కు ఉంటుంది.
పరువు పూర్తిగా పాయే!
మరోవైపు.. తన ఎంపీల కారణంగా.. వైసీపీ అధినేత జగన్ పరువు.. ఇప్పుడు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో పరువు పోతున్న విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇక, ఎంపీ చేసిన వికృత చేష్టలతో ఈ పరువు ఢిల్లీ నడిబొడ్డున కూడా పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates