ప్రకాశం జిల్లాలోని చీరాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. టీడీపీ తిరుగుబాటు ఎంఎల్ఏ కరణం బాలరామ్-వైసీపీ నేత ఆమంచి కృఫ్ణమోహన్ మధ్య విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. వీళ్ళద్దరి మధ్య ఏదో రూపంలో సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో పార్టీలో తీరని నష్టం వస్తుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు సమాచారం. ఇఫ్పటికే చీరాల రాజకీయ పరిస్దితితులపై జగన్ దగ్గర ఫుల్ రిపోర్టుంది. దాంతో వీళ్ళద్దరిని పిలిపించి పంచాయితీని సెటిల్ …
Read More »నవంబర్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ?
రానున్న నవంబర్ నెలలో కేంద్రమంత్రి విస్తరణవర్గ ఉంటుందా ? ఏమో వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు చెబుతున్న ప్రకారం అలాగే అనుకోవాల్సుంటుంది. అసలు కేంద్రమంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇప్పటికిప్పుడు అయితే అలాంటి అవసరం ఏమీ లేదనే అనిపిస్తోంది. ఎన్డీఏలో నుండి అకాలీదళ్ బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఆ పార్టీ తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. దాంతో ఓ …
Read More »గోల్డ్ స్కాం చార్జిషీటులో సిఎం పేరు..కేరళలో సంచలనం
కొద్ది కాలంగా కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గోల్డ్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్కాం నిందితుల విషయంలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటులోని పేర్లలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరుండటం సంచలనంగా మారింది. స్కాంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ కు సిఎంతో సన్నిహిత సంబంధాలుండటంతో ముఖ్యమంత్రి పాత్రతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల పాత్రపై మరింత లోతుగా విచారణ జరపాలని …
Read More »24 ఓట్ల కోసం పోలింగ్ బూత్ !
ఫలితం ముందే ఫిక్స్ అయిన వేళ.. సదరు ఎన్నిక మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిస్థితి ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవిత బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది. 824 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్ …
Read More »తెలుగు.. తప్పదు.. రాజకీయంగా వాడేద్దాం.. వైసీపీలో చర్చ
రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. కొన్నింటిని అమలు చేస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. దాదాపు అన్నీ అమలవుతున్నాయి. కానీ, కీలకమైన రెండు పథకాలు.. మాత్రం ముందుకు వెనక్కు గుంజుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న.. వైసీపీ నేతలను దహిస్తోంది. ఆ రెండు పథకాల్లో ఒకటి పేదలకు ఇళ్ల పంపిణీ, రెండు.. ప్రభుత్వ పాఠశాలల్లో.. తెలుగు మీడియాన్ని ఎత్తేసి ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడం. …
Read More »తెలంగాణాలో జగన్ కు ఫుల్ సపోర్టా ?
ఢిల్లీలో జల వివాదాలపై జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత తెలంగాణా పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డికి ఫుల్లుగా మద్దతు పెరిగిపోయింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా వాదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమంలో తెలంగాణా సీఎం కేసీయార్ పై రాజకీయపార్టీలు మండిపోతున్నాయి. జగన్ ముందు కేసీఆర్ వాదన తేలిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా ప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ ఫెయిల్ అయినట్లు బీజేపీ, …
Read More »శశికళకు ఐటి శాఖ బిగ్ షాక్
తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న వీకే శశికళకు ఆదాయపు పన్నుశాఖ బుధవారం చాలా పెద్ద షాక్ ఇచ్చింది. శశికళ+కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసేసింది. బినామీ చట్టం కింద తాము శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించటం నిజంగా కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఐటిశాఖ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో …
Read More »ఏపీ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా
తిరుపతి వైసిపి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి రుయా ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటంతో భూమన బుధవారం అర్జంటుగా ఆసుపత్రిలో చేరారు. గతంలో కూడా కరోనా వైరస్ సోకటంతో భూమన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మొదటిసారి ఆసుపత్రిలో చేరినపుడు పదిరోజులు ఐసొలేషన్ లో ఉన్నారు. తర్వాత రక్త పరీక్షలు చేయించుకుని నెగిటివ్ అని తేలటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జయ్యారు. మళ్ళీ ఇపుడు రెండోసారి ఆసుపత్రిలో చేరారు. …
Read More »వైసీపీ-టీడీపీ కాపు నేతల కత్తియుద్ధం
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ కాపు నాయకులు కత్తి యుద్ధం చేసు కుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. నిజానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దగా ఎక్కడా విభేదాలు పెట్టుకోరు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. సానుకూలంగా ఉంటారు. తమలో తాము చర్చించుకుని పరిష్కరించారు. కానీ, చిత్రంగా తూర్పులో మాత్రం కాపు నేతల మధ్యే పచ్చగడ్డి వేస్తే.. భగ్గు మనే పరిస్థితి ఏర్పడింది. విషయంలోకి …
Read More »కేంద్రానికి కావాల్సింది రాష్ట్రాలపై పెత్తనమేనా ?
తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదాలు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి స్ధాయిలో పరిష్కారం కాలేదు. దాని ఫలితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తమ సమస్య పరిష్కార బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై పెట్టారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేంద్రం సమస్యను పరిష్కరించకుండా కర్ర విరకుండా పాము చావకుండా అనే సామెతలో చెప్పినట్లుగా వ్యవహిరించింది. దాని …
Read More »పళనికి రూటు క్లియర్ అయినట్లేనా ?
ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే తదుపరి సిఎం అభ్యర్ధిగా ఏఐఏడిఎంకే నిర్ణయించింది. బుధవారం ఉదయం జరిగిన పార్టీ కీలక సమావేశంలో సభ్యులందరు ఈ మేరకు నిర్ణయించి ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా ఏఐఏడిఎంకే తరపున రానున్న ఎన్నికల్లో సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. దాంతో ప్రస్తుత సిఎం పళనిస్వామికి ఒళ్ళుమండిపోయింది. దాంతో …
Read More »పదే పదే టీడీపీకి టార్గెట్ అవుతున్న గుమ్మనూరు
పదే పదే తెలుగుదేశంపార్టీ నేతలకు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు ? మంత్రిపై అవినీతి ఆరోపణలతో వరుసగా రెండోసారి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదటేమో ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ అనే వ్యక్తినుండి బహుమానంగా బెంజికారును తీసుకున్నారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇపుడేమో కర్నూలు జిల్లాలోని ఆస్పిరి మండలంలో 203 ఎకరాలను కుటుంబసభ్యులు, బినామీల పేర్లపై …
Read More »