Political News

కరోనా కోసం చేరితే.. అగ్నికి ఆహుతయ్యారు

దురదృష్టం అంటే ఇదే. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలై.. దాన్నుంచి కోలుకునేందుకు ఆసుపత్రిలో చేరితే అక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం. అహ్మదాబాద్‌లోని కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న శ్రేయ ఆసుపత్రి ఐసీయూ వార్డులో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ‌ ఆసుపత్రిలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. …

Read More »

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే పదవులు వదిలేస్తామన్న బాబు

ఒక అంశం మీద పోరాడుతున్నప్పుడు ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలంటే.. వ్యూహం పక్కాగా ఉండాలి. మాటలు గంభీరంగా ఉండి.. చేతలు చులకన చేసేలా ఉంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. తాజాగా ఏపీ విపక్ష నేత కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఇదే రీతిలో ఉంది. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల అంశంపై ఏపీ సర్కారు దూకుడుగా దూసుకెళుతున్న …

Read More »

మోకాళ్లపై మానవహారం.. అందరిని కదిలించేసిందా?

వారెవరికి రాజకీయ నేపథ్యంలో లేదు. ఆ మాటకు వస్తే పార్టీ కార్యకర్తలు కూడా కాదు. ఒక ప్రభుత్వం పిలుపునిస్తే.. తమ బతుకులు బాగుపడటంతో పాటు.. తమ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయన్న ఆశతో తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రపంచ చరిత్రలో చుక్క నెత్తురు కారకుండా 33వేల ఎకరాల భూమిని రైతులు తమకు తాముగా ప్రభుత్వానికి ఇచ్చిన అద్భుతమైన ఘట్టం అమరావతి సందర్భంగా చోటు చేసుకుందని చెప్పాలి. ప్రభుత్వాలు మారి.. …

Read More »

కరోనా బిల్లు చూసి.. ఆఫీసును ఆసుపత్రిగా మార్చేశాడు

Corona Hospital

విన్నంతనే నమ్మలేం. కానీ.. ఇది నిజంగా నిజం. కరోనా పాజిటివ్ కావటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యాపారవేత్త.. ఎట్టకేలకు కోలుకోవటం బాగానే ఉన్నా.. అతగాడి చేతికి ఇచ్చిన బిల్లును చూసి గుండె ఆగినంత పనైందట. దాంతో ఆ వ్యాపారస్తుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతం గురించి చెబితే.. గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన ఖాదర్ షేక్ అనే బడా వ్యాపారికి కరోనా …

Read More »

మంత్రి స్టేట్మెంట్.. కరోనా చికిత్స ఖర్చు వెయ్యే

Eetela Rajendra

కొంచెం ఆలస్యంగా అయినా సరే.. తెలంగాణలో కరోనా చికిత్స పేరుతో బాధితుల్ని దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అయినకాడికి ఫీజులు దండుకుంటున్న డెక్కన్ హాస్పిటల్ కరోనా చికిత్స చేయకుండా లైసెన్స్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు జూబ్లీ హిల్స్‌లోని విరించి ఆసుపత్రి మీదా ఇలాగే వేటు వేసింది ప్రభుత్వం. కార్పొరేట్ ఆసుపత్రులకు ఇంకా బలమైన హెచ్చరిక జారీ చేసే ఉద్దేశంతో ఆరోగ్య …

Read More »

పీపీఈ కిట్ ధరించిన కేటీఆర్ !

KTR

కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. నలుగురిని కలిసే విషయంలో కేసీఆర్ కు చాలానే లెక్కలు ఉంటాయని చెబుతారు. అందుకు భిన్నంగా ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మాత్రం.. వీలైనంత ఎక్కువమందిని కలుస్తుంటారు. ఎవరైనా.. ఏదైనా కొత్త కార్యక్రమం చేపడుతుంటే.. దాని గురించి తెలుసుకోవాలనే తపనతో పాటు.. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా? …

Read More »

ఆయన అద్వానీ పేరెత్తగానే..

2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య …

Read More »

ఐపీఎల్ నుంచి వివో ఔట్‌.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

మొత్తానికి బీసీసీఐ దిగి రాక త‌ప్ప‌లేదు. చైనా వ్య‌తిరేక ఉద్య‌మం జోరుగా సాగుతున్న వేళ ఆ దేశానికి చెందిన వివో మొబైల్ కంపెనీని ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగించాల‌ని భార‌త క్రికెట్ బోర్డు నిర్ణ‌యించ‌డంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. బోర్డు వ‌ర్గాలు మాత్రం వివో …

Read More »

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో అసంతృప్తి

వైసీపీ సర్కార్ కు ఓ విషయంలో విపక్షం కన్నా స్వపక్షం నుంచి విమర్శలు ఎక్కువయ్యాయట. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేయొచ్చన్న సీఎం జగన్ ఆలోచన ఇపుడు ఆయనకే బూమరాంగ్ అవుతోందట. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ ఉనికిని కోల్పోతామంటూ రాష్ట్రంలోని పలువురు వైసీపీ సీనియర్, జూనియర్ నాయకులు సీఎంకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొర పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు…ఈ …

Read More »

విజయసాయిరెడ్డికి ఇది ఎన్నో పదవో తెలుసా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. వైసీపీలో కీలక నేతగా కొనసాగుతోన్న విజయసాయిరెడ్డి….జాతీయ స్థాయిలో వైసీపీ గళం వినిపిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా జగన్ కు వెన్నుదన్నుగా ఉన్న విజయసాయి….వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అత్యంత కీలక నేతగా మారారు. వైసీపీలో జగన్ తరువాత అత్యంత కీలక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి ఎన్నో కీలక పదవులు దక్కాయి. వైసీపీ తరఫున 2016లో రాజ్యసభలో ఎంపీగా …

Read More »

ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …

Read More »

వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యం అమెరికా, ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమై భార‌త్ స‌హా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే క‌దులుతున్నాయి. జ‌నాల క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. ఈ క‌ష్టాల‌న్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైర‌స్‌ను పార‌దోలాలి. దాని కోస‌మే అంద‌రూ ఎదురు …

Read More »