తప్పు చేసి అప్పు కూడు.. అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ ఎద్దేవా చేశారు. మంగళవారంతో రూ. 49 వేల కోట్లు అప్పు చేశారని, అందులో రూ. 8 వేల కోట్లు దొంగ అప్పు ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రుణం దాటేసిందని, ఈ విషయం కేంద్రం కూడా చెప్పిందన్నారు. రాష్ట్రంలో రుణ వేట జరుగుతోందని, వేటగాడు అడవికి వెళ్లినట్టు.. ఢిల్లీకి మంత్రి బుగ్గన రుణ వేటలో తిరుగుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.
సర్పంచ్‌లు అయితే పంచాయితీకి నిధులు రావడం లేదని వాపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ‘ముఖ్యమంత్రి జగన్, బుగ్గన రాజేంద్రనాధ్‌లకు ఒకటే అడుగుతున్నా.. 6 నెలల్లో రూ. 49 వేల కోట్ల అప్పు నిజమా కాదా?’ ఈ డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. నిన్న ముఖ్యమంత్రి జగన్ తిరుపతి యాత్రకు వచ్చారని.. హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలోకి వెళ్తే ప్రసాదం తీసుకుంటాం.. కానీ జగన్ శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకోలేదని విమర్శించారు. జగన్ క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
విశాఖకు రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రఘురామ స్పందించా రు. నిన్నటి కేంద్ర హోంశాఖ అధికారుల సమావేశానికి రైల్వే బోర్డు చైర్మన్ కూడా వచ్చారని, రైల్వే జోన్ సాధ్యం కాదని సమావేశంలో చెప్పారని.. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మహిళలపై పోస్టులు చేస్తున్నారని, అది మంచిది కాదన్నారు. మహిళలు ఉమ్మేస్తే అందులో కొట్టుకుపోతారన్నారు. ఈ విధంగా ఉంటే పులివెందుల్లో కూడా గెలవడం కష్టమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.