Political News

పిక్ టాక్: కూతురికి సీఐ సెల్యూట్ చేస్తే..

పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులై, సమాజంలో మంచి పేరు సంపాదించినపుడు, ఒక స్థాయి అందుకున్నపుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అందులోనూ ఒక తండ్రి పని చేస్తున్న చోటే కూతురు ఉన్నతోద్యోగిగా చేరితే.. ఆమెకు ఆ తండ్రి సెల్యూట్ చేయాల్సి వస్తే అది అమితానందాన్ని, ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విషయమే. తిరుపతిలో తాజాగా ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ సీఐగా పని చేస్తున్న శ్యామ్ సుందర్.. డీఎస్పీ అయిన …

Read More »

టాక్ ఆఫ్ ఏపీ: యామిని సాదినేని కన్నీళ్లు

2014 ఎన్నికల తర్వాత.. గత ఏడాది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల్లో యామిని సాధినేని ఒకరు. పార్టీలో మహిళా నేతల వాయిస్ తగ్గిపోతున్న సమయంలో యామిని తెరపైకి వచ్చి బలంగా తన వాయిస్ వినిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన ‘మల్లెపూలు’ కామెంట్ అప్పట్లో సంచలనం రేపింది. ఈ కామెంట్ వల్ల …

Read More »

మిత్రపక్షాలను కలిపిన ‘రామతీర్ధం’

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధం దేవాలయం దగ్గరకు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్మయాత్ర జరగబోతోంది. ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఛలో రామతీర్ధం దర్మయాత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసింది. మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని జనసేన ఒకటే నిర్వహించాలని అనుకున్నది. కానీ ఏమైందో ఏమో చివరి నిముషంలో బీజేపీని కూడా కలుపుకుంది. రెండుపార్టీలు మిత్రపక్షాలై సుమారుగా …

Read More »

మహానాడుకు ఎంఐఎంకు ఆహ్వానం

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాల్సిందిగా ఏఐఎంఐఎంకు ఆహ్వానం అందింది. బీహార్లో మంచి ఫలితాలు సాధించిన మజ్లిస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి రెండు …

Read More »

కేసీయార్ సరెండర్ అయిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతన్నది చూస్తుంటే కేంద్రప్రభుత్వానికి కేసీయార్ పూర్తిగా సరెండర్ అయిపోయినట్లే అనుమానాలు పెరిగిపోతోంది. దుబ్బాక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ పై ఎంతమాట పడితే అంత మాట్లాడేసేవారు కేసీయార్. ఆయుష్మాన భవ లాంటి కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈమధ్యనే కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని తెగేసి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంలో …

Read More »

బీజేపీతో పోటీ పడుతున్న పవన్ ?

అవును వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజం. ఒకవైపు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయటమే టార్గెట్ గా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసుకుంటోంది. తెరవెనుక ఒకవైపు ప్రయత్నాలు చేసుకుంటునే మరోవైపు ఏవో కార్యక్రమాలు, ఏవో ఆరోపణలు, విమర్శలతో నిత్యం మీడియాలో కనబడుతోంది. పనిలో పనిగా అవసరం ఉన్నా లేకపోయినా తిరుపతి నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ …

Read More »

కేసీయార్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసిందా ?

‘టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎంఎల్ఏలు మాతో టచ్ లో ఉన్నారు’ ..ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇందులో నిజమెంతన్నది పక్కన పెట్టేద్దాం. మరంత మంది ఎంఎల్ఏలు నిజంగానే తమతో టచ్ లో ఉంటే మరెందుకని వాళ్ళందరినీ టోకుగా చేర్చేసుకోవటం లేదు ? ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదనే ఆగుతున్నామని కతలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలను, …

Read More »

సినీ సూపర్ స్టార్ పొలిటికల్ డిజాస్టర్ ఎందుకు?

రాజకీయాల్లో రిటైరయ్యే ప్లాన్ వేసే వేళలో..పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. వందలాది సినిమాల్లో నటించిన రజనీకాంత్ కు ఎందుకీ విషయం అర్థం కాలేదు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సున్నిత మనస్కుడిగా ఉండే వెండితెర సూపర్ స్టార్ రీల్ లో బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో ఇచ్చారు. అలాంటి ఆయన పొలిటికల్ ఎంట్రీలోనే డిజాస్టర్ అయ్యేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. డెబ్భై ఏళ్ల వయసు.. అంతకు ముందు …

Read More »

సొంతగూటికి చేరనున్న వంగవీటి రాధా?

బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది. మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ …

Read More »

భారతీయులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ఇండియాలో అతి త్వరలోనే మొదలు కాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవడానికి 2021 మార్చి వరకు ఎదురు చూడాల్సిందే అని ఇంతకుముందు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు కానీ.. అందుకు రెండు నెలల ముందే వ్యాక్సినేషన్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన ఆక్స‌్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు ఇండియాలోనూ అనుమతలు లభించగా.. ఒక్క రోజు …

Read More »

వ్యవసాయ చట్టాలపై చర్చలు ఎందుకు ఫెయిలవుతున్నాయి ?

కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు మళ్ళీ ఫెయిలయ్యాయి. తదుపరి చర్చలు జనవరి 4వ తేదీన జరిపేందుకు నిర్ణయమైంది. ఇఫ్పటికే అటు కేంద్రమంత్రులకు ఇటు రైతు సంఘాలకు మధ్య ఐదుసార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చర్చలు ఎప్పుడు జరిగినా విఫలమయ్యాయే కానీ ఒక్కసారి కూడా ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. అందుకే తాజాగా జరిగిన చర్చలు కూడా ఫెయిలయ్యాయి. కేంద్రమంత్రులతో చర్చలు …

Read More »

అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

అన్నదమ్ముల తీరు ఇలాగే ఉంటుంది. తాము అనుకున్నది సాధించుకోవటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు బెదిరింపు రాజకీయాలు చేయటం బాగా అలవాటే. తాము కోరుకున్న పదవులు ఇవ్వకపోయినా లేదా టికెట్లు తమకు కానీ తాము చెప్పినవారికి కానీ దక్కదు అనుకున్న మరుక్షణం నుండే ఇటువంటి బెదిరింపులు మొదలుపెట్టేస్తారు. ఈ విషయాలు గతంలో చాలాసార్లు జరిగాయి. ఇదంతా ఎందుకంటే రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు. …

Read More »