కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమైంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లను దశలవారీగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బాగానే కృషి చేసింది. ప్రపంచంలోనే అత్యధిక మందికి… అందునా అత్యంత వేగంగా కరోనా టీకా అందిస్తున్న దేశంగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ద్రవ్య నిధి సంస్థ వరకు భారత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి దశ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. …
Read More »వ్యవసాయ చట్టాల వివాదానికి చక్కటి పరిష్కారం
కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వివాదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ చక్కటి పరిష్కారాన్ని చూపారు. కేంద్రం మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబడుతుండగా, రద్దు సమస్య లేదని కావాలంటే సవరణలు తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. ఈ ఒక్క పాయింట్ దగ్గరే …
Read More »ముద్రగడ బీజేపీలో చేరుతున్నాడా ?
అవును ఇపుడిదే ప్రశ్న తూర్పుగోదావరి జిల్లాలో చక్కర్లు కొడుతోంది. కమలంపార్టీ అద్యక్షుడు సోము వీర్రాజు-ముద్రగడ భేటి జరగబోతోందంటు ఒకటే ప్రచారం జరిగిపోతోంది. శనివారం ముద్రగడ ఇంట్లో వీర్రాజు భేటి అవుతున్నారు. నిజానికి ముద్రగడ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని చాలా కాలమే అయిపోయింది. ఒకవిధంగా మాజీమంత్రి ముద్రగడ అవుట్ డేటెడ్ పొలిటిషీయన్ అనే చెప్పుకోవాలి. ఆయన వల్ల ఏ పార్టీకి కూడా పెద్దగా లాభం ఉంటుందని అనుకునేందుకు లేదు. మరలాంటి …
Read More »నీడ్ ఆఫ్ ది అవర్..జగన్ గోపూజ
రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి. ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా …
Read More »బాబు ఊరించారు.. కానీ ! టీడీపీ మాజీ ఎంపీకి చేదు అనుభవం!
రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఆశ పెట్టుకోవడం సహజం.. పదవులు కావాలి.. కాంట్రాక్టులు కావాలి.. ఇలా అనేక రూపాల్లో వారికి ఆశలు ఉంటాయి. వీటిని నెరవేర్చడం.. నెరవేర్చకపోవడం అనేది .. పార్టీ అధినేతల మనోభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంత వరకు తప్పులేదు. అయితే.. సదరు నేత.. అభీష్టం నెరవేరస్తానని చెప్పి.. నీకెందుకు నాదీ బాధ్యత అని డైలాగులు పేల్చిన తర్వాత కూడా హ్యాండిస్తే..?! చడీ చప్పుడు లేకుండా.. ఎలాంటి ఆర్భాటమూ లేకుండానే …
Read More »వీర్రాజు పై ఒత్తిడి పెంచేస్తున్న బండి
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. మొదటినుండి కమలంపార్టీకి సంబంధించి తెలంగాణాకు ఏపిలో పరిస్ధితులకు చాలా వ్యత్యాసముంది. పార్టీ అంతో ఇంతో బలంగా ఉందంటే అది తెలంగాణాలో మాత్రమే అని అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఒక్కసారిగా జోరు పెరిగింది. దానికితోడు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం, …
Read More »అహంతో అందరికీ దూరమై.. అఖిల పాలిటిక్స్ పై కర్నూలు టాక్!!
టీడీపీ నాయకురాలు.. మాజీ మంత్రి అఖిల ప్రియ.. హఫీజ్ పేట భూముల విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్టయి.. బెయిల్ కూడా లభించని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో ఈ కేసుకు సంబంధించి తొలుత ఏ-2గా ఆమె పేరును పేర్కొన్న పోలీసులు.. తెల్లారేసరికి ఏ-1 అని సంచలన ప్రకటన చేశారు. దీంతో అయ్యో.. ఏంటీ ఘోరం అనుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక, తర్వాత పరిణామాల నేపథ్యంలో అఖిల ప్రియ సోదరి …
Read More »5,394 కోట్ల అదనపు అప్పు.. జగన్ ఏం చేస్తున్నారంటే!
ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు అప్పుల ప్రదేశ్‌గా మారుతోందనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు మరిన్ని అప్పులు చేసుకునేందుకు పరుగులు పెడుతోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తున్నామని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఈ క్రమంలో కొందరికోసం.. అందరిపైనా.. భారాలు మోపే బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం అప్పులు తీసుకునేందుకు ఏమాత్రం వెసులు బాటు కల్పించినా.. ఏపీ సర్కారు …
Read More »చివరకు కోడిపుంజులే గెలిచాయి
చివరకు కోడిపుంజులే గెలిచాయి. ప్రతిఏటా సంక్రాంతి సందర్భంగా జరుపుకునే కోళ్ళపందేలను ఈసారి ఎలాగైనా అడ్డుకోవాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దానికి తగ్గట్లే హైకోర్టు కూడా కోళ్ళపందేలు జరగకుండా చూడమని పోలీసులను గట్టిగా హెచ్చరించటంతో ఈసారి కోడిపందేలు అనుమానమేనా అనిపించింది. కానీ పండుగ మొదటిరోజైన భోగిపండుగ నాడు యధావిధిగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ళపందేలు మొదలయ్యాయి. మొదటిరోజే సుమారు రూ. 100 కోట్లు పందెంలో …
Read More »ట్రంప్ కు షాకిచ్చిన సొంతపార్టీ ఎంపిలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ అభిశంసనకు సొంతపార్టీ రిపబ్లికన్లు కూడా మద్దతు పలకటం సంచలనంగా మారింది. గురువారం తెల్లవారు జామున అమెరికా ప్రతినిధుల సభలో డెమక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదంపొందింది. అభిశంసన తీర్మానానికి అనుకూలంగా డెమక్రాటిక్ అభ్యర్ధులు 222 మంది మద్దతు తెలిపారు. అయితే పదిమంది రిపబ్లికన్ ఎంపిలు కూడా మద్దతుగా ఓటేయటం ట్రంప్ కు షాక్ కొట్టేదనటంలో సందేహం లేదు. ఈనెల 20వ తేదీన …
Read More »తెలంగాణలో తొలి టీకా ఎవరికంటే..
నిరీక్షణ ఫలించింది. మరో రెండు రోజుల్లో మాహమ్మారికి చెక్ పెట్టే టీకాను వాడటం షురూ చేయనున్నారు. తొలిదశలో వైద్యులు.. వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ మీద పలు సందేహాలు వస్తున్న వేళ..అలాంటి వాటికి చెక్ చెబుతూ.. తెలంగాణలో తొలి టీకా తానే వేయించుకుంటానని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పటం తెలిసిందే. పలు సందర్భాల్లో తొలి టీకాను తానే వేయించుకుంటానని ఆయన చెప్పారు. …
Read More »క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రి.. ఒక్కసారిగా అన్ పాపులర్ అయ్యారే!
జగన్ కేబినెట్‌లో ఇతర మంత్రుల పరిస్థితి ఎలా ఉన్నా.. ఒకరిద్దరు మంత్రులకు క్లీన్ ఇమేజ్ ఉంది. వారు సంచలన వ్యాఖ్యలు చేయరు.. పనిమాత్రమే చేస్తారు! అనే సంపాయించుకున్నారు. అంతేకాదు.. వారు మంత్రి పదవి ఉందికదా అని దూకుడుగా కూడా ఉండరు. ఎక్కడ ఎంతవరకు వ్యవహరించాలో.. అక్కడ అంతవరకు పనిచేసి.. క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటు ప్రభుత్వంలోను, అటు తమ జిల్లాలోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారు …
Read More »