ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్ కల్యాణ్ ఆర్టీవో ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. తాజాగా ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు అప్లికేషన్ పెట్టేందుకు ఆయన ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల …
Read More »కేంద్ర బడ్జెట్ లెక్కలు.. ఈ ‘సారీ’ ఏపీకి సారీనే…!
కేంద్ర బడ్జెట్ కూర్పు దాదాపు అయిపోయినట్టు తెలుస్తోంది. 2023-24 వార్షికబడ్జెట్ కు సంబంధించిన వంటకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలతోనూ చర్చించి పూర్తి చేసినట్టు సమాచారం. ఇందులో ఏపీకి కూడా ఎంత ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివేదికలు పంపించేశారు. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కేంద్ర బడ్జెట్‌లో మళ్లీ రాజధాని …
Read More »వీళ్లు వైసీపీలో ఉన్నట్టా.. లేనట్టా?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామని కొందరు నాయకులు చెబుతున్నారు. వారు ఉన్నట్టుగా ఆ పార్టీ ఎక్కడ ప్రస్తావించడం లేదు. మరి ఈ నేతలు వైసీపీలో ఉన్నారా? ఉండి ఏం చేస్తున్నారు? పార్టీ కోసం పనిచేస్తున్నారా? అంటే..చెప్పడం కష్టమే. ఉదాహరణకు ప్రస్తుతం తాజాగా సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నానని చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఆ పార్టీ అయితే.. …
Read More »ఇదేంది జగనన్నా.. 3 వేలమంది పోలీసులతో భద్రతా?
ఏ నాయకుడికైనా.. సొంత జిల్లా.. సొంత ప్రాంతం అంటే.. సొంత ఇల్లు లెక్క. ఎలాంటి భద్రతా అవసరం లేదు. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ఆయన వ్యక్తిగత భద్రత ను పక్కన పెట్టి.. ఇది సొంత రాష్ట్రం ఇక్కడనాకు ఎలాంటి భయం లేదన్నారు. అంటే.. సొంత రాష్ట్రంపై ఆయనకు అంత నమ్మకం. కానీ,ఏపీలో సీఎం జగన్‌కు తన సొంత జిల్లాపైనే నమ్మకం లేనట్టు …
Read More »వర్సిటీల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు పవన్ కు నచ్చలేదు
ఏపీ సీఎం జగన్‌పై తరచుగా విమర్శలు గుప్పించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా.. సీఎం పుట్టిన రోజు వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ప్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటంపై స్పందించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు. విశ్వ విద్యాలయాలు అధికార పార్టీ కార్యకర్తలను తయారు చేసే …
Read More »ఈ గెలుపు రెడ్డిదా.. జగన్‌దా? భారీ సక్సెస్ బ్రో!
రాజకీయాలలో చోటు చేసుకుని కొన్ని కొన్ని పరిణామాలకు.. మరికొన్నింటితో కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరిగిన ఒక పరిణామం కూడా అలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అదేంటంటే.. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఇదేమీ .. మామూలుగా అయితే జరగలేదు. అంతేకాదు.. ఈ ఎన్నికలను టీడీపీ నేతలు వెయ్యికళ్లతో పరిశీలించారు. ఏం జరుగుతుంది? అని లెక్కలు కూడా వేసుకున్నారు. అదేసమయంలో వైసీపీ నాయకులు కూడా ఇదే …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త?
రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ చెప్పలేరు. అవకాశం-అవసరం.. అనే ఈ రెండు పట్టాలపైనే వారు తమ నడక సాగిస్తారు. అనేక మంది రాజకీయ నేతలు.. తమ వ్యక్తిగతం కావొచ్చు.. వ్యాపారం కోసం కావొచ్చు.. లేదా రాజకీ య అవసరం కోసం కావొచ్చు.. పార్టీలు మారిన మారుతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఎన్నికల సమయంలో లేదా అంతకంటే ముందు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక …
Read More »బిగ్ క్వశ్చన్: టీడీపీ జోష్ ఎవరికి నష్టం?
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజమే.. మారే కాలానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చోటు చేసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలకు అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ఒక పరిణామం మొత్తం సీన్ ను మార్చేస్తుంది. అప్పటివరకు ఉన్న లెక్కలు మారేలా చేస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండదన్న …
Read More »బాబు సర్.. ఏంటీ కామెంట్లు?! టీడీపీని అందుకు పెట్టలేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క సారి చేసే కామెంట్లు చాలా విస్మయం కలిగిస్తూ ఉంటాయి. చల్లకొచ్చి ముంత దాచేసే చందంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎందుకు? రాజకీయాల్లో ఉన్న నాయకులకు అధికారం, పదవులు చాలా ముఖ్యం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఈ రెండు అంశాల చుట్టూనే రాజకీయాలు తిరిగుతుంటాయి.అసలు అధికారం కోసం.. ఏపీలో రక్త సంబంధాలు కూడా తెంచేసుకుంటున్న నాయకులు కనిపిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితిలో తాజాగా 2018 …
Read More »వేడుకల వేళ వైసీపీలో రచ్చ రచ్చ!!
ఒకవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ జన్మదిన వేడుకలు..మరోవైపు వైసీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, ఆధిపత్య ధోరణి తదితర అనేక అంశాలు రచ్చ రచ్చ సృష్టించాయి. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ నేతలు ఎంత మంది కలివిడిగా ఉన్నారు.? ఎంత మంది దూరంగా ఉన్నారు? అనే విషయాలు ఈ వేడుకల సాక్షిగా బయటకు వచ్చాయి. నువ్వా నేనా అనే సంస్కృతికి పార్టీ కడు దూరమని.. అందరూ కలివిడిగా ఉంటారని …
Read More »నాయకుల్లేరు.. క్యాడర్ లేదు.. శంఖారావం సక్సెస్ ఎలా ?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీనా? ఆ ప్రశ్నే ఒక పెద్ద జోక్. అలాంటి వేళలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోలేదన్న మాటనే నిజం చేసింది తాజాగా ఖమ్మంలో ముగిసిన శంఖారావం సభ. అలా అని.. ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి.. తెలుగుదేశం పార్టీ గురించి అతిగా ఊహించుకుంటే అంతకు మించిన పిచ్చితనం మరొకటి ఉండదు. తాజాగా వచ్చిన జనసందోహాన్ని చూసినప్పుడు.. తెలుగుదేశం పార్టీకి సరైన నేతలు.. క్యాడర్లు లేదన్నది నిజమే …
Read More »‘నిరూపించండి.. తిరిగి ఇచ్చేస్తా’
భూ ఆక్రమణల ఆరోపణలు, కొనుగోలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం.. సంచలన సవాల్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ‘ఇట్టినా’ కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఎవరివైనా ఉంటే.. నిరూపించాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. అలా నిరూపించిన వాటిని మార్కెట్ ధర ప్రకారం రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని.. జయరాం ప్రకటించారు. ఆస్పరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన మంత్రిని.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates