Political News

వైసీపీలో చిచ్చు.. ర‌గులుతున్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు

అధికార వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, ఆధిప‌త్య పోరు కామ‌న్‌గా మారింది. అయితే.. మ‌రీ ముఖ్యంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి నిత్యం ర‌గులుతూనే ఉండ‌డం పార్టీ పెద్ద‌ల‌కు కూడా త‌ల‌నొప్పి గా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వారిని వైసీపీకి మ‌ద్ద‌తు దారులుగా చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇలా వ‌చ్చిన వారిలో ఇద్ద‌రు పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు. అదే స‌మయంలో సొంత పార్టీ త‌ర‌ఫునే …

Read More »

అఖిల ప్రియ‌కు సింప‌తీరాలేదు.. రీజ‌నేంటి? ఒంట‌ర‌య్యారా?

దూకుడు మంచిదే.. కానీ, ఆ దూకుడు అర్ధ‌వంతంగా ఉండాలి. అంద‌రూ మెచ్చేదిగా కూడా ఉండాలి. లేక‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌దైన శైలిలో దూకుడు చూపించారు టీడీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌. గ‌ట్టి వాయిస్ వినిపించారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకునిదానిలోని లోపాల‌ను ఎత్తి …

Read More »

జనసేన బ్లాక్ బస్టర్ షో

ఎప్పుడూ జనాల్లో ఉండటం.. ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం.. అధికార పక్షంలో వైఫల్యాల్ని ఎండగట్టడం ప్రధాన బాధ్యత. ఈ పని చేస్తే ఆటోమేటిగ్గా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంటుంది. ఈ పని ఎన్నికల ముందు కాకుండా.. ముందు నుంచే చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. జనసేన పార్టీకి ఈ విషయంలో ఆలస్యంగానే బోధపడిందని చెప్పాలి. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే పవన్ …

Read More »

కేంద్రం వద్దన్నా సై అంటున్న ఆ సీఎం

దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి ససేమిరా అంటోంది కేంద్ర ప్రభుత్వం. 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇస్తూ ఇచ్చిన జీవోలో ఇప్పటిదాకా ఏ మార్పూ చేయలేదు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం సొంతంగా తమ రాష్ట్రం వరకు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులు ఇవ్వడం.. తర్వాత కేంద్రం ఇందుకు అంగీకరించకపోవడంతో …

Read More »

జగన్…ప్రజలకు ముద్దులు కాదు..పాలసీలు కావాలి: పవన్

తుని నియోజకవర్గం కొత్తపాకలలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆందోళన జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివీస్ బాధితుల నిరసనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మద్ధతు తెలుపుతూ ఈరోజు తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాదయాత్రలు చేసే జగన్ ప్రజలపై ప్రేమను ముద్దులతో చూపుతారని, కానీ ఆయన ప్రేమ పాలసీల రూపంలో చూపించాలని ఎద్దేవా చేశారు. లక్షలాది …

Read More »

బీజేపీలోకి గిడ్డి ఈశ్వ‌రి.. ముహూర్తం ఖ‌రారు!

గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే.. గిడ్డి ఈశ్వ‌రి బీజేపీలో చేర‌బోతున్నారు. విద్యావంతురాలు, విన‌య‌శీలిగా పేరున్న ఈశ్వ‌రి.. ఇప్ప‌టికి మూడు పార్టీలు మారారు. ఆమె తండ్రి గిడ్డి అప్ప‌ల‌నాయుడు రాజ‌కీయ వార‌సురాలిగా అరంగేట్రం చేసిన ఈశ్వ‌రి.. పూర్వాశ్ర‌మంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు. 1978 ఎన్నిక‌ల్లో గిడ్డి అప్ప‌ల‌నాయుడు.. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం పాడేరు నుంచి జ‌న‌తా పార్టీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత చానాళ్ల‌కు ఈశ్వ‌రి …

Read More »

ఇంతకీ.. హఫీజ్ పేట్ లోని వివాదాస్పద భూమి చరిత్రలోకి వెళితే..

హఫీజ్ పేట సర్వే నెంబరు 80 చుట్టూనే ఈ వివాదం నడుస్తుంది. అలా అని.. దాని చుట్టుపక్కల వివాదం లేదని కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న భూములు కూడా వివాదమే. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే.. హాఫీజ్ పేటలో వివాదంలో ఉన్న భూముల విలువ స్థానిక మార్కెట్ లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని చెబుతారు. ఇక.. తాజా వివాదానికి సంబంధించి చూస్తే.. సర్వే నెంబరు 80 కింద …

Read More »

‘భూమా బ్యాచ్’ కిడ్నాప్ ప్లానింగ్ కు స్ఫూర్తిగా ఆ సినిమా?

రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతంలో ప్లానింగ్ మొత్తం భూమా అఖిలప్రియ దంపతులు.. వారి అనుచరులే చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే పోలీసులు సైతం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ2 కాస్తా ఏ1గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇక.. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ కు స్ఫూర్తి.. ఆ మధ్య విడుదలైన తమిళ డబ్బింగ్ …

Read More »

ఏవీ సుబ్బారెడ్డిని స్టేషన్ కు తీసకెళ్లే టైంకు.. వారు అక్కడే ఉన్నారా?

సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉదంతంలో ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తర్వాత పోలీసులు విడిచిపెట్టటం తెలిసిందే. బుధవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. మీడియా ప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. పోలీసులు తన పేరును అనవసరంగా చేర్చారని పేర్కొన్నారు. తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపించారు. తనను …

Read More »

కర్నూలు మున్సిపాలిటీ కి ఏడు లక్షల విలువ చేసే పారిశుధ్య వాహనం విరాళం

సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుల కోసం తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి, వంశీ గ్రూప్ అధినేత ముప్పా రాజశేఖర్ లు ఏడు లక్షల విలువ చేసే వాహనాన్నికర్నూలు మున్సిపల్  కార్పొరేషన్ కు అందజేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా మున్సిపల్ కమీషనర్ డీకే బాలాజీ ఐఏఎస్ కు …

Read More »

కిడ్నాప్ ఎపిసోడ్ పై భూమా అఖిల సోదరి కీలక వ్యాఖ్యలు

భూవివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అఖిలప్రియ సోదరి ఈ ఇష్యూ మీద మాట్లాడారు. తాము ఎవర్నీ డబ్బులకోసం డిమాండ్ చేయలేదన్న ఆమె.. రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలు సరికావన్నారు. హైదరాబాద్ లో తమకు …

Read More »

ప‌వ‌న్‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఆ ఒక్క వ్య‌వ‌హారం!

అవును! ఇప్పుడు జ‌న‌సేన విష‌యంలో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత ప‌వ‌న్ ప‌రువు పోతోంద‌ని, ఆయ‌న ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని కాపు సామాజిక వ‌ర్గానికిచెందిన నాయ‌కుల‌తోపాటు జ‌న‌సేన పార్టీ సానుభూతి ప‌రులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు? ఏం జ‌రిగింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన త‌ర‌ఫున …

Read More »