మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహార్ జైలులో ఉంటున్న జైన్కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నాడు.
ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ తర్వాతి రోజు కూడా బాడీ మసాజ్‌తోపాటు తలకు మర్దనా చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. మరికొంత మంది కూడా ఆయన పక్కన ఉన్నారు. గదిలో బిస్లెరీ వాటర్ సీసాలు, ఆయన పడకపై టీవీ రిమోట్ కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ ఈ ఏడాది మే 30న అరెస్టయ్యారు. 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది.
సత్యేందర్‌కు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు రాగా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు ఈడీ అందించింది. ఇవే ఆరోపణలపై తిహార్ జైలు సూపరింటెండెంట్ ఇటీవలే సస్పె న్షన్‌కు గురయ్యారు. ఇదిలావుంటే, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని అధికారం నుంచి దిం పి.. తాము పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆప్‌కు తాజాగా వీడియో.. తీవ్ర స్థాయిలో సంకటాన్ని తీసుకురా వడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై ఆప్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.