ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చే శారు. రాష్ట్ర ఎన్నికల్లో పొత్తుల విషయంపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం.. కుండబద్దలు కొట్టి మరీ చెప్పిం దని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసిఎన్నికలకు వెళ్తామని అన్నారు. సరే.. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ, తాజాగా సోము చెప్పింది మాత్రం సంచనలమే!
అదేంటంటే.. జనసేన పార్టీని టీడీపీతో కలవొద్దంటూ.. బీజేపీ అధిష్టానం చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎప్పటికీ.. టీడీపీతో కలిసి ముందుకు సాగే ప్రసక్తి ఉండదని.. జనసేనతో ఎప్పటికీ తామే ఉంటామని.. సోము వీర్రాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ మాత్రమే పొత్తు ఉంటుం దని తెలిపారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు.
ప్రస్తుతం టీడీపీ అభద్రతా భావంలో ఉందని.. అందుకే.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో.. కూడా ఆయ నకు అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే లాస్ట్ అన్నారని.. అయితే.. ఈ లాస్ట్ ఆయనకేనా.. లేక పార్టీకా.. అనేచర్చ సాగుతోందని సోము వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏదేమైనా..టీడీపీ పని అయిపోయిందని.. రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమి వర్సెస్ వైసీపీల మధ్యే పోటీ ఉంటుందని సోము జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి సర్కారు ఏర్పడుతుందని అన్నారు.