ఏసేశాడు.. జగన్.. బాగా ఏసేశాడు! ఇదీ.. ఇప్పుడు హాట్ టాపిక్ . తాజాగా టీడీపీ డిసెంబరు 1 నుంచి ప్రతిష్టా త్మకంగా ప్రారంభించాలని భావిస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని జగన్ ఆడేసుకున్నారు. తాజాగా నరసాపురం పర్యటనలో భాగంగా మత్స్యకారులకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జగన్ అనంతరం.. జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల పై విరుచుకుపడ్డారు. దత్తపుత్రుడిని వెంటబెట్టుకుని 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేసింది చెప్పుకొనేందుకు ఏమీ లేదని విరుచుకుపడ్డారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు ‘ఇదేం ఖర్మ రా బాబూ’ అంటూ.. ఇంటికి తరిమి కొట్టారని వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ అని ప్రజలు తిప్పికొట్టినా చంద్రబాబుకు తత్వం బోధ పడలేదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికీ అభివృద్ధిని చేరువ చేస్తున్నామన్న జగన్.. మత్స్యకారులకు ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. చివరకు కుప్పంలో కూడా వైసీపీని ప్రజలు ఆదరించే పరిస్థితి వచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకున్నామనంటే.. ఇదేం ఖర్మరా బాబూ అని టీడీపీని కుప్పం ప్రజలు తరిమికొట్టడం వల్లే కదా! అని జగన్ వ్యాఖ్యానించారు.
దేవుడిదేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates