వంద మాటల్లో చెప్పలేనిది.. ఒక్క చిత్రంలో చూపించడం.. చిత్రకారుడి నైపుణ్యం.. ప్రతిభ కూడా. ప్రపంచ మహిళా సౌందర్యాన్ని మొత్తాన్ని ఒక్క మొనాలిసా చిత్తరువులో కూర్చేసిన కళాకారుడు కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టినట్టుగా.. రాజకీయాల్లోనూ చిన్నపాటి కార్టూన్లు నేతల గుట్టును.. వారి మాటల్లోని లోగుట్టును కూడా బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇదే పనిచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
వంద మాటలతో వైసీపీపై ఎదురు దాడి చేయడం కన్నా, ఒక్క చిత్రంతో ఏకిపారేయడమే బెటర్ అనుకున్నట్టుగా ఉన్నారు. ఇటీవల నర్సాపురం సభలో జనసేనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత పవన్ తీవ్రంగా ఖండించారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గా పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం చిన్న కార్టూన్ను ట్వీట్టర్లో పోస్టు చేశారు. దీనిలో వంద అర్థాలను గుప్పించేశారు. ప్రభుత్వ అవినీతి, పాలన, నేతల దూకుడు ఇలా అనేక అంశాలను ఒకే ఒక్క చిత్తరువులో ప్రజలకు చూపించారు.
ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనంగానే మండిపడ్డారు. జనసేనపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఓ కార్టూన్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైసీపీ నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్లో వివరించారు. వైసీపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడంపై చిత్రంలో స్పష్టంగా చూపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే.. తమ పార్టీని రౌడీసేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారంటూ అర్థం వచ్చేలా కార్టూన్ని పోస్టు చేశారు. దీనికి సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతుండడం గమనార్మం.
Gulte Telugu Telugu Political and Movie News Updates