సభ ఏదైనా.. సమావేశం ఎలాంటిదైనా సీఎం జగన్ ఇటీవలకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లాలోని నరసాపురంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాజకీయ వేదికగా మారేశారు.
ఈ సందర్భంగా జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయమంటే జవాబు దారీతనమన్న జగన్.. ఇది లేని వారే.. ఇప్పుడు అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులాగా తానుదుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదన్నారు. భూహక్కు.. అంటే తన భూమిపై తనకు సంపూర్ణ హక్కులు ఉన్నవాడన్న జగన్, తన భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా అనుభవించేవాడు భూ కబ్జాదారుడని అన్నారు. ఈ మాటలను చంద్రబాబుకు ముడిపెడుతూ.. కీలక వ్యాఖ్యలుచేశారు.
రాజకీయ కబ్జాదారు చంద్రబాబు అని.. ఆయన పార్టీ కానిదానిని ఆయన ఏలుతున్నాడని అన్నారు. భూహక్కుదారులు అంటే.. ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీలను తాము పెట్టుకుని ప్రజల్లో గెలిచిన వారని తెలిపారు. మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరో ఛాన్స్ ఇస్తారా? అని ప్రశ్నించారు. మంచి చేసిన మీ బిడ్డ(జగన్)ను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.
తన భార్య కోసం యుద్ధం చేస్తే రాముడంటారు. పరాయి స్త్రీని ఎత్తుకు పోతే రావణుడంటారు. రాముడు దేవుడయ్యాడు. రావణుడిని, దుర్యోధనుడిని ఎవరూ సరమర్థించబోరని వ్యాఖ్యానించారు. బాబూ మీ సేవలుమాకొద్దు.. అంటూ బాబుకు బైబై చెప్పి ఇంటికి పంపించాలో వద్దో మీరే ఆలోచించుకోండి.. అని జగన్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates