కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం …
Read More »దానికి కూడా ఆయనే ముహూర్తం పెట్టారా? వైసీపీ నేతల టాక్!
ఏపీలో వైసీపీ సర్కారుకు.. విశాఖలోని చినముషిడివాడలో ఉన్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి మధ్య ఉన్న లింకు అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌ను ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు స్వరూపానంద యజ్ఞాలు, యాగాలు, హోమాలు.. పూజలు ఇలా.. అనేక రూపాల్లో కష్టపడ్డారు. ఇక, ఈయన కనుసన్నల్లోనే సీఎం జగన్ నడుస్తున్నారనేది కూడా బహిరంగ రహస్యమే. చాలా విషయాల్లో ముహూర్తాలు.. నిర్ణయాలు అన్నీ కూడా స్వామి ఆదేశాలమేరకు ఆశీస్సుల మేరకే జరుగుతున్నాయనే …
Read More »ప్రచార పర్వంతో పవన్‌ను ఇరికించేలా బీజేపీ వ్యూహం!
తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికలో బీజేపీ వ్యూహాలపై వ్యూహాలు వేస్తోంది. ఇక్కడ గెలవాలనే పట్టుతో ఉన్న కమల నాథులు ఎలాంటి వ్యూహాలు వేసినా.. అంతిమంగా వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తమ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్‌ను ఇక్కడ ప్రచారానికి పిలిచి ఒప్పించాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించిన పవన్ .. బీజేపీ పెద్దల ఒత్తిడితో పోటీ …
Read More »రైతులపై ఏపీ మంత్రి ఫైర్..
‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రభుత్వంలో పట్టణగృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్న శ్రీరంగనాథరాజు.. ఈ వ్యాఖ్యలను ఉద్దేశ పూర్వకంగానే చేశారా? లేక యాదృచ్ఛికంగా అన్నారా? అంటే.. ఆయన ఉద్దేశ పూర్వకంగా నే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు వైసీపీ సీనియర్లు గుసగుసగా! గతంలోను, ఇప్పుడు కూడా రాజకీయా లు రంగనాథ రాజుకు కొత్తకాదు. ఇప్పటికే ఆయన సీనియర్ నాయకుడిగా జిల్లాలో ప్రచారంలో ఉన్నారు. …
Read More »ఇదేం రాజకీయం సార్.. వైసీపీలో ముసురుతున్న వివాదం
ఏపీలో బలంగా ఉన్నామని… ఇక, తమకు తిరుగులేదని చెప్పుకొంటున్న జగన్ సర్కారుకు.. అదే పార్టీలో ఇప్పుడు చెలరేగుతున్న ముసలం.. కలకలం సృష్టిస్తోంది. ఇదేం రాజకీయం సార్! అంటూ.. రోజూ.. వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి సందేహాలు, ఫోన్లు కూడా వస్తున్నాయి. మేం పార్టీ కోసం ఎంతైనా కష్టపడతాం. ఇప్పటి వరకు మా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పార్టీని డెవలప్ చేశాం. కానీ.. మీరు మాకు ఇచ్చిన …
Read More »చింతా మోహన్ ఎంట్రీ.. కాంగ్రెస్‌కు చింత తీరుతుందా ?
రాష్ట్రంలో పూర్తిస్థాయిలో చతికిల పడిన కాంగ్రెస్.. మళ్లీ జవసత్వాలు పుంజుకుంటుందా ? పునర్వైభవం సంతరించుకోకపోయినా.. కొంత మేరకు పుంజుకునే స్థాయికి ఎదుగుతుందా ? అంటే.. తాజా పరిణామాలను బట్టి చింత చిగురు చిగురించినంత ఆశ అయితే ఉందనే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ కేడర్ జారిపోవడం, నాయకులు పార్టీ మారిపోవడం తెలిసిందే. ఫలితంగా ఏ చిన్న ఎన్నిక జరిగినా… కాంగ్రెస్ …
Read More »పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్
ఎన్నికలంటేనే చిత్ర, విచిత్రమైన పరిస్దితులుంటాయి. భారీ పోలింగ్ జరిగినా సమస్యే, పోలింగ్ చాలా తక్కువగా జరిగినా సమస్యే. మొదటి దశ పోలింగ్ తర్వాత పశ్చిమబెంగాల్లో రాజకీయపార్టీలన్నింటిదీ ఇదే పరిస్ధితిగా తయారైంది. శనివారం బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిదశ పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం అందే సమయానికి దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మామూలు పరిస్ధితుల్లో అయితే జరిగిన పోలింగ్ బాగా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అధికార …
Read More »ఆర్కే మాటలు వింటే.. ‘అల వైకుంఠపురం’ సీన్ గుర్తుకు వస్తుంది
ఏడాది క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురం సినిమాను అంత త్వరగా మర్చిపోలేం. అందులో.. హీరో తండ్రి కంపెనీ మీద కన్నేసిన ఒక పోర్టు యజమాని.. ఎంతలా భయపెడతారో.. కంపెనీని సొంతం చేసుకోవటానికి ఎంత వరకు వెళతాడో చూసిందే. అంతలా కాకున్నా.. రక్తం చిందకుండానే మాటలతోనో.. చేతల్లో ఉన్న పవర్ తోనో సొంతం చేసుకుంటున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతుందా? అంటే… అవునన్న మాటను చెబుతున్నారు …
Read More »ఎంఎల్ఏని చితక్కొట్టేసిన రైతులు
మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోందా ? క్షేత్రస్ధాయిలో తాజాగా జరిగిన ఘటన చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పంజాబ్ లో బీజేపీ ఎంఎల్ఏపై రైతులు దాడిచేసి బాగా కొట్టారు. అంతేకాకుండా ఆయన బట్టలను చీలికలు పీలికలుగా చించేయటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న ఆందోళనగా మొదలైన …
Read More »మా నాయకుడికి టైం కలిసి రావడం లేదు
ఔను! ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. “మా నాయకుడికి టైం కలిసి రావడం లేదు”.. -ఇదే మాట సీనియర్ల నుంచి జూనియర్ల వరకు వినిపిస్తోం ది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఓ వైపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేశాం.. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని నాయకులు మురిసిపోతూ.. తాము చేయాలని అనుకున్న పనులను ఒక్కొక్కటిగా.. …
Read More »సైన్యం రెచ్చిపోయింది..114 మంది చనిపోయారు
మయున్మార్లో సైన్యం రెచ్చిపోయింది. సైనికపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన చివరకు హింసాత్మకంగా మారిపోయింది. ప్రజలకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణ చివరకు తారాస్ధాయికి చేరుకున్నది. సహనం కోల్పోయిన సైన్యం జరిపిన కాల్పుల్లో 114 మంది మరణించటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. సైన్యం కాల్పుల్లో ఇంతమంది ఒకేరోజు చనిపోవటం బహుశా ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద హింసా ఘటనగా చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా మయున్మార్ సైనికపాలనలోన మగ్గుతోంది. జరిగిన ఎన్నికలను కూడా …
Read More »జగన్ ఆశలపై నీళ్ళు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగ ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. కనీసం మరో ఏడాదిపాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిరీక్షణ తప్పేట్లులేదు. దీనికి కారణం ఏమిటంటే భారత రిజిస్ట్రార్ కార్యాలయం జారీచేసిన నిబంధనలే. దేశవ్యాప్తంగా జనగణన జరిగేంతవరకు ఇపుడున్న జిల్లాల భౌతిక సరిహద్దులు మార్చవద్దని రిజిస్ట్రార్ కార్యాలయం దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నిజానికి జనగణన దాదాపు ఏడాది క్రిందటే మొదవ్వాల్సింది. అయితే …
Read More »