Political News

ఈడీ కాక‌పోతే.. బోడీ తెచ్చుకో..: KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల …

Read More »

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీకి ఇక్క‌డ చాలా దెబ్బ త‌గిలింది. కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్క‌డ పరాజ‌యం పాల‌య్యారు. దీంతో ఇంత చేసినా.. త‌మ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని.. టీడీపీ ఖంగుతింది. …

Read More »

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోట ఇప్ప‌టి వ‌ర‌కు రాని కొత్త వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది. ఏపీ రాజ‌కీయాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు.. అన్న జ‌గ‌న్‌.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. చెల్లెలు మ‌రో రాష్ట్రంలో పార్టీ పెట్టారే త‌ప్ప‌.. త‌మ ప్రాంతం ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను మాత్రం విస్మ‌రించార‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. పద్యం పుట్టిన రాయలసీమ నేలలో …

Read More »

లైన్ దాటిన ఉద్యోగసంఘాల నేత

ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని పరిష్కరించేట్లుగా చేయటమే ఉద్యోగసంఘాల నేతల పని. అంతేకానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులకు, ప్రజలకు పిలుపివ్వటం కాదు. ఇపుడీ టాపిక్ ఎందుకంటే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి లైన్ దాటారు కాబట్టే చెప్పుకోవాల్సొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం రెడ్డి మాట్లాడుతు ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీలపై …

Read More »

టీఆర్ఎస్ కొత్త తీరు.. ఛోటా నేతలకు భారీ ధర!

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ అధికారపక్షం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమకున్న అధికార బలాన్ని ప్రదర్శించటమే కాదు.. ధనబలాన్ని చూపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా సరికొత్త ఎత్తులకు తెర తీస్తోంది. మొత్తంగా తెలంగాణలో సరికొత్త రాజకీయాన్ని టీఆర్ఎస్ పరిచయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉప పోరు ఫలితం.. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్ని ప్రభావితం చేసే వీలు ఉండటంతో తమ ప్రత్యర్థులైన బీజేపీ.. కాంగ్రెస్ …

Read More »

రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారా?

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలనట. నిజానికి పార్టీకి అధ్యక్షపగ్గాలు తీసుకోవాలని రాహుల్ అనుకుంటే దాన్ని వ్యతిరేకించేంత సాహసం చేసేవాళ్ళు పార్టీలో ఎవరు ఉండరు. అయితే 2019లోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ వదులుకున్న విషయం అందరికీ తెలిసిందే. వరుసగా రెండుసార్లు పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తు …

Read More »

షాతో చంద్రబాబు.. తెలంగాణ మీటింగ్?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ముందుగా ప్రకటించి అమిత్ పర్యటన ప్రకారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా మునుగోడుకు వెళ్ళాలి. అక్కడ బహిరంగసభ చూసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబద్ చేరుకోవాలి. హైదరాబద్ లో కొందరు నేతలతో కాసేపు మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళిపోతారు. …

Read More »

ఎంఎల్ఏ అల్లుడు ఎలా చనిపోయారు?

రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు. మృతుడి తండ్రికి ఒక నిర్మాణ సంస్ధ ఉంది. రాంకీ కంపెనీ వర్కులను ఈ నిర్మాణసంస్ధ సబ్ కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేయిస్తుంటుంది. జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందలేదని …

Read More »

ఢిల్లీ లీక్క‌ర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసాలు స‌హా 31 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గ‌త న‌వంబ‌రులో ప్ర‌వేశ పెట్టిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయ‌ని .. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని.. ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు.. …

Read More »

ఎంఎల్ఏకి జగన్ చెక్ పెట్టినట్లేనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి విప్ లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో బీసీ నేత జంగా కృష్ణమూర్తి, ఎస్సీనేత, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. మామూలుగా అయితే ఈ విషయం పెద్దగా పట్టించుకోవక్కర్లేదు. కానీ డొక్కాను నియమించటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. డొక్కా నియామకం విషయంలో  అనుమానాలు ఎందుకంటే ఈయనది కూడా తాడేపల్లి నియోజకవర్గం …

Read More »

బీజేపీ నాయకత్వం.. రాములమ్మ అసంతృప్తి

చివరకు రాములమ్మ కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సినీ సెలబ్రిటీల హోదాలో రాజకీయపార్టీల్లోకి ఎంటరైన వారు ఎక్కడున్నా ఏదోకారణంతో అసంతృప్తిగానే ఉంటారేమో. నిజానికి వీళ్ళవల్ల పార్టీకి పెద్దగా ఉపయోగాలేవీ ఉండవు. కానీ తమవల్లే పార్టీకి ప్రజాధరణ పెరుగుతోందని, జనాలంతా తమకోసమే వస్తున్నారనే భ్రమల్లో ఉండటంవల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏపార్టీలో ఏ సెలబ్రిటీ ఉన్నా వాళ్ళదే ఇదే సమస్యగా తయారైంది. బీజేపీ నేత రాములమ్మ అలియాస్ విజయశాంతిది కూడా ఇదే …

Read More »

ఏపీలో అర‌డ‌జ‌ను మంది మంత్రుల‌కు ఇదే ప‌ని

మంత్రి అంటే.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌తో అమ‌లు చేయించ‌డం.. అవి స‌క్ర‌మంగా అమ‌ల‌వుతున్నాయో.. లేదో.. చూడ‌డం కీల‌క ప‌ని. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అర్జీల‌ను ప‌రిష్క‌రించ‌డం.. అవి ఏదశ‌లో ఉన్నాయో చూడ‌డం.. ప్ర‌జ‌ల‌కు కుదిరితే అందుబాటులో ఉండ‌డం కూడా అమాత్యుల విధుల్లో కీల‌క‌మైన వ్య‌వ‌హారం. అయితే.. ఏపీలో ఉన్న మంత్రులు ఈ విధుల‌ను ప‌క్క‌న పెట్టేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దాదాపు అర‌డ‌జ‌ను …

Read More »