జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనే అధికారంలో వచ్చేస్తామని ఆయన చెబుతున్నా.. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సో.. ఇప్పటికిప్పుడు అధికారం కోసం పోటీపడడకన్నా.. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని.. ఇప్పటి నుంచి పునాదులు బలంగా వేసుకుంటే బెటర్ అని పవన్ యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్ ఇటీవల కాలంలో తన మాట, వ్యూహం రెండూ మార్చుకున్నారు. 2023 కాకపోతే.. 2029 ఉంది.. సుదీర్ఘకాలం పోరాటం చేయడానికిసిద్ధపడ్డాను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది తొలుత చాలా మందికి అర్ధం కాలేదు.కానీ, తర్వాత.. పవన్ వ్యూహం తెలిసి ఔరా! అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే ఆలోచన లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, దీనిలో భాగంగా ముందు పునాదులు బలంగా వేసుకునే ప్రక్రియకు పవన్ శ్రీకారం చుట్టారని సమాచారం. కనీసం 20 మంది తన వెంట ఎమ్మెల్యేల సైన్యం ఉంటే.. వారిని చూపించి.. వారి ద్వారా ప్రజల మనసుల్లో పాగా వేయాలనేది.. స్వచ్ఛమైన పాలన అందించేందుకు ఈ 20 మందిని ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగేందుకు పవన్ వ్యూహాత్మకంగా ముందుకుసాగాలనేది ప్రధాన ఉద్దేశం.
ఈ క్రమంలోనే నాలుగు జిల్లాల్లో 20 నియోజకవర్గాల్లో పాగా వేసేలా పవన్ అడుగులు పడుతున్నాయని అంటున్నారు. వీటిలో విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఐదేసి చొప్పున విజయం దక్కించుకునే వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు తగ్గినా.. మిగిలిన జిల్లాల్లో వాటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే..ప్రస్తుతానికి జనసేన వ్యూహం అయితే ఇదేనని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates