జగన్ బెయిల్ రద్దవుతుందా?– ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అసమ్మతి నాయకుడు.. నరసాపురం ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా.. సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టులో ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఏ-1గా ఉన్న సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే జగన్‌పై 11 సీబీఐ ఛార్జిషీట్లు వేసిందని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో జగన్ …
Read More »టీడీపీలో స్పష్టంగా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా ?
తెలుగుదేశంపార్టీలో కూడా కాంగ్రెస్ లాంటి పూర్తి ప్రజాస్వామ్యం లక్షణాలు వచ్చేసినట్లుంది. కాంగ్రెస్ లో అంటే పై స్ధాయిలో ఒకటి చెబితే ఇష్టముంటే పాటిస్తారు లేకపోతే తమిష్టం వచ్చింది చేసుకుపోతారు. కాంగ్రెస్ లో అంటే ఏమి చేసినా చెల్లిపోతుంది. ఎందుకంటే అది జాతీయపార్టీ కాబట్టి. కానీ ప్రైవేటు ప్రాపర్టీ లాంటి ప్రాంతీయపార్టీ టీడీపీలో కూడా అలాంటి లక్షణాలు బాగా వచ్చేసినట్లు అర్ధమవుతోంది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను, ప్రకటనలను కొందరు సీనియర్లు దిక్కరిస్తున్నారంటే …
Read More »జగన్ సర్కారు అప్పు అడిగితే.. ఆర్బీఐ నో చెప్పిందా?
స్థాయికి మించిన సంక్షేమ పథకాలు.. ఆదాయానికి మించిన ఖర్చులు.. వెరసి ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సరిగా లేని పరిస్థితి. కరోనా దెబ్బతో మందగించిన ఆదాయం.. పడిపోయిన రియల్ ఎస్టేట్.. వెరసి ఏపీ ఆర్థిక పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తే.. సంక్షేమ పథకాల్ని అమలు చేయలేరు. అలా అని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ నెల …
Read More »జగన్ మంచి కోసం రఘురామరాజు పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది తిరక్కముందే.. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్‌గా మారిపోయారు. ముందు మెల్లగా అసంతృప్త స్వరం వినిపిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత హద్దులు దాటిపోయారు. పూర్తిగా పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సీఎం జగన్ సహా పార్టీ నాయకులందరి మీదా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ విధానాలను తీవ్ర స్థాయిలో తూర్పారబట్టారు. ఒక దశలో అదే …
Read More »హైకోర్టు సూటి ప్రశ్న: బార్లు.. పబ్ లు.. థియేటర్లపై ఆంక్షలు లేవేం
చాలా రోజుల తర్వాత కరోనా పరిస్థితులు.. కేసుల నమోదుపై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు.. చికిత్స.. నియంత్రణపై నివేదికను ప్రభుత్వం సమర్పించింది. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు సూటిగా పలు ప్రశ్నల్ని సంధించింది. బార్లు.. పబ్ లు.. సినిమా థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న ప్రభుత్వం.. …
Read More »ఈ స్టార్లకు ఏమైందబ్బా ?
ఒకవైపు రెండు విడతల పోలింగ్ జరిగిపోయినా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఇంతవరకు కాంగ్రెస్ అగ్రనేతలు అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఇదే సమయంలో తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఒకవైపు, నరేంద్రమోడి, అమిత్ షా, జేపీ నడ్డా అండ్ కో మరోవైపు బెంగాల్లో వేడి పుట్టించేస్తున్నారు. ఇప్పటికి మోడి నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తే అమిత్ షా అయితే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడల్లా బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే కాంగ్రెస్+వామపక్షాలు+ముస్లిం సెక్యులర్ ఫ్రంట్ కూటమిగా …
Read More »నోరు తెరవకుండానే చెప్పాల్సింది చెప్పేశాడు
గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు తమిళ కథానాయకుడు విజయ్. ఒకప్పుడు ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దరిదాపుల్లో ఏ హీరో నిలిచేవాడు కాదు. కానీ విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదిగిపోయాడు. ఇప్పుడు తమిళనాట అతనే అతి పెద్ద స్టార్ అనడంలో మరో మాట లేదు. ఆ రాష్ట్రంలో ఇలాంటి ఫాలోయింగ్ సంపాదించిన ప్రతి కథానాయకుడి అంతిమ లక్ష్యం రాజకీయాలే అవుతుంటాయి. రజినీ …
Read More »ఏపీ ప్రజలకు కాంగ్రెస్‌పై కొత్త ఆశలు…!
ఒకప్పుడు కాంగ్రెస్ మోసిన ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఆ పార్టీని పక్కన పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాదు.. కీలక నేతలు ఎంతో మంది పార్టీ మారిపోయారు. మరికొందరు తెరమరుగయ్యారు. అంటే.. దాదాపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాపచుట్టేసింది. మరి ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతుందా? ఎప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదా? అంటే.. మారుతున్న పరిస్థితులు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను …
Read More »బ్రేకింగ్.. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణ
తెలుగోడికి అత్యున్నత స్థానం దక్కింది. దేశ చరిత్రలో రెండోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుర్చీలో ఒక తెలుగువాడు కూర్చోనున్నారు. ఈ ఘనతను సొంతం చేసుకున్నది జస్టిస్ ఎన్వీ రమణ. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించటం.. రాష్ట్రపతికి పంపటం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి కోవింద్ ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. తాజాగా.. దీనికి సంబధించిన అధికారిక ఉత్తర్వులు …
Read More »300 సీట్లు.. 30 వేల కోట్లు.. పోస్కో.. అంబానీ.. ఆదానీ!
మళ్లీ అధికారంలోకి రావాలి. మళ్లీ పెత్తనం చలాయించాలి. బీజేపీ సిద్ధాంతాలను, ఆర్ ఎస్ ఎస్ హిందూ జాలాన్నీ దేశం మొత్తం పులమాలి! -ఇదీ ఇప్పుడు ఘనత వహించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేస్తున్న ఆలోచన. మరి దీనికి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఇప్పటికే రెండో టెర్మ్‌లో అధికారంలోకి వచ్చిన మోడీపై దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది. రాష్ట్రాలకు ఏమీ చేయడం లేదని.. పైగా ఉన్న అధికారాలను కూడా …
Read More »చంద్రబాబు మాట లైట్.. పరిషత్ లో పోటీకి అఖిలప్రియ సై
ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న …
Read More »కేసీఆర్.. బీజేపీ మీద యుద్ధం.. వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని, కనీస బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకొంటోందని కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక సమరం నాటికి.. బీజేపీకి …
Read More »