Political News

విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు తగ్గిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ఆందోళనలను గమనించిన కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కుకు ధక్షిణకొరియాలోని పోస్కో సంస్ధకు …

Read More »

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి …

Read More »

పంచాయ‌తీ చిత్రం: ఓటు కోసం.. శ్రీవారి ల‌డ్డూ ఎర‌..!!

ఓట్ల కోసం.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు వేయ‌ని ఎత్తులు లేవు. ఈ క్ర‌మంలోనే బంగారం నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. న‌గ‌దు నుంచి చీర‌ల వ‌ర‌కు ఇలా.. అనేక రూపాల్లో.. రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ ప‌రుచుకుని.. త‌మ ప‌బ్బం గ‌డుపుకొన్న విశేషాలు అనేకం.. తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లోనూ మ‌న‌కు క‌నిపించాయి. అయితే.. ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూను కూడా ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం వాడుకున్న ప్ర‌బుద్ధులైన నాయ‌కులు ఉన్నారా? …

Read More »

టీడీపీలో సామంతరాజులెవరబ్బా ?

విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగ ఫీలైపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ? అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ? సామంతరాజుల్లాగ ఫీలైపోతున్న వారెవరు ? అనే విషయాలను మాత్రం కేశినేని చెప్పలేదు. ఎంపిగా …

Read More »

తిరుప‌తిపై చింత మోహ‌న్ ఎఫెక్ట్‌.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావ‌డం, వ‌రుస‌గా దీనిని గెలుచుకుంటూ ఉండ‌డం(2014, 2019)తో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లోనూ దీనిని కైవ‌సం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించుకుంది. ఇక‌, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి ప‌ట్టుబ‌డుతోంది. అయితే.. ఈ పార్టీల మ‌ద్య టికెట్ వివాదం …

Read More »

తమ్ముళ్ళ గొడవలో చంద్రబాబుకే షాకిచ్చిన కేశినేని

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకే విజయవాడ ఎంపి కేశినేని నాని షాకిచ్చారు. విజయివాడ మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్ అభ్యర్ధి ఎంపిక గొడవలో పాత విషయాలన్నీ బయటకు వచ్చాయి. దాంతో మండిపోయిన ఎంపి గతంలో చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టి వాయించేశారు. అప్పట్లో ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడిన సమయంలో మేయర్ అభ్యర్ధిగా 39వ డివిజన్ అభ్యర్ధి పూజితను ఫోకస్ చేశారు. అయితే తాజాగా మరో డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి శివను ప్రకటించారట. పూజితేమో …

Read More »

వైసీపీ ఫుల్లు హ్యాపీ

కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే శాసనమండలిలో ఖాళీగా ఉన్న, ఖాళీ అవబోతున్న స్ధానాలను భర్తీ చేయటమే ఇందుకు కారణం. మార్చి 29వ తేదీకి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి రిటైర్ అవబోతున్నారు. ఇక వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగుస్తోంది. అలాగే మండలి సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్ …

Read More »

షాక్.. ఏపీ ఉద్యమ నేత చలసాని కుమార్తె సూసైడ్

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం …

Read More »

ఇలా అయితే.. బెజ‌వాడ టీడీపీకి బీట‌లే!

టీడీపీకి అంతో ఇంతో బలం ఉన్న న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న బెజవాడ‌.. త‌ర్వాత కాలంలో టీడీపీకి ప్ర‌ధాన కేంద్రంగా మారింది. కొన్నాళ్లు .. కాంగ్రెస్ నాయ‌కులు చ‌క్రం తిప్పి నా.. ప్ర‌ధానంగా దేవినేని నెహ్రూ హ‌యాంలో టీడీపీ పుంజుకుంది. ఫ‌లితంగా న‌గ‌రంలోని కొండ‌ప్రాంతాలు.. శివారు ప్రాంతాల్లోనూ టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉంది. ఇక‌, న‌గ‌రంలోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గం… ఎక్కువ‌గా ఉండ‌డంతో వారంతా టీడీపీకి బ‌ల‌మైన …

Read More »

మిలటరీ నాయుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన జగన్

అధికారంలో లేనప్పుడు అధినేతలకు ముఖం చూపించేందుకు చాలా మంది ఇష్టపడరు. అదే సమయంలో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత.. తమను విపరీతంగా అభిమానించే వారిని సైతం పెద్దగా పట్టించుకోని నేతలు కొందరుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు అధినేతల తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. సీఎం జగన్ కానీ.. తమను అమితంగా అభిమానించే వారు ఎక్కడున్నా సరే.. తామేస్వయంగా వారి దగ్గరకు వెళ్లటం అలవాటు. ఇలాంటి సీన్లు …

Read More »

పుట్టినరోజున కేసీఆర్ ఎక్కడున్నారు? ఎవరిని మాత్రమే కలిశారు?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ధూంధాంగా జరిగింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు తమ సొంత పుట్టినరోజును కూడా జరుపుకోనంత ఘనంగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని అధ్వర్యంలో 67కేజీల కేక్ ను కట్ చేశారు.ఈ కార్యక్రమానికి.. …

Read More »

ఉక్కు దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తు…టైమింగంటే శివాజీదేన‌బ్బా

సినీ న‌టుడు శివాజీకి సినిమాల్లో ఆశించినంత‌గా గుర్తింపు రాలేదు గానీ… రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా ఎంట్రీ లేకున్నా… ఆయా స‌మ‌స్య‌లపై త‌న‌దైన శైలి టైమింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌కు ఎన‌లేని గుర్తింపు వ‌చ్చింద‌నే చెప్పాలి. ఏపీపై కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపిస్తోందంటూ అప్పుడెప్పుడో గ‌రుడ పురాణం పేరిట ప్ర‌త్యేక ప‌రంప‌ర‌ను కొన‌సాగించిన శివాజీ…. ఏపీలో కొత్త‌గా కొలువుదీరిన జ‌గ‌న్ స‌ర్కారు వైఖ‌రి, ప్ర‌ముఖ టీవీ ఛానెల్ టీవీ9 వివాదంతో …

Read More »