కొడాలికి మళ్లీ జూనియర్ ఎన్టీయారే గతా?

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ జూనియర్ ఎన్టీయార్ జపం చేస్తున్నారు. ఎన్టీయార్ వారసత్వాన్ని అడ్డుకోవాలని, జూనియర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని అంటున్నారు. చాలా రోజుల తర్వాత నోరు విప్పిన కొడాలి ఇప్పుడు జూనియర్ ను ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నా… ఆయనకున్న అనివార్యతలు అలాంటివని బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు..

నిజానికి కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. మనసులో పడిన మాట బయట పెడతారు. మాట దాచుకునే రకం కాదు. పైగా ఏదో విధంగా చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని తిడతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావన తెస్తూ సీనియర్ వారసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీయార్ బీసీల సంక్షేమానికి కృషి చేశారని, చంద్రబాబు విస్మరించారని కూడా నాని అంటున్నారు..

జూనియర్ కు , కొడాలికి మంచి స్నేహం ఉండేది. ఒక దశలో కొడాలికి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే జూనియర్ రికమండ్ చేశారని కూడా వార్తలు వచ్చా.యి. అప్పట్లో జూనియర్ , టీడీపీకి ప్రచారం చేసేవారు. తర్వాతి కాలంలో కొడాలి వైపీసీలో చేరిపోయారు. జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పైగా కొడాలి వైసీపీలో చేరిన తర్వాత జూనియర్ తోనూ ఆయన సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతానికి జూనియర్ కు దూరంగా ఉన్నామని ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కొడాలి ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మళ్లీ ఆయన పేరు తెచ్చారు..

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారానికి రావాలంటే పగ్గాలు జూనియర్ కు అప్పగించాలని కొడాలి ఒకటి రెండు సార్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి సందేశమే ఇస్తున్నారు. ఇందులో కొడాలి కూడా ఏదో ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీయార్ ను మళ్లీ మంచి చేసుకుంటే భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ఆయన ఆశిస్తున్నారనుకోవాలి, అంతా అనుకున్నట్లే జరిగి జూనియర్ రాజకీయాలోకి వస్తే తాను కూడా అటు వైపు అడుగులు వేసే వీలుంటుందని ఆయన ఎదురు చూస్తున్నారనుకోవాలి. సామాజిక వర్గం లెక్కలు కూడా ఉన్నాయి కదా.. పైగా వైసీపీకి వస్తున్న వ్యతిరేకతతో ఆ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో కొనసాగుతుందో తెలీదు కదా. ఏదేమైనా కొడాలి నాని ముందుచూపున్నోడు కదా మరి…..