తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న స్టాలిన్ తీరును చూసి.. ఆయన మీద మంచి అభిప్రాయం లేని ఎంతో మంది ఆయన పాలనా తీరుకు ముగ్దులవుతున్న పరిస్థితి. రోటీన్ ముఖ్యమంత్రులకు భిన్నంగా.. అధికారం తనకు తలకు ఎక్కలేదన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తన చేష్టలతో చేసి చూపిస్తున్న స్టాలిన్ సైతం పుత్రప్రేమకు బంధీనే అన్న విషయం తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో అందరికి తెలిసి వచ్చిందంటున్నారు.
ఫ్యూచర్ ప్రధాని అయ్యే అవకాశం ఉన్న అతికొద్ది మంది ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ పేరు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటోంది. దీనికి తోడు ఆయన పాలనా తీరుపైనా ప్రశంసల వర్షం కురుస్తున్న పరిస్థితి. మిగిలిన వారి మాదిరి కాకుండా లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం ద్వారా.. ఆయన పాలనా తీరును పలువురు పొగిడేస్తున్నారు. ఇలాంటి వేళలో తన కుమారుడు కమ్ తమిళ హీరోగా సుపరిచితుడు ఉదయనిధి.
తాజాగా ఆయన్ను తన మంత్రివర్గంలోకి తీసుకోవటానికి సీన్ రెఢీ చేశారు. తమ ప్రభుత్వంలో యువజన క్రీడా శాఖా మంత్రిగా ఆయనకు ఫోర్టు ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? అన్న ప్రశ్నే వ్యక్తమైంది. అయితే.. ఉదయనిధికి చెన్నై మహానగరంలోని చేపాక్ ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అందరి అంచనాలకు తగ్గట్లే ఘన విజయానని సాధించిన ఉదయనిధికి మంత్రిపదవి ఖాయమని అప్పట్లోనే అనుకున్నారు. అయితే.. వారసత్వ రాజకీయాల మీద అప్పట్లో హాట్ హాట్ గా చర్చ సాగింది. దీంతో.. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న ప్రచారం సాగింది. దీనికి బలం చేకూరేలా తాజాగా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.ముఖ్యమంత్రి ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ ఓకే చెప్పటంతో ఈ రోజు ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయనున్నారు. దీంతో.. ఇంతకాలం స్టాలిన్ తీరుకు ఫిదా అయిన వారంతా పెదవి విరిచే పరిస్థితి.చివరకు స్టాలిన్ సైతం పుత్రప్రేమకు అతీతుడు కాదన్న మరకను తాజా నిర్ణయంతో అంటించుకున్నారని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates