జగన్ ఇంకో 250 పెంచేసాడుగా

Jagan to pick 50 new candidates for 2024 elections

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళ వారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్‌ పెంపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్ర‌స్తుతం రూ. 2,500గా ఉన్న సామాజిక పింఛ‌న్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది. మరోవైపు వైఎస్సార్‌ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినె ట్‌ ఆమోదం తెలిపింది.

అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది. విద్యార్థులకు ట్యాబులను ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని స్వయంగా మంత్రులే విద్యార్థుల‌కు అందించాల‌ని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమంలో మంత్రులు పాల్గొనాలని కూడా సీఎం నిర్దేశించారు.

గడపగడప కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం మంత్రులు అంద‌రికీ సూచించారు. జిల్లాల అధ్య క్షులతో కలిసి పని చేసుకోవాలని ఆదేశించిన‌ట్టు తెలిసింది. ఈనెల 16న గడపగడపకు ప్రభుత్వంపై సీఎం సమీక్ష చేయ‌నున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డం విశేషం.