దేశంలో కరోనా 2.0 తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచస్థాయి రికార్డులను నమోదు చేస్తూ.. కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 3లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్న దేశంగా అమెరికా తర్వాత భారత్ ఉండడం గమనార్హం. అంతేకాదు.. కేసుల తీవ్రతకు తోడు ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాల లేమి వంటివి దేశ ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మీడియా విషయాన్ని పక్కన పెడితే.. అంతర్జాతీయ మీడియా భారత్‌లో నెలకొన్న పరిణామాలపై …
Read More »“నూతలపాటి వెంకట రమణ అనే నేను..”..
“నూతల పాటి వెంకట రమణ అనే నేను”.. అంటూ.. తెలుగు తేజం, ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరం ప్రాంతానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది ప్రముఖులను మాత్రమే …
Read More »ఏపీలో మరో ఉప ఎన్నిక హీట్ స్టార్ట్ ?
ఏపీలోనూ.. తెలంగాణలోనూ వరుస ఎన్నికలతో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో గత సాధారణ ఎన్నికల నుంచి మొదలైన ఎన్నికల వేడికి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. తాజాగా ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి, తెలంగాణలో నాగార్జునా సాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు స్థానిక సంస్థలకు పెండింగ్ ఉన్న ఎన్నికలు కూడా ఈ సమ్మర్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల పరంపరలోనే ఏపీలో …
Read More »రత్నప్రభకు ఏపీ బీజేపీ నేతలే దెబ్బేశారా ?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. …
Read More »పరీక్షలా ? విద్యార్ధుల ప్రాణాలా ?
జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉన్నా, కేసులు ఎన్ని వేలు నమోదవుతున్నా 10వ తరగతి పరీక్షలను మాత్రం యధాతథంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. జగన్ తాజా నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలిసికూడా జగన్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ఎందుకింతగా పట్టుదలకు పోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. నిజానికి 10వ తరగతి పరీక్షలు …
Read More »కొంచెం వెయిట్ చేయండి.. రంగంలోకి జగన్..!
“కొంచెం వెయిట్ చేయండి.. సీఎం సార్ జగనే రంగంలోకి దిగుతున్నారు”- ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేతలకు సర్కారువారి కీలక సలహాదారు.. వైసీపీ కీలక నేత నుంచి ఫోన్లో అందుతున్న సమాచారం. ఈ జిల్లా ఆ జిల్లా అనే కాదు.. దాదాపు 11 జిల్లాల్లోని వైసీపీ నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు వైసీపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. మరో రెండు నెల్లలోనే వైసీపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు …
Read More »‘పంపకాల’ కలవరం.. బాబుకు సెగ పెడుతుందా ?
టీడీపీలో సరికొత్త విషయం చర్చకు వస్తోంది. తమ్ముళ్లు ఈ విషయాన్ని తలుచుకుని కలవరపడుతున్నారు కూడా..! ఆ విషయం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయినప్పటికీ.. ఒక విషయం మాత్రం తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా స్పష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చారు. …
Read More »కన్నాకు అదృష్టం వరించేనా ? బీజేపీలో కీలక పదవులు..!
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్.. కన్నా లక్ష్మీనారాయణకు త్వరలోనే అదృష్టం వరించనుందా ? ఆయనను వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా పంపించాలని లేదా.. కేంద్ర పార్టీలోకి తీసుకోవాలని.. యోచిస్తున్నట్టు బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం గడిచింన కన్నాపై ఎన్నో ఆశలతోనే బీజేపీ పెద్దలు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చీరావడంతోనే ఆయనకు ఏపీ బీజేపీ …
Read More »ఆక్సిజన్ కోసం తెలంగాణ సూపర్ ప్లాన్
కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతగా కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది వైరస్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి వందల టన్నుల్లో ఆక్సిజన్‌ను వివిధ …
Read More »బిగ్ బ్రేకింగ్: ఏపీలో రాత్రి కర్ఫ్యూ!
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు దీనిని అమలు చేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్రకటించారు. దీనిపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని …
Read More »బాబు విన్నపాలు బుట్టదాఖలు.. మే 2 కోసం వెయిటింగ్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్సన్ ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో లోకేష్‌ను బలంగా ప్రచారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నికల సమయానికి దొంగ వోట్ల కలకలం రేగింది. అధికార పార్టీ నేతలే …
Read More »టీడీపీ మాజీ మంత్రి ఒంటరయ్యారా ?
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు.. దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రస్తుతం పెద్ద చిక్కులో పడ్డారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ప్రచారం కోసం.. తిరుపతికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ కేంద్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. అప్పట్లో తిరుపతిపై జగన్ విమర్శలు చేశారంటూ.. ఆయన ఆ వీడియోలో మీడియాకు చూపించారు. దీంతో పార్టీ వైపు ప్రజలు సానుకూలంగా మారుతారని అనుకున్నారు. అయితే.. దీనిని …
Read More »