Political News

చిరు లాజికల్ పొలిటికల్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు టాటా చెప్పేసి చాలా కాలం అయింది. ఆయన అందరి వాడిగా ముద్ర వేయించుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా అధికార పక్షం, విపక్షం అని తేడా లేకుండా ఎవరితోనూ వ్యతిరేకత తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందరితోనూ సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తన్నారు. ఎవరినీ నొప్పించే, ఇబ్బంది పెట్టే ట్వీట్లు అస్సలు వేయట్లేదు. వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లట్లేదు. కానీ ఈ మధ్య …

Read More »

ఇలా వ‌చ్చి.. అలా క‌నుమ‌రుగు.. వీరేమ‌య్యారు ?

వారంతా రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. వారి త‌ల్లో, తండ్రో సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేసిన వారే. వివిధ ప‌ద‌వులు సైతం అలంక‌రించినవారే. రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రాలు తిప్పిన వారే. వీరిలో కొంద‌రు మంత్రులుగా, రాష్ట్ర ముఖ్య‌మంత్రులుగా చేసిన వారి వార‌సులు, స్పీక‌ర్‌గా చ‌క్రం తిప్పిన వారి వార‌సులు.. కూడా ఉన్నారు. అయితే.. అనివార్య కార‌ణాలు కావొచ్చు.. క‌లిసి వ‌చ్చిన అంశాలు కావొచ్చు.. వారివారి వార‌సులుగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. కొంద‌రికి గ‌త …

Read More »

లోకేష్‌కు ఓకే.. హైకోర్టుకు కూడా ఇలానే చెబుతారా?

రాష్ట్రంలో నెల‌కొన్న క‌రోనా తీవ్ర‌తను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని.. అదేవిధంగా ఇంట‌ర్ మీడియెట్ విద్యార్థుల‌కు కూడా త‌ర‌గ‌తులు ర‌ద్దు చేయాల‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ స‌ర్కారుకు విన్న‌వించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. ప‌రిస్థితిని స‌మీక్షించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం క‌రోనా ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని.. …

Read More »

షర్మిల పార్టీపై పబ్లిక్ టాక్ గురించి ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరమైన ఆర్టికల్

తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఆంధ్రజ్యోతి మిగిలిన వారి కంటే ముందుంది. ఆమె రాజకీయాల్లోకి వస్తారని.. తెలంగాణలోపార్టీ పెడతారని చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు సరికదా.. నవ్వేశారు. ఆ మీడియా సంస్థ యజమాని తనకు తోచిన వంటకాన్ని వండేసి.. తెలుగు ప్రజల మీదకు వదిలేశారంటూ తిట్టిపోసిన వాళ్లు లేకపోలేదు. చివరకు.. ఆ మీడియా సంస్థ చెప్పినట్లే.. షర్మిల రాజకీయ పార్టీ పెట్టటం తెలిసిందే. ఆమె రాజకీయ పార్టీకి సంబంధించిన …

Read More »

మోడికి ఉక్కు రివర్స్ షాక్ ?

తొందరలోనే నరేంద్రమోడికి విశాఖ ఉక్కు షాకివ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనుకోవాలి. వచ్చే నెల 7వ తేదీన కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో బంద్ చేయాలని డిసైడ్ అయ్యింది. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్యాక్టరీని ప్రైవేటీకరించ వద్దని ఉద్యోగులు, కార్మికులు ఎంతగా మొత్తుకుంటున్నా కేంద్రం లెక్క చేయటంలేదు. విజ్ఞప్తులను లెక్కచేయకపోగా ప్రైవేటీకరణ అంశంపై పదే పదే నరేంద్రమోడి …

Read More »

షర్మిలకు కరోనా దెబ్బ

అవును షర్మిలను కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. అంటే ఆమెకు కరోనా వైరస్ సోకిందని కాదు అర్ధం. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజులపాటు షర్మిల దీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె దీక్ష ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లోను రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపిచ్చారు. ఆమె పిలుపుకు సానుకూలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, …

Read More »

టీడీపీ నేత‌లు స‌ర్దుకోవాలి.. బాబు మ‌న‌సులో మాట…‌!

“ప్ర‌స్తుత ప‌రిణామాలు ఏమాత్రం బాగోలేదు. మ‌న‌మే స‌ర్దుకు పోవాలి!”-ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి స్థానిక నేత‌ల‌కు.. అందుతున్న స‌మాచారం. ఆయ‌న నేరుగా చెప్ప‌లేక పోయినా.. కీల‌క నేత‌ల ద్వారా ఆయ‌న మ‌న‌సులో మాట చెప్పిస్తున్నారు. దీనికి కార‌ణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేత‌ల‌పై వైసీపీ స‌ర్కారు వివిధ రూపాల్లో కేసులు న‌మోదు చేసింది. అదే స‌మ‌యంలో ఆర్థికంగా కూడా వారి వ్యాపారాల‌ను దెబ్బ‌తీస్తోందని పార్టీ నేత‌లు …

Read More »

‘ఏపీ క‌న్నా ఎక్క‌వ అప్పులు చేస్తున్నామా?’

‘అప్పు చేసి ప‌ప్పుకూడు!’ అనే సామెత‌.. ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానానికి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు మేధావులు. ‘అప్పులు పెరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువ‌గా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. ఇది మున్ముందు మంచి ప‌రిణామం కాదు. పెట్టుబ‌డులు పెట్టేవారు కూడా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని లెక్క చూసుకుంటారు. ఇలా చేసే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి’- అని ఇలా ఎవ‌రైనా.. అంటే.. ‘మీరు టీడీపీ నేత‌లు… …

Read More »

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్‌.. ఐసీయూలో 22 మంది మృతి

క‌రోనా రెండ ద‌శ వ్యాప్తి అనేక అవ‌స్థ‌లు తెచ్చిపెడుతోంది. క‌రోనా బారిన ప‌డిన వారికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌… ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. చాలా చోట్ల ఆక్సిజ‌న్ అంద‌క రోగులు మృత్యువాత ప‌డుతున్నారు. తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆక్సిజన్‌ అందక ఏడుగురు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్‌ కోసం పదేపదే వినతులు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువవ్వడంతో ఈ దుస్థితి నెలకొందని రోగుల బంధువులు ఆరోపించారు. …

Read More »

భూమన ఇమేజీకి మైనస్సేనా ?

లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజికి బాగా మైనస్ అవుతోంది. అసలే 2019 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీలో వైసీపీకి మైనస్ అయ్యింది. ఎంఎల్ఏగా భూమన 700 ఓట్లతో గెలిస్తే పార్లమెంటుకు వచ్చేసరికి దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు 3వేల చిల్లర ఓట్లు మైనస్ అయ్యాయి. ఈ కారణంగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర భూమనకు మైనస్ అయ్యింది. …

Read More »

మా చెల్లెలకు ఉద్యోగం ఎందుకు రాలేదంటే.. ఏపీ డిప్యూటీ సీఎం వివరణ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కులంపై రగడ గురించి తెలిసిందే. ఆమె చెప్పుకుంటున్నట్లుగా డిప్యూటీ సీఎం ఎస్టీ కాదన్న ఆరోపణల్ని పలువురు సంధిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమె సోదరికి డీఎస్సీ ఉద్యోగం రాలేదని.. ఆమెను అనర్హులుగా గుర్తించినట్లు ఆరోపిస్తున్నారు. నిజానికి పుష్పవాణి కుల రగడ ఇప్పుడే మొదలుకాలేదు. ఆమె నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఉంది.అంతకంతకూ ఎక్కువ అవుతున్న ఆరోపణల జోరుకు బ్రేకులు వేసేందుకు పుష్పవాణి ఒక …

Read More »

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి దేశానికి ఆక్సిజన్

విశాఖ స్టీల్ ప్లాంటు ఘన చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసి, మరెంతోమంది విలువైన ఆస్తులను రాసిచ్చి విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటయ్యేలా చూస్తే.. నాటి నుంచి గొప్ప పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇలాంటి సంస్థకు సొంత గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు చవిచూస్తే.. దాన్నే సాకుగా చూపించి ప్రైవేటు పరం చేయడానికి అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. …

Read More »