జనసేనాని పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైన వైసీపీ విమర్శల వర్షానికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సీఎం జగన్ మరోసారి పవన్ భార్యల గురించి నోరు పారేసుకున్నారు. నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మరోమారు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
‘ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు . ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో’ అని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన దత్తపుత్రుడు కూడా ‘ఈ భార్య కాకపోతే ఆ భార్యతో’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది వీరి సరళి అని పవన్ కల్యాణ్ ఉద్దేశించి విమర్శించారు. అంతటితో ఆగకుండా ‘ఒకాయన (పవన్ కల్యాణ్) రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు గడిచింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ్రజలు ఓడించారు. ఈయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే’ అని ఎద్దేవా చేశారు.
ఏపీలో జనసేన, వైసీపీ నేతల మధ్యి ఇటీవల కాలంలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. కాపు ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే కూడా సీఎం జగన్ ఒకసారి పవన్ కల్యాణ్ భార్యల గురించి పరోక్ష విమర్శలు చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోమారు ఆయన అదే విమర్శలు పునరుద్ఘాటించడంతో జనసైనికులు ఏ స్థాయిలో స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates