ఔను.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై ఆ జిల్లా TDP తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్ నడుస్తోంది. ఇవి ఎవరికిస్తారు? ఇస్తే.. ఎవరు పోటీ చేస్తారు? పోటీ చేస్తే.. గెలుస్తారా? అసలు మనకు ఛాన్స్ ఉందా? ఇదీ.. ఇప్పుడు ఆ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను వేధిస్తున్న నాలుగు ప్రశ్నలు. ఆ నియోజకవర్గాలే.. తెనాలి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు గుంటూరు తూర్పు.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని.. టీడీపీ అధినేత దాదాపు సంకేతాలు ఇచ్చే శారు. ఈ క్రమంలో.. గుంటూరును తీసుకుంటే.. ఈ నాలుగు నియోజకవర్గాలు Janasenaకు కీలకంగా మారనున్నాయి. దీంతో ఈ నాలుగు టీడీపీకి దక్కే పరిస్థితి లేదని నేతలు భావిస్తున్నారు. దీంతో ఒకరిద్దరు.. బ్లాస్ట్ కూడా అయిపోతున్నారు. ఈ పరిణామాలతో అక్కడ ఏం జరుగుతోందో చర్చకు వస్తోంది.
తెనాలి: జనసేనతోపొత్తు ఉంటే.. టీడీపీ ఈ జిల్లాలో వదులుకునే ఫస్ట్ సీటు. జనసేన రాజకీయ వ్యవహారా ల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. దీంతోఈ టికెట్ ఆశిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.
సత్తెనపల్లి: కాపులు ఎక్కువగా నియోజకవర్గం గుంటూరులో ఇదేనని చెబుతారు. సో.. ఇక్కడ మంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ మళ్లీ ఇదే టికెట్ ఇస్తే.. ఖచ్చితంగా దీనిని జనసేనకు ఇస్తారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అంబటి ఓటమే లక్ష్యంగా కాపు నేతను జనసేన రెడీ చేస్తోందని కూడా అంటున్నారు.
ప్రత్తిపాడు: ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి ఇంచార్జ్(ఎస్సీ నియోజకవర్గం కావడంతో) లేరు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కోసంప్రయత్నిస్తున్నవారు ఉన్నారు.కానీ, దీనిని రెండు పార్టీలు కోరుతున్నాయి. ఒకటి కొత్తగా పుట్టి జైభీం భారత్, రెండు జనసేన. దీంతో ఇక్కడ ఆశలు పెట్టుకున్నవారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు తూర్పు: ఇక్కడ ఒకప్పుడు లాల్‌జానాబాషా సోదరుడు చక్రం తిప్పేవారు. అయితే.. ఆయన కొన్నాళ్ల కిందట వైసీపీ పంచన చేరారు. ఇప్పుడు బాషా కుమారుడికి టికెట్ ఇవ్వాలని అనుకున్నా.. ఆయన యాక్టివ్‌గా లేరు. దీంతో దీనిని జనసేన ఖాతాలో వేసేస్తారనేచర్చసాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates