కరోనా రెండ దశ వ్యాప్తి అనేక అవస్థలు తెచ్చిపెడుతోంది. కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ సరఫరా చేయలేక… ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. చాలా చోట్ల ఆక్సిజన్ అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆక్సిజన్ అందక ఏడుగురు కొవిడ్ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కోసం పదేపదే వినతులు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువవ్వడంతో ఈ దుస్థితి నెలకొందని రోగుల బంధువులు ఆరోపించారు. …
Read More »భూమన ఇమేజీకి మైనస్సేనా ?
లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజికి బాగా మైనస్ అవుతోంది. అసలే 2019 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీలో వైసీపీకి మైనస్ అయ్యింది. ఎంఎల్ఏగా భూమన 700 ఓట్లతో గెలిస్తే పార్లమెంటుకు వచ్చేసరికి దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు 3వేల చిల్లర ఓట్లు మైనస్ అయ్యాయి. ఈ కారణంగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర భూమనకు మైనస్ అయ్యింది. …
Read More »మా చెల్లెలకు ఉద్యోగం ఎందుకు రాలేదంటే.. ఏపీ డిప్యూటీ సీఎం వివరణ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కులంపై రగడ గురించి తెలిసిందే. ఆమె చెప్పుకుంటున్నట్లుగా డిప్యూటీ సీఎం ఎస్టీ కాదన్న ఆరోపణల్ని పలువురు సంధిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమె సోదరికి డీఎస్సీ ఉద్యోగం రాలేదని.. ఆమెను అనర్హులుగా గుర్తించినట్లు ఆరోపిస్తున్నారు. నిజానికి పుష్పవాణి కుల రగడ ఇప్పుడే మొదలుకాలేదు. ఆమె నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఉంది.అంతకంతకూ ఎక్కువ అవుతున్న ఆరోపణల జోరుకు బ్రేకులు వేసేందుకు పుష్పవాణి ఒక …
Read More »వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి దేశానికి ఆక్సిజన్
విశాఖ స్టీల్ ప్లాంటు ఘన చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసి, మరెంతోమంది విలువైన ఆస్తులను రాసిచ్చి విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటయ్యేలా చూస్తే.. నాటి నుంచి గొప్ప పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇలాంటి సంస్థకు సొంత గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు చవిచూస్తే.. దాన్నే సాకుగా చూపించి ప్రైవేటు పరం చేయడానికి అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. …
Read More »ఇక టీడీపీ ఎమ్మెల్యేలు గప్‌చుప్ అయిపోతారా ?
స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత.. టీడీపీలో ఒక చిత్రమైన విషయం హల్చల్చేస్తోంది. వైసీపీలోనేమో.. ఇంకేముంది.. టీడీపీ ఖాళీ అయిపోతుంది.. అందరూ వచ్చి తమ పార్టీలో చేరిపోతున్నారు.. దీంతో టీడీపీ ఖాళీ అయిపోతుంది..! అని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో వైసీపీ చెబుతున్న, లేదా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. పక్కన పెడితే.. టీడీపీలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. గతంలో ఉన్న దూకుడు మాత్రం ఉండే అవకాశం లేదని అంటున్నారు …
Read More »వ్యాక్సిన్ పై చేతులెత్తేసిన మోడి
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతులెత్తేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో మోడి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం బాధ్యతలనుండి తప్పించుకుంది. కేవలం ప్రకటనవరకు చేసిన కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపైకి నెట్టేసింది. కరోనా వైరస్ ఎటాక్ అవటానికి వయసుతో సంబంధం ఉండటంలేదు. వైరస్ …
Read More »మరో గెలుపే టార్గెట్‌గా వైసీపీ దూకుడు… ఏ ఎన్నికో తెలుసా ?
తూర్పుగోదావరి జిల్లాకు తలమానికమైన రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్‌కు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రామాల విలీనం సమస్య కావడంతో ఈ కేసు కోర్టుకువెళ్లింది. దీంతో మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా.. రాజమండ్రికి మాత్రం జరగలేదు. దీంతో త్వరలోనే ఎన్నికలు జరిగేలా.. ముసాయిదా ప్రకటన తీసుకువచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో రాజమండ్రిలో రాజకీయ వేడి పెరిగింది. రాష్ట్ర …
Read More »ఏపీ సర్కారుకు ముప్పు.. అందరినోటా.. ఇదే మాట…!
ఏపీ సర్కారు అనిశ్చితిలో పడిందనే వాదన వస్తోంది. ఆర్థికంగా ఒకవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కారుకు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ భారీగా తగిలిందనేది విశ్లేషకుల అంచనా. సాధారణ ప్రజలకు కరోనా వస్తే.. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన.. రంగంలోకి దిగి ప్రజలకు సేవ చేసింది. అయితే.. ఇప్పుడు కరోనా రెండో దశ వ్యాప్తి భారీ ఎత్తున కొనసాగుతోంది. దీంతో.. ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు …
Read More »వైసీపీలో అంతా గప్‌చుప్.. రీజనేంటి ?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో దొంగ ఓట్ల దందా అంటూ.. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. టీడీపీ అనుకూల మీడియా అయితే.. వీడియోలు, ఆడియోలతో సహా వైసీపీపై నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో వైసీపీ నేతల్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం దీనిపై స్పందించారు. మిగిలిన వారిలో ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి అనిల్‌కుమార్ …
Read More »బాబు గుస్సా… చివరకు లోకేష్‌కే పగ్గాలా ?
టీడీపీ నేతల వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్థాపంతో ఉన్నారా ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ? అని ఆయన తర్జన భర్జన పడుతున్నారా ? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది.. టీడీపీ వర్గాల నుంచి. మరి దీనికి విరుగుడు ఏంటి ? ఏం చేస్తే.. పార్టీ పరిస్థితి చక్కబడుతుంది ? అనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెల రోజుల పాటు ఆయన పార్టీకి, …
Read More »విజయసాయి గారూ.. ఇదేం సంస్కారం?
రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒక పార్టీ అధినేత పుట్టిన రోజు లాంటి సందర్భం వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఇది ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమే. రాజకీయాలు ఎంతగా దిగజారినప్పటికీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం నాయకులు హుందాగానే ప్రవర్తిస్తారు. అవతలి పార్టీ నేత మీద లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. బయటికి మాత్రం మర్యాదపూర్వకంగానే శుభాకాంక్షలు చెబుతుంటారు. ఒకవేళ శుభాకాంక్షలు చెప్పడం …
Read More »జగన్ తప్పు చేస్తున్నాడా ?
చుట్టుపక్కల ప్రపంచంలో ఏమి జరుగుతోందో చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగినట్లు లేదు. ఒకవైపు రోజుకు 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే అనేక రాష్ట్రాలు స్కూళ్ళని మూసేశారు. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయటంతో పాటు ఇంటర్మీడియా మొదటిసంవత్సరం పరీక్షలను నిరవధికంగా వాయిదావేశారు. చివరకు సీబీఎస్ఇ కూడా 10వ తరగతి పరీక్షను రద్దుచేసింది. …
Read More »