Political News

విజయవాడలో లాక్‌డౌన్.. పెట్టినట్లే పెట్టి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టడం గురించి నిన్న సాయంత్రం నుంచి తెగ చర్చ నడుస్తోంది. తమిళనాడులో కొన్ని సెలెక్టివ్ సిటీలు, టౌన్లలో లాక్ డౌన్‌ పెట్టినట్లే ఏపీలో విజయవాడలో లాక్ డౌన్ పెడుతున్నట్లు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం మొదలైంది. సాయంత్రం నిజంగానే లాక్ డౌన్ ప్రకటన చేశారు కూడా. కలెక్టర్ ఇంతియాజ్ పేరుతో ప్రెస్ నోట్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు. విజయవాడలో కరోనా …

Read More »

వైసీపీలో సాయిరెడ్డి స్థానం చెక్కుచెదర్లేదా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసును వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి పేరుతో విడుద‌ల చేసింది. త‌ద్వారా, మ‌రోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజ‌య‌సాయిరెడ్డి …

Read More »

బీజేపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ చూపిస్తున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఏంటో? ఆయ‌న అనుస‌రించే విధానాన్ని స‌హ‌జ శైలిగా భావించాలా లేక‌పోతే త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేసే గేమ్ ప్లాన్ అనుకోవాలో తెలియ‌క బీజేపీ నేత‌‌లు బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నార‌ట‌. క‌రోనా క‌ష్ట‌కాలం త‌రుణంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదిలో అనుస‌రించిన వైఖ‌రిని… ఇప్పుడు విరుచుకుప‌డుతున్న విధానాన్ని విశ్లేషిస్తున్న‌ క‌మ‌ల‌నాథు‌లు త‌మ‌ను గులాబీ పెద్ద టార్గెట్ చేశార‌ని డిసైడ్ అవుతున్నారు. భార‌త‌దేశంలో కరోనా విస్తృతి మొద‌లైన త‌రునంలో మిగ‌తా …

Read More »

బాబు -జగన్ – బాబు … ఈ సంప్రదాయం కొనసాగాల్సిందేనా?

Jagan

కొద్ది రోజుల క్రితం ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా ఎక్కువగా వైరల్ అయ్యింది. ధాని సారాంశం ఏమంటే.. 151 మేకలు.. 23 పులులు.. అంటూ సింగిల్ లైన్ లో పెట్టిన ఈ పోస్టు ఎక్కువగా షేర్ అయ్యింది. తర్వాతేమైంది? అన్న విషయంలోకి వస్తే.. ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి కూర్చోబెట్టారు. అంతేనా.. …

Read More »

ఏపీలో ఆ ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దు

క‌రోనా దెబ్బ‌కు ఈ ఏడాది అన్ని కార్య‌క‌లాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే ప‌రిస్థితి లేదు. చాలా త‌ర‌గ‌తుల‌వి ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించుకోలేని ప‌రిస్థితి త‌లెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ ప‌రీక్ష‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం మొదలైంది. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా లాక్ డౌన్ విధించ‌డం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్ల‌డంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ముందు తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి …

Read More »

వైసీపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఖాయమేనా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ….ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమైన పేరు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ…జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, …

Read More »

ఏపీ డీజీపీ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?

కొన్నిసార్లు అంతే. వ్యవస్థలోని కొందరు చేసే తప్పులకు అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఇరుకున పడుతుంటారు. తాజాగా అలాంటిదే ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర హైకోర్టుకు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా కోర్టు హాజరై.. న్యాయమూర్తి ముందు సమాధానం చెప్పాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. రూల్ బుక్ లోని నిబంధనల్ని …

Read More »

నిన్న రాంమాధవ్, నేడు కిషన్ రెడ్డి: జగన్‌పై బీజేపీ స్వరం మారుతోందా?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-వైసీపీ అంతర్గత మిత్రులు అనే విమర్శలు ఇతర పార్టీల నుండి వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లోపాయికారి ఒప్పందం లేదా మద్దతు వల్లే జగన్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. జీవీఎల్ నర్సింహారావు వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా వైసీపీకి అనుకూలంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు …

Read More »

తెలంగాణ టు ఏపీ.. వైకాపా ఎమ్మెల్యేకు కరోనా

కరోనా మహమ్మారికి చిన్నా పెద్దా.. రాజు పేద అని తేడాలేమీ ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులను ఆ వైరస్ పలకరించింది. ఏకంగా బ్రిటన్ ప్రధానే కరోనా బాధితుడిగా మారారు. మన దేశం విషయానికి వస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని బారిన పడ్డారు. తమిళనాట ఓ ఎమ్మెల్యే సైతం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు …

Read More »

సంచలనం.. కరోనా టెస్టు చేస్తే గర్భం బయటపడింది

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహంలో కరోనా పరీక్షలు చేయగా.. అందులో 57 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ 57 మందిలో ఏడుగురు గర్భవతులని తేలడం సంచలనం రేపుతోంది. అంతే కాదు.. ఒక అమ్మాయికి హెచ్‌ఐవీ ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపై దృష్టిసారించి విచారణ జరపాలని ఆదేశించే …

Read More »

ట్రంప్ తీరుపై సుందర్ పిచాయ్ అసంతృప్తి

మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు వచ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను అరికట్టేందుకే ట్రంప్ హెచ్‌1-బీ, హెచ్-4 …

Read More »

డిప్యూటీ సీఎంగా అనిల్ కుమార్ యాదవ్?

తాజాగా ఏపీకి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన నాలుగు సీట్లను వైసీపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో, ఖాళీ అయిన మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఖాళీ అయిన బీసీ వర్గానికి చెందిన మంత్రి పదవులను ఆ సామాజికవర్గానికే కేటాయించాలని జగన్ …

Read More »