ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు పది లక్షలకు పైగా వ్యాక్సిన్లు.. ఆదివారం కొన్ని టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు.. అలాగే సోషల్ మీడియాలో హోరెత్తిన వార్త ఇది. సరిగ్గా చెప్పాలంటే ఆదివారం ఏపీలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 13,26,271. ఒక్క రోజులో ఒక రాష్ట్రం ఇన్ని వ్యాక్సిన్లు వేయడం రికార్డట. దీని గురించి జగన్ సర్కారు మద్దతుదారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై హోరెత్తించేస్తున్నారు. కానీ ఇలా రికార్డ్ నెలకొల్పడం …
Read More »మోడీని నిలదీస్తున్న ప్రపంచం.. సమాధానం చెప్పక తప్పలేదు..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకున్నారా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశారా? ఈ క్రమంలోనే ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం మోడీ నిర్ణయాన్ని ప్రశ్నించిందా? దీంతో ఆయన సమాధానం చెప్పక తప్పలేదా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. దేశంలో సోషల్ మీడియా వేదికలుగా ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్.. సహా …
Read More »జమ్మూ-కాశ్మీర్ తో ఆడుకుంటున్న కేంద్రం
దేశంలోనే అత్యంత సున్నితమైన ఓ భూభాగం జమ్మూ-కాశ్మీర్ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఆటలాడుకుంటున్నట్లుంది. తనిష్టప్రకారం ఒకసారి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించటం లేదా రాష్ట్ర హోదా ఇవ్వటం చేస్తోంది. దశాబ్దాల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు యూపీఏ ప్రభుత్వం అప్పుడెప్పుడో సంపూర్ణ రాష్ట్రహోదా ఇచ్చింది. తర్వాత ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశానికి జమ్మూకాశ్మీర్ చాలా ముఖ్యమన్న విషయం అందరికీ …
Read More »రాహుల్ గాంధీని ట్రోల్ చేయబోయి..
రాజకీయ నాయకులు ప్రసంగాలు ఇచ్చేటపుడో.. ప్రెస్ మీట్లలోనో మాటలు తడబడితే.. అవి పట్టుకుని సోషల్ మీడియా జనాలు ఎంతగా ట్రోల్ చేసేస్తుంటారో తెలిసిందే. వాటి ఆధారంగా కొందరి మీద ఒక ముద్ర వేసి అదే పనిగా కామెడీ చేస్తుంటారు. జాతీయ నాయకుల్లో రాహుల్ గాంధీ.. ఏపీ వరకు తీసుకుంటే నారా లోకేష్ ఇలాగే లక్ష్యంగా మారిపోయారు. కొంచెం ఛాన్సిచ్చేసరికి దాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులు వాళ్లను దారుణంగా ట్రోల్ చేసి …
Read More »రెండు పార్టీల నేతలు హడావుడి మొదలుపెట్టేశారు
ఆలులేదు చూలులేదు..అల్లుడి పేరు సోమలింగం అన్న సామెతలాగ తయారైపోయింది అధికార టీఆర్ఎస్-బీజేపీల వ్యవహారం. హుజూరాబాద్ లో ఎప్పుడు జరుగుతుందో తెలీని ఉపఎన్నికల కోసం ఇప్పటి నుండే రంగంలోకి దిగేశాయి రెండు పార్టీలు. అనవసరంగా టెన్షన్ పెంచేసుకుంటున్నారు పై పార్టీల నేతలు. ఎంఎల్ఏ పదవికి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేశారు కానీ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. ఈ విషయంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందా?
అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. ముందుగా ఉదయం 10 నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు, మరణాలు బాగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. …
Read More »రాహుల్ @ 51.. దశ తిరుగుతుందా?
వందేళ్ల సీనియార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 51వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. నిజానికి గాంధీల కుటుంబం పరంగా చూస్తే.. ఇందిర, రాజీవ్‌గాంధీలు.. ఈ వయసులోపే.. అంటే ఫార్టీల్లోనే ప్రధానమంత్రి పీఠాలను అధిరోహించారు. అలాంటి రికార్డు ఉన్న గాంధీల వారసుడుగా రాహుల్ కు ఇప్పుడు పెద్దబాధ్యతే ఉంది. ప్రస్తుతం 51వ ఏడులోకి అడుగు పెట్టిన రాహుల్.. కరోనా నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలకు …
Read More »ఆ పట్టుదలకు 550 రోజులు.. సపోర్ట్ చేయాల్సిందే!
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 550 రోజులుగా సాగుతున్న ఉద్యమం. అది కూడా ఐదుకోట్ల మంది కోసం చేస్తున్న ఉద్యమం..మరి దీనిలో మన పాత్ర ఎంత? అనేది తరచి చూసుకోవాలి.. అది కలల రాజధాని. ప్రపంచ స్థాయి నగరంగా వర్థిల్లాల్సిన రాజధాని. అయితే.. మారిన పాలకుడి కారణంగా.. ఈ ప్రభ సన్నగిల్లిపో యింది. ప్రపంచ స్థాయి నగరం.. ఇప్పుడు కన్నీరు పెడుతోంది. అదే నవ్యాంధ్ర రాజధాని …
Read More »టీడీపీలో ఈ అంచనాలు.. కర్ర విడిచి సాముచేస్తున్నారే!
ఔను! ఈ లెక్కలేంటి? ఈ లోకం ఏంటి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ గురించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం ఎవరు కాదన్నా.. ఔనన్నా.. టీడీపీకి జీవితకాల మద్దతు దారులు సైతం అంగీకరిస్తున్న కీలక విషయం.. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని! దీనిని ఎవరూ కాదనరు. మరి పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అంటే.. మాత్రం వేళ్ల మీదనే లెక్కించుకోవాల్సి వస్తోంది. అదేసమయంలో పార్టీ పరిస్థితి ఇలా …
Read More »రూటు మార్చిన అసమ్మతి
కర్నాకటలో అసమ్మతి నేతలు రూటు మార్చినట్లున్నారు. యడ్యూరప్పను సీఎం పదవిలో నుండి తొలగించే విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీ నుండి అరుణ్ సింగ్ అనే దూతను అగ్రనేతలు పంపిన విషయం తెలిసిందే. ఎలాగైనా యడ్డీని పదవిలో నుండి దింపేయాలనే ఉద్దేశ్యంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్న విషయం తెలిసిందే. అరుణ్ తో భేటీ అయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు యడ్డీ విషయమై తమ అభిప్రాయాలను స్పష్టంగానే చెప్పారు. అయితే అభిప్రాయసేకరణ …
Read More »ట్విట్టర్ పై వేటు తప్పదా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా కేంద్ర్రప్రభుత్వానికి, సోషల్ మీడియా నెట్ వర్క్ యాజమాన్యాలకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఏ సోషల్ నెట్ వర్కయినా దేశ చట్టాలకు లోబడే పనిచేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా యాజమాన్యాలు మనదేశ చట్టాలను అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం అంతిమంగా తమ విధానాలే తమకు ముఖ్యమని వాదిస్తోంది. ఇదే విషయమై …
Read More »బీజేపీ ఓవర్ యాక్షన్
బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు. ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు …
Read More »