Political News

ఈటలకు తృటిలో తప్పిన ప్రమాదం..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి తృటిలో ప్రమాదం తప్పింది. బీజేపీలో చేరేందుకు ఈటల తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే.. ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి …

Read More »

బీజేపీకే అంటుకున్న మంటలు

పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు. ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు …

Read More »

కేశినేనికి పోటీగా ఆ క‌మ్మ నేత రెడీయేనా ?

ఏపీలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టేశారు. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ చెంత చేరిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయిన మూడు లోక్‌స‌భ సీట్ల‌పై కూడా జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు. కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం ఎంపీ సీటులో టీడీపీ కీల‌క‌నేత రామ్మోహ‌న్ నాయుడును ఓడించేందుకు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు ఉప ముఖ్య‌మంత్రి …

Read More »

మొత్తానికి సాధించిన జ‌గ‌న్.. గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్న‌ల్

తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసిన న‌లుగురు నేత‌ల ఎమ్మెల్సీ పోస్టుల విష‌యంలో ఎట్ట‌కేల‌కు .. గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆ న‌లుగురు నేత‌ల్లో ఇద్ద‌రి విష‌యం డోలాయ‌మానంలో ప‌డేస‌రికి సీఎం జ‌గ‌న్ హుటాహుటిన గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్‌ను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చేందుకు గ‌వ‌ర్న‌ర్ ఓకే చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో భ‌ర్తీ కావాల్సిన నాలుగు ఎమ్మెల్సీ పోస్టుల‌కు వైసీపీ స‌ర్కారు.. …

Read More »

అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే ప‌ట్టం.. జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టులో మ‌రో గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తి వంశీయుల‌కు చెందిన మాన్సాస్ ట్ర‌స్టు, సింహాచ‌లం ఆల‌య ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జ‌గ‌న్ జీవో 72ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు సోద‌రుడు దివంగ‌త ఆనందగ‌జ‌ప‌తి రాజు కుమార్తె సంచ‌యిత ను నియ‌మించారు. అప్ప‌ట్లో తీవ్ర వివాదాల‌కు దారితీసిన …

Read More »

బీజేపికి నొప్పేంటో తెలుస్తోందా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ అధికారం నేరుగా ప్రజలు ఇవ్వటం వల్ల వచ్చిందికాదు. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటి లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది. ఫలితాల సమయంలోనే ముందుగా మేల్కొనటం ద్వారా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లోబరుచుకోవటం తదితర మార్గాల్లో అధికారంలోకి వచ్చేసింది. అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు గాలమేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దాంతో ప్రభుత్వం పడిపోగానే తాను అధికారంలోకి …

Read More »

మోడి మెడలు వంచుతున్న చిన్న పార్టీలు

ఇప్పటి రాజకీయాలంతా అవసరాలు, అవకాశాలుగా మారిపోయింది. అవసరమున్నపుడు దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేయటం అందరు చూస్తున్నదే. అదే సందర్భంగా ఎదుటివాళ్ళ అవసరాలనే తమకు అవకాశంగా మలచుకుని తమ డిమాండ్లను సాధించుకుంటున్న విషయాలు కూడా చూస్తున్నదే. ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిస్ధితికి సరిగ్గా సరిపోతుందని చెప్పేందుకే. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత యోగి ప్రభుత్వంపై జనాల్లో మంట పెరిగిపోతోంది. ఈమధ్యనే జరిగిన లోకల్ …

Read More »

టీడీపీ ఎంతో ఇచ్చింది.. కానీ.. వ‌దిలేస్తున్నా..

తెలంగాణ టీడీపీకి భారీషాక్ త‌గిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. సీనియ‌ర్ నాయ‌కుడు ఎల్‌.ర‌మ‌ణ పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నారు. త్వ‌ర‌లోనే తాను పార్టీని వీడ‌నున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న అధికార పార్టీ టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకోనున్న‌ట్టు కూడా వెల్ల‌డించారు. వాస్త‌వానికి గ‌డిచిన నెల రోజుల‌కు పైగా ఎల్ .ర‌మ‌ణ రాజ‌కీయ మార్పుపై తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న పార్టీ మార డం ఖాయ‌మ‌ని.. …

Read More »

పదవులపై జగన్ కీలక నిర్ణయం

అధికారంలోకి వచ్చి రెండేళ్ళయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పదవుల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని సుమారు 80 కార్పొరేషన్లలో ఛైర్మన్లుగా నియమించాలని డిసైడ్ అయ్యారు. ఛైర్మన్లకు తోడు పై కార్పొరేషన్లలో సగటున 12 మంది డైరెక్టర్లు అంటే మరో 960 మందిని నియమించబోతున్నారు. ఛైర్మన్లు, డైరెక్టర్లుగా తమను నియమిస్తారని చాలామంది సీనియర్ నేతలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అప్పుడొకటి …

Read More »

ఎంఎల్సీ జాబితాపై వివాదం ?

జగన్మోహన్ రెడ్డి పంపించిన నాలుగుపేర్ల ఎంఎల్సీ జాబితాపై గవర్నర్ అభ్యంతరాలు చెప్పారా ? అవుననే అంటోంది ఓ సెక్షన్ మీడియా. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు పోస్టులకు ప్రభుత్వం ఈమధ్యనే నాలుగు పేర్లను సిఫారసు చేసింది. రమేష్ యాదవ్, లేళ్ళ అప్పరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు పేర్లున్న ఫైల్ ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరుంది. అయితే సదరు మీడియా ప్రచారం ప్రకారం లేళ్ళ అప్పిరెడ్డి, తోట …

Read More »

పేరు తెచ్చే ప‌థ‌కాలు.. పీడిస్తున్నాయా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ల‌క్ష్యం అంద‌రికి తెలిసిందే. వ‌చ్చే 30 ఏళ్ల‌పాటు తానే ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని ఆయ‌న ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ.. చేయ‌ని విధంగా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో పింఛ‌న్ల‌ను పెంచ‌డంతోపాటు.. పేద‌ల‌కు ఇళ్లు కూడా ఇస్తున్నారు. దేశ చ‌రిత్ర‌లోనే ఏ ముఖ్య‌మంత్రి అమ‌లు చేయ‌ని విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోన్న మాట వాస్త‌వం. …

Read More »

వైసీపీ నేత‌లూ.. జాగ్ర‌త్త‌.. జ‌గ‌న్ అన్నీ గ‌మ‌నిస్తున్నారు..!

రాజ‌కీయాల్లో నేత‌లంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు. ఎవ‌రి దూకుడు వారిది. ఎవ‌రి వ్యూహాలు వారివి. నియోజ‌క వ‌ర్గాల్లో పైచేయిసాధించాల‌ని ప్ర‌తి ఒక్క నేతా ప్ర‌య‌త్నిస్తారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ కోసం ఏదో ఒక సంచ‌ల‌నాల‌కు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇది అధికారంలో ఉన్న ఏ పార్టీలో అయినా స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ దూకుడు, సంచ‌ల‌నాలు మ‌రీ ఎక్కువ‌గా ఉన్నాయి. నిజానికి ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు వివిధ సంక్షేమ కార్య‌క్రమాల‌ను …

Read More »