Trends

సంక్రాంతి రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి డబ్బే డబ్బు

ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే… పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త సర్కారు పాలన మొదలు కాగానే… రాష్ట్రంలో ఓ నూతన ఒరవడి కనిపించింది. పాలనలో దూకుడుతో వెళుతున్న కూటమి సర్కారు ఎక్కడిక్కడ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదే  ఉత్సాహం  సంక్రాంతి వేడుకల్లో కనిపించింది. బుధవారంతో సంక్రాంతి వేడుకలు పూర్తీ …

Read More »

ఆకాశంలో మరో అద్బుతం.. గెట్ రెడీ!

ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న …

Read More »

టీమిండియా న్యూ బ్యాటింగ్ కోచ్.. ఎవరతను?

భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా వరుస పరాజయాలు చవిచూడటంతో కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ స్థానాన్ని పునఃపరిశీలించి, కొత్త మార్గదర్శకుడు అవసరమని నిర్ణయించింది. సితాంశు కోటక్ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. 2023లో ఐర్లాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించిన కోటక్‌కి, …

Read More »

టీమిండియాలో తప్పిన క్రమశిక్షణ… గంభీర్ న్యూ రూల్స్?

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ప్రదర్శనపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమైన సూచనలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం తమ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఉన్నదని, దీన్ని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. గంభీర్ ముఖ్యంగా సుదీర్ఘ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని పేర్కొన్నాడు. …

Read More »

హిండెన్ బెర్గ్ చాప్టర్ క్లోజ్… కారణమేంటీ?

హిండెన్ బెర్గ్… ఈ పేరు వింటేనే పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు హడలిపోయాయి. అమెరికాకు చెందిన ఈ ఆన్లైన్ వార్త సంస్థ రాసిన కథనాలు ఆయా బహుళ జాతి సంస్థలకు ముచ్చెమటలు పట్టించాయి. ఇందులో భాగంగా… భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ ఆధ్వర్యంలోని ఆదానీ గ్రూప్ ను హిండెన్ బెర్గ్ వార్తలు బెంబేలెత్తించాయి. ఆదానీ గ్రూప్ …

Read More »

దెబ్బకు దిగి వచ్చిన మెటా.. భారత్ కు క్షమాపణలు

కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడిన ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు..మెటా అధినేత జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. సమన్లు పంపటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. అయితే.. జుకర్ చేసిన వ్యాఖ్యలు చాలా దేశాల్లో వాస్తవమే అయినా.. భారత్ …

Read More »

పాకిస్తాన్ కు రోహిత్?.. వెళ్లక తప్పదా?

అప్పుడెప్పుడో…2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై జరిపిన దాడి నేపథ్యంలో పాక్ టూర్లను బీసీసీఐ దాదాపుగా రద్దు చేసింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతోంది. అయినా కూడా టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో ప్లాన్ చేసారు. ఫలితంగా పాక్ లో అడుగుపెట్టాల్సిన అవసరం …

Read More »

ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే… వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే పతకాల నాణ్యత ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటిదాకా అసలు అనుమానాలే రాలేదు. అయితే… పారిస్ ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ ఈవెంట్ మెడల్స్ ఫై గగ్గోలు పెడుతున్నారు. ఆలా తమ చేతికి వచ్చిన మెడల్ ఇలా రంగు వెలిసి పోయిందట. ఈ మేరకు భారత …

Read More »

ప‌సిడి గ‌నిలో ప్రాణాలు పోయాయ్‌.. 200 మంది మృతి!

అది బంగారు గ‌ని! త‌వ్వుకుంటే సిరులే!! కాక‌పోతే.. ఎలాంటి అధికారిక ఉత్త‌ర్వులు లేవు. అయినా.. కొందరు పేద‌లు.. ఈ గ‌నుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమ‌ట్టుగా విక్ర‌యించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు. ఇదంతా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఆయా గ‌నుల్లోని బంగారాన్ని ప్ర‌భుత్వం త‌వ్వించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌మాదాల కార‌ణంగా ఆయా గ‌నుల‌ను వ‌దిలేసింది. దీంతో అవి పేద‌ల‌కు వ‌రంగా మారాయి. అయితే.. ఈ ప‌నిని నేరంగా భావించిన …

Read More »

గంభీర్ మెడపై వేలాడుతున్న ‘ఛాంపియన్స్’ కత్తి

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. టీమిండియా జట్టులో కీలక ప్లేయర్ గా రాణించిన గంభీర్.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ప్రతికూల ఫలితాలనే చవిచూస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లోనే టాప్ జాబ్ గా పరిగణిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ పదవిని అతడు నిర్దేశిత గడువు కంటే ముందుగానే కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. …

Read More »

YD రాజు కాదు… వెంకీ అంటే ఫ్యామిలీ రాజు !

ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి ఇదెక్కడి మాస్ అనుకోవడమొకటే తక్కువ. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టికెట్ల కోసం వస్తున్న డిమాండ్ చూసి థియేటర్ మేనేజర్ల ఫోన్లు మ్రోగుతూనే ఉన్నాయట. అవతల పాజిటివ్ టాక్ వచ్చిన డాకు మహారాజ్ ఉన్నప్పటికీ మొదటి ఛాయస్ వెంకీ మామనే నిలవడం కొంత వరకు ఊహించిందే అయినా ఈ …

Read More »

స్టార్ బక్స్… దిగి రాక తప్పలేదా?

స్టార్ బక్స్… ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇదంతా కాదండీ… స్టార్ బక్స్ పేరే ఓ బ్రాండ్. ఆ పేరు చెబితేనే రాజసం ఉట్టిపడుతుంది. ఇక అందులో దొరికే కాఫీ, స్నాక్స్ రుచి మధురమనే చెప్పాలి. అలాంటి స్టార్ బక్స్ కు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి దాపురించిందో తెలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. స్టార్ బక్స్ …

Read More »