Trends

ప్రేమ కోసం వెళ్లిన బాదల్ బాబుకు షాకిచ్చిన పాక్ పోరి!

‘ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు’ అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి గుర్తు ఉండకపోవచ్చు. ఆ పాటకు తగ్గట్లే.. అమ్మాయి ప్రేమ కోసం అతగాడి తెగింపు సంచలనంగా మారటం తెలిసిందే. ప్రేమ.. ప్రేమా అంటూ చొక్కా చించేసుకొని మరీ అందరి కళ్లు గప్పి సరిహద్దలు దాటేయటం.. అక్రమంగా పాకిస్థాన్ లోకి ప్రవేశించటం.. చివరకు అక్కడి అధికారులకు దొరికిపోయి అక్కడి జైల్లో పడిన …

Read More »

ప్రాణం పోసిన స్పీడ్ బ్రేకర్!

అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే ప్రాణం పోతే.. ఏదో రూపంలో బతికేస్తాడన్నట్లుగా ఉండే ఈ సినిమా సీన్లకు తగ్గట్లే.. తాజా రియల్ సీన్ ఉందని చెప్పాలి. చనిపోయిన వ్యక్తి.. కాసేపట్లో చితిమంటల్లో కాలిపోవాల్సిన వేళ.. అనూహ్యంగా బతికిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన రీల్ సీన్ కు …

Read More »

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డుల ఎంపికను ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ ఈ అవార్డులు అందజేయనుంది. మొత్తం నాలుగు ఖేల్ రత్న అవార్డులు, 32 అర్జున పురస్కారాలు, ఐదు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించగా, ఈ అవార్డులు రాష్ట్రపతి …

Read More »

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయినట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది. గుజరాత్‌లో సంచలనం రేపిన రూ. 450 కోట్ల పోంజీ స్కాంలో ఈ నలుగురు క్రికెటర్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసింది. ఈ కేసులో బీజెడ్ …

Read More »

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?

భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టులో అనేక ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి. సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ సందర్భంగా ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్న ప్రశ్నలు జట్టులోని మౌలిక చర్చలకు కారణమయ్యాయి. అలాగే, కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ మరింత ఆసక్తికరంగా …

Read More »

విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది. వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే …

Read More »

సిడ్నీ టెస్ట్‌… టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసీస్‌ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, మ్యాచ్ డ్రా అయినా, రద్దు అయినా సిరీస్ ఆసీస్‌ వశమే అవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌ వచ్చింది. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను గాయంతో చివరి …

Read More »

వారానికి 70 గంటలు పనా.. పెళ్లాం పారిపోతుంది

వారానికి 70 గంటల పనిపై గౌతమ్ అదానీ అదిరే మాటతరచూ వార్తల్లో నిలుస్తూ.. ఏదో ఒక సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. దేశీయ కార్పొరేట్ లో వివాదాల చుట్టూ వినిపించే పేరు ఏదైనా ఉందంటే.. అది గౌతమ్ అదానీనే. ప్రపంచం సంగతి పక్కన పెడితే.. మన దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన పారిశ్రామకవేత్త ఎవరైనా ఉన్నారంటే.. గౌతమ్ అదానీ పేరే వినిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఆయన నోటి నుంచి వ్యాపార …

Read More »

2025లో బిజీబిజీగా టీమిండియా.. కంప్లీట్ షెడ్యూల్

2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా, మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ఓటమిపాలైంది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆనందం, ఆఖరి మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని మరచిపోలేని జ్ఞాపకాలు అయ్యాయి. ఇక 2025లో మరింత ఉత్సాహంగా కొత్త విజయాలను అందుకోవడమే టీమిండియాకు లక్ష్యంగా ఉంది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఆసియా …

Read More »

2024 ముగింపు నాటికి ప్రపంచ జనాభా ఎంత?

ప్రపంచ జనాభా 2024 చివరికి ఊహించని మార్క్ ను చేరనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్లను దాటబోతుందని యుఎస్ సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం ప్రపంచ జనాభాలో 7.1 కోట్లు పెరుగుదల నమోదు కాగా, ప్రస్తుతం మొత్తం జనాభా 8,092,034,511గా ఉందని బ్యూరో వెల్లడించింది. ఇది 0.9 శాతం పెరుగుదలగా ఉన్నప్పటికీ, గత సంవత్సరం నమోదైన 7.5 కోట్ల పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనిపించిందని …

Read More »

విమాన ప్రమాదం: 181 మందిలో ఆ ఇద్దరే ఎలా బ్రతికారు?

దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిపోవడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం హృదయవిదారకమైన ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన దృశ్యాలు హృదయాలను ద్రవింపచేశాయి. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ …

Read More »

న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు రడీ అవుతున్నారా

మ‌రికొన్ని గంటల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌జ‌లు కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. భార‌త్ స‌హా.. అన్ని దేశాలూ కూడా.. ఇటీవ‌ల కాలంలో ఘ‌నంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుం టున్నాయి. ఒక్క కొరియా మాత్ర‌మే ఈ వేడుక‌ల‌కు దూరం. తాజాగా 179 మంది ప్ర‌యాణికులు విమాన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డంతో ద‌క్షిణ కొరియా సైతం ఈ సారి అధికారిక వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుంది. …

Read More »