Trends

పక్కా ప్లాన్ తోనే మావోయిస్టుల దాడి ?

అవును ఛత్తీస్ ఘడ్ తరెం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై మావోయిస్టులు విసిరిన పంజాకు సుమారు 25 మంది జవాన్లు బలైపోయారు. ఇపుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి చనిపోయిన వారిసంఖ్య 25 అని చెప్పేందుకు లేదు. నిజానికి తెలుగురాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులకు గ్రేహౌండ్స్ తరహా ట్రైనింగ్ లేదనే చెప్పాలి. అయినా సరే మావోయిస్టులను వెతుక్కుంటు …

Read More »

హైదరాబాద్‌లో ఐపీఎల్?

కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేదికల్ని ఆరుకు పరిమితం చేయడం.. ఎప్పుడూ ఐపీఎల్ జరిగే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను వేదికల జాబితా నుంచి తప్పించడం తెలిసిన సంగతే. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు అహ్మదాబాద్‌ల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉండే దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు …

Read More »

పెళ్లి చూపులకు వెళ్లి… ఆ యువతితో ఎస్కేప్… చివరికి..?

అందరిలాగే ఓ యువకుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ యువకుడికి యువతి నచ్చింది. కానీ ఇరు కుటుంబాలకు కట్నకానుకల విషయంలో పరస్పరం బేధాభిప్రాయాలు రావటం వల్ల ఈ సంబంధం వద్దనుకున్నారు. కానీ ఆ యువతీ, యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిరువురు ఫోన్ నెంబర్లను మార్చుకొని తరుచు ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది కుదరదని తెలిసిన క్షణంలో వారిద్దరూ కలిసి హైదరాబాద్ …

Read More »

బ్రేకింగ్: ఫూణెలో హోటళ్లు.. థియేటర్లు క్లోజ్..

Lockdown

ఎంతలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కేసులు పెరగటమే తప్పించి తగ్గే సూచనలు కనిపించని దుస్థితి. దేశంలో నమోదయ్యే కేసుల్లో సింహభాగం మహారాష్ట్రలోనే ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని ముంబయి తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్ననగరాల్లో ఫూణె ఒకటి. దీంతో..వైరస్ వ్యాప్తిని అరికట్టి.. కేసుల తీవ్రతను తగ్గించేందుకు వీలుగా ఫూణె డివిజనల్ కమిషనర్ కీలక ఆదేశాల్నిజారీ చేశారు. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క ఫూణెలోనే 8011 కేసుల్ని గుర్తించారు. …

Read More »

చిచ్చు పెట్టిన మొబైల్ గేమ్.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. …

Read More »

న్యూడ్ చాటింగ్ స్కాం – నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య

తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక …

Read More »

ఏప్రిల్ 1 విడుద‌ల‌: మ‌ధ్య త‌ర‌గ‌తి గుండె గుభేల్‌!!

ఏప్రిల్ 1. సాధార‌ణంగా ప్ర‌తి నెల ప్రారంభ‌మ‌య్యేది 1వ తారీకుతోనే అయినా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 మాత్రం దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ పౌరులు, మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్రం గ‌త నెల‌లో ప్ర‌వేశ పెట్టిన సాధార‌ణ బ‌డ్జెట్ అమ‌ల్లోకి వ‌స్తుండ‌డ‌మే. ఈ బ‌డ్జెట్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఎక్కువ‌గా వినియోగించే వ‌స్తుల‌పై ప‌న్నులు, ధ‌ర‌లు పెరుగుతుండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. …

Read More »

600 మంది చనిపోయారా ?

మయున్మార్ సైన్యం కాల్పుల్లో ఇప్పటిదాకా సుమారు 600 మందికిపైగా చనిపోయినట్లు అంచనా. మయున్మార్ లోని సైనిక పాలనపై జనాలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యం చేతిలో యావత్ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేశారు సైన్యాధికారులు. వీరి చెరనుండి పరిపాలనను విడిపించుకునేందుకు దేశంలోని నలుమూలల్లోని జనాలు స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనలు తారాస్ధాయికి చేరుకోవటంతో మూడురోజుల క్రితం సైన్యం మొదటిసారి జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. …

Read More »

శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్?

ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం మొదలుకుని.. టీటీడీ వెబ్ సైట్లో తప్పిదాలు, శ్రీవారి భూముల వేలానికి టెండర్, ప్రసాదాల ధరల పెంపు, ఎన్నికల సందర్భంగా లడ్డూల పంపకం లాంటి అనేక అంశాలు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు మరోసారి టీటీడీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇంతకుముందు తలెత్తిన వివాదాలతో పోలిస్తే ఇది కాస్త పెద్దదే. …

Read More »

మరోసారి తన రికార్డును బ్రేక్ చేసిన మన ఉసేన్ బోల్ట్

పరుగు పందెం అన్నంతనే.. అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో వంద మీటర్ల పరుగు పందాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసే అథ్లెట్ గా ఆయనకున్న కీర్తి ప్రతిష్ఠల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోల్ట్ కు సరితూగే దేశీయ బోల్ట్ గా పిలుచుకునే పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ. కంబళ పోటీల్లో తొలిసారి ఉసేన్ బోల్ట్ ను మించిన రికార్డును నెలకొల్పి దేశ …

Read More »

మాస్కు పెట్టుకోకుంటే రెండేళ్లు జైలు.. ఎక్కడంటే?

వినేందుకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి.. పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం …

Read More »

రేర్ కఫుల్.. రూ.6కోట్లను ఇచ్చేసిన సామాన్యులు

కాలం మారింది. విలువలు మారాయి. తోటి మనుషుల వరకు ఎందుకు.. సుఖం కోసం సొంతోళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా చంపేసే పాడు కాలం వచ్చేసింది. తాము అనుకున్నది దక్కించుకోవటం కోసం దేనికైనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇప్పటి రోజుల్లో.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ‘వావ్’ అనిపించే నిజాయితీ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఎర్నాకులానికి చెందిన …

Read More »