భారత క్రికెట్ అభిమానులను కుదిపేసే విషయం ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు ఎక్కడా లేవు. కేవలం టాప్ 10 నుంచి తప్పించడమే కాదు, టాప్ 100లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవలే రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గవ స్థానంలో ఉండగా, ఒక్కరాత్రిలోనే ఈ మార్పు రావడంతో సోషల్ మీడియాలో “రిటైర్మెంట్ ఎప్పుడు ఇచ్చారు?” అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు అనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐసీసీ లిస్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. గత వారం బాబర్ ఆజమ్ సిరీస్‌లో విఫలమైన తర్వాత రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. కోహ్లి మాత్రం నాల్గో స్థానంలో నిలిచాడు.
కానీ, తాజా అప్‌డేట్‌లో ఇద్దరి పేర్లూ మాయం కావడంతో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. “ఇద్దరూ వన్డేలకూ గుడ్‌బై చెప్పారా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, ఈ పరిణామంపై ఐసీసీ త్వరగానే క్లారిటీ ఇచ్చింది. ఇది సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన సమస్య మాత్రమేనని, ఇద్దరి స్థానాలు అలాగే ఉన్నాయని వెల్లడించింది.
తర్వాత అప్‌డేట్‌లో రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గో స్థానంలో తిరిగి కనిపించారు. అయినప్పటికీ, ఈ చిన్న తప్పిదం అభిమానుల హృదయాల్లో పెద్ద కలకలం రేపింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు గెలుపులో రోహిత్ కోహ్లి కీలక పాత్ర పోషించారు. అనుభవజ్ఞులైన ఈ ద్వయం ఇంకా వన్డే క్రికెట్‌లో జట్టుకు అవసరమే అని అందరూ భావిస్తున్నారు. కానీ, వయస్సు పెరుగుతున్న తరుణంలో కొత్త తరం ఆటగాళ్లకు మార్గం ఇవ్వాలనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates