Trends

గర్భిణీలకు SBI షాకింగ్ న్యూస్

మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.   అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను …

Read More »

కొవిడ్ టీకా తయారీ యోధులకు ‘పద్మ’ పురస్కారం

యావత్ ప్రపంచాన్ని మహమ్మారి పట్టేసిన వేళలో.. భవిష్యత్తు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాని సందర్భంలో.. తెలియని దారిలో మిణుకు మిణుకుమనే ఆశల లాంతరును పట్టుకొని వెతుక్కుంటూ వెళ్లిన వ్యాక్సిన్ తయారీ యోధులకు తాజా పద్మ పురస్కారాల్లో చోటు లభించింది. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా.. సుచిత్ర ఎల్లాలకు కేంద్రం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ శాస్త్రవేత్తల …

Read More »

5G: మన దేశంలో ఎప్పుడు?

ఇప్పుడు అందరూ 5జీ మాట్లాడుకుంటున్నారు. మిలీనియం ముందు వరకు ప్రజల జీవితాలకు ఏ మాత్రం పరిచయం లేని డిజిటల్ టెక్నాలజీ.. ‘2జీ’తో మొదలైంది. చూస్తుండగానే 3జీ రావడం.. అది కాస్తా పాపులర్ అవుతున్న వేళలోనే 4జీలోకి వచ్చేశాం. ఇప్పుడు చాలా దేశాల్లో 5జీ నడుస్తోంది. మన దేశంలోకి అప్పుడే 5జీ ఫోన్లు వచ్చేశాయి. చాలామంది వాడే ఫోన్లు 5జీ అయినా.. ఇప్పటికి దేశంలో అందుబాటులో ఉన్న 4జీతోనే సరిపెట్టుకునే పరిస్థితి. …

Read More »

కోహ్లీకి ఎందుకంత పట్టుదల?

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ఈ మధ్య ప్రతికూల కారణాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత సాధారణ ఫాంలో ఉన్నాడతను. పూర్తిగా ఫెయిల్ కావట్లేదు. అప్పుడప్పుడూ అర్ధశతకాలు కొడుతున్నాడు కానీ.. అతడి స్థాయికి ఇది సాధారణ ప్రదర్శనే. ఒకప్పుడు సెంచరీల మోత మోగించిన అతను.. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనికి తోడు అనూహ్య పరిణామాల మధ్య …

Read More »

అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది. అలాంటిది 23వ …

Read More »

ఊహించ‌ని వివాదంలో కోహ్లి

విరాట్ కోహ్లికి కెరీర్లో ఎన్న‌డూ లేనంత బ్యాడ్ టైం న‌డుస్తోంది. అంత‌ర్జాతీయ కెరీర్ ఆరంభ‌మైన ద‌గ్గ‌ర్నుంచి.. రెండేళ్ల ముందు వ‌ర‌కు చూస్తే పైకి ఎద‌గ‌డ‌మే త‌ప్ప కిందికి ప‌డ‌ట‌మే లేదు. ప్ర‌పంచంలోనే మేటి బ్యాట్స్‌మ‌న్‌గా పేరు తెచ్చుకోవ‌డంతో పాటు మూడు ఫార్మాట్ల‌లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని త‌న హ‌వాను న‌డిపించాడు. కానీ గ‌త రెండేళ్ల‌లో మొత్తం క‌థ మారిపోయింది. ఫామ్ ప‌డిపోయింది. రెండేళ్ల‌కు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచ‌రీ …

Read More »

మాల్యాకు లండన్ కోర్టు షాక్

ఆర్ధిక నేరగాళ్ళ బుద్ధి ఎక్కడున్న ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక దేశంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, మరో దేశంలో తీసుకున్న అప్పులను చెల్లించటం అంటు ఉండదని తాజాగా నిరూపణైంది. దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని పారిపోయిన విజయమాల్య వ్యవహారం ఒకటి తాజాగా వెలుగు చూసింది. మాల్యా ఆస్తుల విషయంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆయన వైఖరికి నిదర్శనంగా మారింది. విషయం ఏమిటంటే …

Read More »

టెస్లా కంపెనీ.. ఇండియాలోకి ఎందుకు రావట్లేదంటే?

లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ఒకటైన టెస్లా కంపెనీ ఇండియాలో కార్లెందుకు తయారు చేయలేదంటూ ఇటీవల ఓ నెటిజన్.. ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే.. అందుకాయన బదులిస్తూ భారత ప్రభుత్వంతో తమకు చాలా ఇబ్బందులు ఉన్నట్లుగా ట్వీట్ చేశారు. దానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను తెలంగాణకు పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రినని పేర్కొంటూ.. టెస్లా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి …

Read More »

ఏపీలో `చింతామ‌ణి`పై నిషేధం.. రీజ‌నేంటి?

చింతామ‌ణి- ఈ పేరు విన‌గానే నాట‌క ప్రియులు ప‌రుగులు పెట్టుకుంటూ వెళ్లిపోతారు. ప‌నులు మానుకునైనా.. చింతామ‌ణి నాట‌కం ప్ర‌ద‌ర్శించే చోట‌కు వెళ్లి.. క‌న్నులార చూసి.. క‌డుపారా న‌వ్వుకుని వ‌స్తారు. అంతేకాదు.. గ‌తంలో టీవీలు లేని రోజుల్లో ఆధ్యాత్మికంగా చూసుకున్న‌ప్పుడు హ‌రిశ్చంద్ర నాట‌కం ఎంత పాపుల‌రో.. సామాజికంగా చూసుకుంటే.. చింతామ‌ణి.. దానికి మించిన పాపుల‌ర్ అన‌డంలో సందేహం లేదు. దీనికి కార‌ణం.. ఈ నాట‌కంలో ఉన్న పాత్ర‌లు.. ఈ పాత్ర‌ల మ‌ధ్య …

Read More »

క‌రోనా ప‌నిప‌ట్టే.. మొక్క‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్ను  ఐఐటీ పరిశోధకులు ఓ మొక్కలో గుర్తించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి కరోనా వైరస్ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కల్లో లభించే ఫైటోకెమికల్స్ కీలకంగా మారనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ మొక్క‌లు హిమాల‌యాల్లో మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని అంటున్నారు. …

Read More »

బార్లు తెరిచి స్కూళ్లు మూసేస్తారా?

కరోనా సహా వాటి కొత్త వేరియంట్‌ల పుట్టుక వల్ల పాఠశాలలను మూసివేయడాన్ని ప్రస్తుతానికి సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావ్‌ద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త కొవిడ్ వేరియంట్లు వస్తే పాఠశాల మూసివేతను చివరి మార్గంగా అనుసరించాలని సూచించారు. పాఠశాలలు సురక్షితంగా లేకపోవడం సహా తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని …

Read More »

కోహ్లి స్థానంలో ఎవరు?

టెస్టు కెప్టెన్సీనుంచి తప్పుకోవడం ద్వారా విరాట్ కోహ్లి పెద్ద షాకే ఇచ్చాడు ఇడియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి. నాలుగైదేళ్లుగా మూడు ఫార్మాట్లలో అతను భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాటే కానీ.. కెప్టెన్సీ సక్సెస్ రేట్ అన్ని ఫార్మాట్లలో చాలా బాగుంది. ముఖ్యంగా టెస్టుల్లో అతడి రికార్డు అద్భుతం. ఏ భారత కెప్టెన్‌కూ  సాధ్యం కానన్ని విజయాలందించాడు జట్టుకి. అతను జట్టు పగ్గాలందుకునే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం …

Read More »