క్రికెటర్ యూజవేంద్ర చాహల్ – నటి, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాతా చర్చలు ఆగట్లేదు. తాజాగా ధనశ్రీ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తమ వివాహ విరమణకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా చాహల్ “Be Your Own Sugar Daddy” అనే టి షర్ట్ వేసుకుని చివరి విడాకుల వాదనకు హాజరైన విషయంపై ఆమె మండిపడ్డారు. “అలాంటి మాటలు మెసేజ్‌లో పంపితే సరిపోయేది, ఎందుకు కోర్టుకు ఆ టి షర్ట్ వేసుకుని రావాలి?” అంటూ ధనశ్రీ వ్యాఖ్యానించారు.
ధనశ్రీ తెలిపిన వివరాల ప్రకారం, విడాకుల తీర్పు వెలువడే సమయంలో తాను ఆవేశంతో అదుపు కోల్పోయి బహిరంగంగానే కన్నీళ్లుపెట్టారట. అప్పుడు చాహల్ బయటకు వెళ్లిపోవడం, పైగా అలా హాస్యాస్పదంగా కనిపించే టి షర్ట్ వేసుకోవడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఆ క్షణం ప్రైవేట్‌గా ఉండాల్సింది. కానీ, చాహల్ వ్యవహారం వలన అది పబ్లిక్ డిస్కషన్‌గా మారిపోయిందని విమర్శించారు.
ఇక చాహల్ మాత్రం కొన్ని రోజుల క్రితం మరో పాడ్‌కాస్ట్‌లో తన వాదనను వినిపించారు. “నాకు మోసగాడని పేరు పెట్టారు, కానీ నేను ఎప్పుడూ మోసం చేయలేదు. నేను ఎప్పుడూ ఇచ్చేవాడినే తప్ప అడిగేవాడిని కాదు. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. మహిళలను గౌరవించడం నాకు బాగా తెలుసు,” అంటూ తాను నిష్కల్మషుడినని తెలిపారు.
వివాహం తర్వాత రెండున్నరేళ్లకే ఈ జంట వేరు అయ్యారు. 2025 మార్చి 20న బాంద్రా ఫ్యామిలీ కోర్టు చివరి తీర్పు ఇచ్చి, అధికారికంగా వీరి సంబంధం ముగిసింది. 18 నెలలుగా వేరుగా నివసిస్తున్న వీరు, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ ప్రక్రియలో చాహల్ 4.75 కోట్లు అలిమనీగా చెల్లించినట్లు సమాచారం. ఇదే సమయంలో చాహల్ పేరు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఆర్జే మహ్వాష్‌తో ఆయన తరచూ కనిపించడం వలన కొత్త సంబంధం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates