Trends

‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్క‌లు తీస్తున్న ఐటీ!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ఈ ఏడాది జూన్ – జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్ర‌మాలు, లంచాలు, ఎన్నిక‌ల్లో ఓటర్ల కొనుగోలు ప్ర‌క్రియ‌లు వంటివాటికి అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఉద్దేశంతో 2016 లో మోడీ ప్ర‌భుత్వం ఈనిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత‌.. వాటి స్థానంలో మ‌రింత పెద్ద నోట్ల‌ను తీసుకు వ‌చ్చారు. అదే 2000 నోటు. వీటిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు.. అవినీతిమ‌రింత పెరిగింద‌న్న నిఘా విభాగాల …

Read More »

బ్రెజిల్‌లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు

బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఊహించని రీతిలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మినాస్ గెరైస్‌లో నిర్వహించిన ఈ వేలంలో, వియాటినా-19 అనే ఆవును ఏకంగా 4.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.40 కోట్లు) ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ ఘనతతో ఈ ఆవు గిన్నిస్ రికార్డుల పుటల్లో చోటు సంపాదించింది. వియాటినా-19 …

Read More »

భారత అక్రమ వలసదారులకు అమెరికా హెచ్చరిక

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారతీయులను సైతం డిపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా, తాజాగా అమెరికా రాయబారి ప్రతినిధి దీనిపై స్పష్టతనిచ్చారు. అక్రమ వలసలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేస్తోందని, దేశ సరిహద్దులను పటిష్టం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై అమెరికాలో అక్రమంగా నివసించాలనుకోవడం ఎంతో ప్రమాదకరమని, అలాంటి వ్యక్తులను వెంటనే బయటకు పంపించే ప్రక్రియ …

Read More »

గజదొంగ ప్రభాకర్ లైఫ్ స్టైల్ తెలిస్తే నోటమాట రాదంతే

బత్తుల ప్రభాకర్.. శనివారం రాత్రికి ముందు వరకు కూడా పోలీసు రికార్డుల్లో మాత్రమే ఫేమస్. ఎప్పుడైతే ప్రిజం పబ్ లో కాల్పులకు తెగబడ్డాడో.. ఒక్కసారిగా అందరి చూపు అతడి మీద పడింది. అతడి క్రిమినల్ హిస్టరీ గురించి ఆరా తీసిన పోలీసులు మొదలు.. అతడి గురించి వివరాలు తెలిస్తే కొద్దీ నోట మాట రాలేదంతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కు పైగా కేసులు.. తప్పించుకొని తిరుగుతూ.. పోలీసులకు సైతం సవాలుగా …

Read More »

మిస్టరీ స్పిన్ తో హిస్టరీ

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేలా తన మిస్టరీ స్పిన్ తో మాయ చేశాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు తీసిన అతను, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. చివరి మ్యాచ్‌లో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో, …

Read More »

భారతీయ రైల్వే సూపర్ యాప్… ఇది కదా కావాల్సింది!

భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్ (SwaRail Superapp)’ పేరిట తీసుకురావబడిన ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండడంతో సాధారణ వినియోగదారులు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లలో కేవలం వెయ్యిమందికి మాత్రమే టెస్టింగ్ కోసం అవకాశం కల్పించారు. ఈ యాప్ …

Read More »

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో భారీ డిమాండ్‌ను సృష్టించింది. స్థానికంగా కుంభాభిషేకం రేవులో విక్రయించగా, ఓ వ్యాపారి దాన్ని ఏకంగా రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో, ఆ స్థాయికన్నా ఎక్కువగా కచిడి చేపకు ఆదరణ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే, …

Read More »

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్‌పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్నాడు. మొదటి రౌండ్‌లోనే గుకేశ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ, టైబ్రేకర్ పోరులో తన దిట్టమైన ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నమెంట్‌ను గెలిచిన రెండో …

Read More »

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి, 13 సిక్సర్లు, 10 బౌండరీలు బాదాడు. తొలి అర్ధశతకాన్ని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్, ఆపై మరింత వేగాన్ని పెంచి మరో 50 పరుగులకు కేవలం 20 బంతులే తీసుకున్నాడు. …

Read More »

వరల్డ్ కప్ వీర వనితలకు బీసీసీఐ భారీ నజరానా!

మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి ప్రకటించింది. మొత్తం జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. మలేసియాలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన టీమిండియా, చరిత్ర సృష్టించింది. సఫారీలను కేవలం 82 పరుగులకే కట్టడి చేసిన భారత అమ్మాయిలు, 83 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో …

Read More »

ఇంత జాలీగా వీరు ఎప్పుడూ కనిపించలేదు

ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో… భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన సాంకేతిక నిపుణుడు… ప్రపంచ శ్రేణి సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇంకొకరేమో… ప్రపంచంలోనే అగ్ర దేశాలుగా విరాజిల్లుతున్న వాటిలో ఓ దేశానికి ఏకంగా ప్రధాన మంత్రిగా పని చేసిన వారు. అంతేనా… ఆ చివరన బాలీవుడ్ నే కాకుండా యావత్తు భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఓ …

Read More »

వీడో రౌడీ హీరో!.. సినిమాను మించిన స్టోరీ వీడిది!

సినిమాలు… అది కూడా తెలుగు సినిమాల్లో దొంగలను హీరోలుగా చిత్రీకరిస్తూ చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. వాటిలోని మలుపులను మించిన రియల్ స్టోరీ ఒకటి తెర మీదకు వచ్చింది. శనివారం వీకెండ్ సందర్భంగా ఈ స్టోరీని సైబరాబాద్ పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు నిజంగానే సినిమాల్లో కనిపించే రౌడీ హీరోనే. ఎందుకంటే…అతడి చోరీ కళ సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువైనది కాదు. ఇంకా చెప్పాలంటే …

Read More »