Trends

ఐటీ జీవులకు ఊరటనిచ్చేలా హైసియా సర్వే రిపోర్టు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. ఇంతకాలం ఉద్యోగం చేయాలంటే కచ్ఛితంగా ఆఫీసుకు వెళ్లాలన్న ఉద్యోగాల్ని సైతం.. విపత్తు వేళ ఇంట్లో ఉండే చేసే విధానానికి తెర తీసింది. ఇక.. అప్పుడప్పుడు ఆప్షనల్ గా ఉండే వర్క్ ఫ్రం హోం ఐటీ.. ఐటీయేతర ఉద్యోగాల్లోనూ వచ్చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న విషయంపై హైదరాబాద్ సాఫ్ట్ …

Read More »

జియో మరో సంచలనం

దేశీయ టెలికాం రంగంలో జియో ఇప్పటికే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1 జీబీ ఇంటర్నెట్ డేటా కోసం పెట్టే ఖర్చుతో నెల మొత్తానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రకంపనలు రేపింది జియో. దెబ్బకు కోట్ల మంది జియో వైపు మళ్లాయరు. ఇతర నెట్‌వర్క్‌లన్నీ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి అవి కూడా తగ్గి జియోతో సమానంగా …

Read More »

గుడ్ న్యూస్‌.. క‌రోనాలో పీక్స్‌ను దాటిపోయామా?

ఆరు నెల‌లకు పైగా చూస్తున్నాం. ఇండియాలో క‌రోనా తీవ్ర‌త అంత‌కంత‌కూ పెరుగుతోంది త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. క‌రోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ అది త‌ప్ప‌నే తేలుతోంది. జులై-ఆగ‌స్టు నెల‌ల్లోనే క‌రోనా తీవ్ర‌త ప‌తాక స్థాయికి చేరుతుంద‌ని.. ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఒక ద‌శ‌లో అంచ‌నా వేశారు. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. అంత‌కంత‌కూ కేసులు పెరుగుతూ వ‌చ్చాయి త‌ప్ప త‌గ్గ‌లేదు. 50 వేలు, 60 వేలు, 70 …

Read More »

రఫేల్ ను నడపనున్న మహిళా పైలెట్ ఎవరు?

భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు. అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం …

Read More »

ఐపీఎల్ ప్రేక్షకులను భలే థ్రిల్ చేశారే..

కరోనా దెబ్బకు దాదాపు నాలుగు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. రెండు నెలల కిందట ధైర్యం చేసి బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో నిర్వహించిన ఇంగ్లాండ్-వెస్టిండీస్ క్రికెట్ సిరీస్‌తో తిరిగి క్రికెట్ ఊపిరి తీసుకుంది. ఐతే కరోనా దెబ్బకు క్రికెట్ మైదానాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అభిమానుల్ని అనుమతించకపోవడంతో స్టాండ్స్ అన్నీ బోసిపోయాయి. మైదానంలో ఏం జరిగినా హడావుడి లేదు. ఆ సిరీస్‌తో పాటు ఆ తర్వాత …

Read More »

ఐపీఎల్ మొదలైపోయింది.. బార్లు తెరవండమ్మా

కరోనా ధాటికి ఇండియాలో లాక్ డౌన్ అమలవడంతో రెండు నెలల పాటు అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ షరతుల్ని ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చారు. వివిధ వ్యాపారాలు పున:ప్రారంభమయ్యాయి. యధావిధిగా నడుస్తున్నాయి. ఐతే కొన్నింటి మీద మాత్రం నిషేధం కొనసాగుతోంది. థియేటర్లకు ఇంకా అనుమతులు రాలేదు. బార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు వాటి మీద నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాయి. ఆ రంగంలోని వాళ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం …

Read More »

66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయాయట

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ ను తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి అత్యధిక కేసుల నమోదులో దూసుకెళుతున్న భారత్ లో.. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న విపరిణామాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలైంది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో.. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లుగా వెల్లడైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి.. …

Read More »

ఐపీఎల్ అభిమానుల‌కు ఒక బ్యాడ్ న్యూస్

mayanti langer

యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్‌ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మ‌యంతి ప్ర‌త్యేకం. మిగ‌తా ఇద్ద‌రూ ప్ర‌ధానంగా గ్లామ‌ర్‌ను న‌మ్ముకుంటే.. మ‌యంతి గ్లామ‌ర్‌కు తోడు గొప్ప విష‌య …

Read More »

అంటే ఇంకో ఆర్నెల్లు కరోనాతో సహజీవనమే

కరోనా వ్యాక్సిన్ ఇదిగో వచ్చేస్తోంది అదిగో వచ్చేస్తోంది అని ప్రభుత్వ వర్గాలే ఊరించాయి. ఆగస్టు 15న స్వాంతంత్ర్య దినోత్సవానికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుందని కొన్ని నెలల కిందట గొప్పలు పోయారు. కానీ ఈ ఏడాది చివరికి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆ దిశగా ఎలాంటి సంకేతాలూ అందడం లేదు. ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది కొన్నేళ్ల పాటు సాగే ప్రక్రియ. కరోనా తీవ్రత …

Read More »

క‌రోనా నుంచి కోలుకున్నారా.. లైట్ తీస్కోకండి

క‌రోనా వ‌చ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జ‌నాలు. క‌రోనా రాక‌ముందు, వ‌చ్చాక ఉన్న భ‌యం, ఆందోళ‌న అంతా ప‌క్క‌కు వెళ్లిపోతాయి. వైర‌స్ వ‌చ్చి వెళ్లిపోయింది. ఇక మ‌న‌కేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. క‌రోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ‌ హెచ్చ‌రించింది. ఈమేర‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వైరస్‌ …

Read More »

కోవాగ్జిన్ వాడిన జంతువుల పరిస్థితేంటి?

కరోనాతో అల్లాడిపోతున్న ఇండియా.. కోవాగ్జిన్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రయోగాల్లో మిగతా అన్ని కంపెనీల కంటే చాలా ముందంజలో ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరిది. రెండు నెలల కిందటే ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ మొదలైన సంగతి తెలిసిందే. ముందు జంతువులకు, ఆ తర్వాత మనుషులకు ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూస్తున్నారు. మనుషుల మీద వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల గురించి …

Read More »

ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన.. ప్లాస్మా పని చేయట్లేదట

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కోవిడ్ -19.. ఒక పట్టాన కొరుకుడుపడనిదిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఈ వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో పెద్ద ఎత్తున సవాళ్లు ఎదుర్కోవటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. చికిత్సలోనూ ఎదురవుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కోవిడ్ వైద్యంలో ప్లాస్మా చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లుగా ఇప్పటివరకు విన్నాం. కానీ.. అసలు వాస్తవం ఏమిటంటే.. అంటూ …

Read More »