Trends

కొత్త ట్రెండ్… డబుల్ మాస్క్ !

భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే. మరి.. రెండో వేవ్ లో ముఖానికి …

Read More »

కొవిడ్‌ వ్యాక్సిన్.. ముక్కులో వేస్తే..?

ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినపుడు.. జనాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. వ్యాక్సిన్ వేసుకోవడానికి జనాలు రాక టీకా కేంద్రాలు వెలవెలబోయిన పరిస్థితి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని జనాలు మిన్నకుండిపోయారు. వ్యాక్సిన్ ప్రభావాల మీద కూడా రకరకాల ప్రచారాలు జరగడం ఈ వ్యతిరేకతకు కారణం. కానీ గత కొన్ని వారాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడం, ఫస్ట్ వేవ్‌ను మించి …

Read More »

హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కంప్లైంట్ చేయొచ్చు

కరోనా సెకండ్ వేవ్ వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండేందుకు ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన శాఖలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మూడు పోలీసు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) లోని ముగ్గురు పోలీసు కమిషనర్లు (అంజనీకుమార్, సజ్జన్నార్, మహేశ్ భగవత్) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు తీసుకునే నిర్ణయాలు చూసినప్పుడు.. మిగిలిన వారి కంటే వారే బెటర్ అన్న భావన కలుగక మానదు. సాధారణంగా పోలీసులు పోలీసింగ్ …

Read More »

మేలో ఇంత భయంకరంగా ఉంటుందా ?

కరోనా వైరస్ తీవ్రత రాబోయే మే నెలలో మరింత భయంకరంగా ఉండబోతోందా ? అవుననే అంటున్నారు అమెరికా మిషిగన్ యూనివర్సిటిలోని అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా యావత్ దేశమంతా వణికిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ప్రపంచంలో మరేదేశంలో లేనంతగా ఇక్కడ రోజుకు 3.35 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతాయని ఎవరు అంచనా …

Read More »

ఎస్‌యూవీ అమ్మేసి ప్రాణాలు కాపాడుతున్నాడు

కరోనా కాలంలో ఎందరో మానవతా వాదులు బయటికి వచ్చారు. తమ స్థాయితో సంబంధం లేకుండా సేవా భావాన్ని చాటి హీరోలుగా నిలిచారు. ఏడాది ముందు వరకు ఒక మామూలు నటుడిగా ఉన్న సోనూ సూద్.. కరోనా కాలంలో అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా నిలిచాడు. ఇప్పటికీ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా బారిన పడ్డప్పటికీ.. రోజూ తనకు వచ్చే వేలాది విజ్ఞప్తులను పరిశీలించి వీలైనంత వరకు …

Read More »

ఆక్సిజన్ ఎవరికి అవసరమో తెలుసా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ …

Read More »

కొవిడ్ కల్లోలం.. హృదయం ద్రవించే ఒక ఫొటో

మనిషి చనిపోతే వారిని ఈ లోకం నుంచి సాగనంపే విషయం ప్రతి మతానికీ ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు ఆయా మతస్థులు. చివరి గడియల్లో వెంట ఉండాలని.. చనిపోయిన మనిషిని చివరి చూపు చూసుకోవాలని.. దగ్గరుండి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకాలని కుటుంబ సభ్యులే కాదు.. సన్నిహితులందరూ ఆశిస్తారు. వీటన్నింటికీ …

Read More »

కరోనా కల్లోలం.. వైద్యురాలి వీడియో వైరల్

గత ఏడాది ఈ సమయానికి కరోనా భయంతో జనాలు ఎలా వణికిపోయారో తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బకు అందరూ ఇంటిపట్టునే ఉంటూ కరోనా కల్లోలం గురించి తెలుసుకుంటూ బయటికి అడుగు పెట్టాలంటే భయపడిపోయారు. ఎక్కడ ఏది ముట్టుకోవాలన్నా.. ఎవరిని కలవాలన్నా.. ఏం చేయాలన్నా అనుమానమే. కానీ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం తగ్గుతూ రావడంతో జనాల్లో భయం పోయింది. సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్నా జనాల్లో ఒకప్పటిలా భయం …

Read More »

టీకా వేసుకున్నాక.. కరోనా వచ్చే రిస్కు ఇంతేనట!

ఓవైపు కరోనా ఆందోళన.. మరోవైపు వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. దేన్నిపట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పే మాటను నమ్మేటోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే వారికి మాత్రం తిప్పలు తప్పువు. అదే సమయంలో.. ప్రభుత్వం చెప్పేదానికి.. తమ కళ్ల ముందు కనిపించే అంశాల్ని లింకు వేసుకునే వారికి వచ్చే సందేహాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో చాలానే …

Read More »

రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తప్పదా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా కరోనా వైరస్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతోంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం 35 మంది చనిపోయారు. ఏపికి నాలుగువైపులా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. వీటిల్లో తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో ప్రతిరోజు వేలాదికేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం ఏపిపైన కూడా పడుతోంది. మొదటి దశలో …

Read More »

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంతకమ్ముతున్నారంటే..

నెల రోజుల ముందు దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లు వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, ఇక భయం లేదని భావించి జనాలు వ్యాక్సినేషన్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు జనాల్లో మళ్లీ భయం కనిపిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. కానీ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేదు. ఐతే ఉత్పత్తి పెంచడానికి కేంద్ర …

Read More »

కేసీఆర్ కర్ఫ్యూ మాటకు హైదరాబాద్ రెస్సాన్స్ ఇదే

కేసులు పెరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి మహా ప్రభో.. అన్న విన్నపాల్ని పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు వెంటనే స్పందించటం.. మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. ఈ జీవో విడుదల కావటానికి కొన్ని గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ గా తేలటం షాకింగ్ గా …

Read More »